పెళ్లిపై హిమజకు నెటిజన్ సూటి ప్రశ్న: అప్పుడు ఇద్దరితో వివాహం.. ఇప్పుడేమో షాకింగ్‌గా!

గతంతో పోలిస్తే ఈ మధ్య కాలంలో తెలుగు సినీ ఇండస్ట్రీలో లోకల్ అమ్మాయిలు ఎక్కువగా సందడి చేస్తున్నారు. అదిరిపోయే టాలెంట్‌తో వరుసగా ఆఫర్లను దక్కించుకుంటూ కెరీర్ పరంగా ఫుల్ బిజీ అయిపోతున్నారు. అలాంటి వారిలో గుంటూరు చిన్నది హిమజ ఒకరు. ముందుగా బుల్లితెరపై సందడి చేసిన ఈ భామ.. ఆ తర్వాత సినిమాల్లోనూ నటించింది.

ఈ క్రమంలోనే బిగ్ బాస్ షోలోకి ఎంట్రీ ఇవ్వడంతో ఒక్కసారిగా ఫేమస్ అయింది. అప్పటి నుంచి ఈమె గురించి ఎన్నో వార్తలు వైరల్ అవుతున్నాయి. అందులో హిమజ పెళ్లి గురించి తరచూ ఓ సెన్సేషనల్ న్యూస్ హాట్ టాపిక్ అవుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా సోషల్ మీడియా ద్వారా ఈ అమ్మాయి తన వివాహం గురించి స్పందించింది. ఆ వివరాలు మీకోసం!

స్వయంవరంతో హిమజ పాపులర్

స్వయంవరంతో హిమజ పాపులర్

నటన మీద ఉన్న ఆసక్తితో హిమజ హైదరాబాద్‌లో అడుగు పెట్టింది. కెరీర్ ఆరంభంలో సీరియళ్లలో నటించే అవకాశాన్ని అందుకుంది. 'స్వయంవరం' అనే సీరియల్ ద్వారా ఇండస్ట్రీలోకి పరిచయం అయిన ఆమె.. 'కొంచెం ఇష్టం కొంచెం కష్టం' అనే సీరియల్‌తో నటిగా మంచి గుర్తింపును తెచ్చుకుంది. ఈ క్రమంలోనే ఎన్నో ఆఫర్లను దక్కించుకుని యమ పాపులర్ అయింది.

వరుస సినిమాలు.. ఫుల్ బిజీగానే

వరుస సినిమాలు.. ఫుల్ బిజీగానే

తెలుగు అమ్మాయి హిమజ అద్భుతమైన టాలెంట్‌తో ఎన్నో అవకాశాలను అందుకుంది. తన కెరీర్‌లో 'శివమ్', 'నేను శైలజ', 'ధృవ', 'శతమానంభవతి', 'స్పైడర్', 'ఉన్నది ఒకటే జిందగీ', 'వినయ విధేయ రామ', 'చిత్రలహరి', 'వరుడు కావలెను' సహా ఎన్నో చిత్రాల్లో మంచి మంచి పాత్రలను పోషించింది. తద్వారా వరుస ఆఫర్లతో బిజీగా మారింది.

బిగ్ బాస్‌ ఛాన్స్.. మధ్యలోనే ఔట్

బిగ్ బాస్‌ ఛాన్స్.. మధ్యలోనే ఔట్

వరుస ఆఫర్లతో సాగిపోతోన్న సమయంలో హిమజ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. మూడో సీజన్‌కు కంటెస్టెంట్‌గా వచ్చిన ఆమె... తనదైన మార్కు చూపించి పాపులారిటీని సొంతం చేసుకుంది. నిజాయితీగా ఆడుతూ.. ఉన్నది ఉన్నట్లు చెబుతూ ప్రేక్షకుల నుంచి ఓట్లను రాబట్టింది. కానీ, కొన్ని గొడవల కారణంగా మధ్యలోనే ఎలిమినేట్ అవ్వాల్సి వచ్చింది.

హీరోయిన్‌గా.. సైకో పాత్రలో రచ్చ

హీరోయిన్‌గా.. సైకో పాత్రలో రచ్చ

హిమజ హీరోయిన్‌గా 'జ' అనే సినిమాను చేసింది. ప్రతాప్ రాజ్ హీరోగా నటించిన ఈ సినిమాను సైదిరెడ్డి చిట్టెపు తెరకెక్కించాడు. ఈ సినిమా ఓటీటీలో నేరుగా విడుదలైంది. అలాగే, హిమజ ఆ మధ్య 'కనబడుటలేదు' అనే సినిమాలోనూ నటించింది. ఇందులో ఆమె ఓ రకంగా సైకో పాత్రను పోషించింది. ఈ చిత్రం హిట్ కాకున్నా నటిగా ఈ అమ్మడికి మంచి పేరు తెచ్చి పెట్టింది.

పెళ్లిళ్లు అంటూ.. గట్టి వార్నింగ్‌తో

పెళ్లిళ్లు అంటూ.. గట్టి వార్నింగ్‌తో

చాలా కాలంగా హిమజ పెళ్లి గురించి ఎన్నో రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే ఆమె రెండు పెళ్లిళ్లు చేసుకుందని కూడా ప్రచారం జరిగింది. దీనిపై ఆమె స్పందిస్తూ.. 'నా పెళ్లి గురించి ఇష్టం వచ్చినట్లు రాయకండి. మా వాళ్లు చాలా సెన్సిటివ్. వాళ్లు బాధ పడుతున్నారు. అయినా నా పెళ్లికి, విడాకులకు నన్నైనా పిలవండి' అంటూ ఓ రేంజ్‌లో ఇచ్చి పడేసింది.

 వివాహం గురించి నెటిజన్ ప్రశ్న

వివాహం గురించి నెటిజన్ ప్రశ్న

అప్పట్లో పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చిన సమయంలోనే హిమజ.. మరో మూడు, నాలుగేళ్ల తర్వాతనే వివాహం చేసుకుంటానని స్పష్టం చేసేసింది. ఈ నేపథ్యంలో తాజాగా ఆమె సోషల్ మీడియాలో తన ఫాలోవర్లతో చిట్ చాట్ సెషన్‌ను నిర్వహించింది. ఇందులో ఓ నెటిజన్ 'అక్కా.. మీరు ఎప్పుడు పెళ్లి చేసుకోవాలని ప్లాన్ చేస్తున్నారు' అంటూ హిమజను సూటిగా ప్రశ్నించారు.

అప్పుడలా.. ఇప్పుడు షాకింగ్‌గా

అప్పుడలా.. ఇప్పుడు షాకింగ్‌గా

అప్పట్లో మూడు నాలుగేళ్లలో పెళ్లాడతానని చెప్పిన హిమజ.. ఇప్పుడు నెటిజన్ అడిగిన ప్రశ్నకు మాత్రం షాకింగ్ ఆన్సర్ ఇచ్చింది. 'పెళ్లి పట్ల నాకు అస్సలు ఆసక్తి లేదు. నాకు ప్రశాంతత, స్వేచ్చ కావాలని కోరుకుంటున్నాను' అని చెప్పుకొచ్చింది. దీంతో అందరూ షాక్ అవుతున్నారు. అదే సమయంలో పెళ్లిళ్లపై వచ్చిన పుకార్ల వల్లే ఆమె ఈ నిర్ణయం తీసుకుందని అంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X