ప్రముఖ టెలివిజన్ నటికి పితృ వియోగం.. కశ్మీర్‌లో ఉండగా..
ప్రముఖ టెలివిజన్ నటి హీనా ఖాన్ కుటుంబంలో విషాదం నెలకొన్నది. తనకు అత్యంత ఇష్టమైన వ్యక్తి, జీవితానికి స్పూర్తిని ఇచ్చిన తండ్రి మరణించడంతో తీవ్ర దిగ్బ్రాంతికి గురైంది. హీనా ఖాన్ తండ్రి గుండెపోటుతో ముంబైలో ఏప్రిల్ 20వ తేదీన మరణించారు.
తండ్రి మరణ వార్త తెలిసిన సమయానికి కశ్మీర్‌లో జరుగుతున్న షూటింగులో ఉన్నారు. తన తండ్రి ఇక లేరనే వార్తను అందుకొన్న ఆమె హుటాహుటిన ముంబైకి చేరుకొన్నారు. తన తండ్రి భౌతిక కాయాన్ని చూడగానే ఎమోషనల్ అయ్యారు.

తన తండ్రితో ఉన్న అనుబంధాన్ని గుర్తుగా తన చిన్ననాటి ఫోటోలను హీనా ఖాన్ షేర్ చేశారు. తన తండ్రికి శ్రద్దాంజలి ఘటించారు. హీనా ఖాన్‌కు పితృవియోగం అని తెలిసిన వెంటనే స్నేహితులు, సన్నిహితులు సంతాపం తెలిపి ఆమె ఓదార్చారు.
హీనా ఖాన్ కెరీర్ విషయానికి వస్తే.. హిందీ టెలివిజన్ రంగంలో ఇటీవల కాలంలో విశేషంగా రాణిస్తున్నారు. స్టార్ ప్లస్‌లో యే రిస్తా క్యా కహ్లాతా హై, కసౌటీ జిందగీ కే, ఖత్రోంకే ఖిలాడీ 8లో విశేషంగా ఆకట్టుకొన్నారు. అలాగే బిగ్‌బాస్ 11తో మరింత ప్రేక్షకాదరణ పొందారు.


Click it and Unblock the Notifications











