బిగ్‌బాస్ వల్లే నా కెరీర్ అలా నాశనం.. ఇనయ సుల్తానా సంచలన వ్యాఖ్యలు

ఎక్కడో హాలీవుడ్‌లో ప్రారంభమైన బిగ్‌బాస్ రియాలిటీ షో.. తర్వాత హిందీ సహా భారత్‌లోని మిగిలిన ప్రాంతీయ భాషల్లో రంగ ప్రవేశం చేసి సక్సెస్ అయ్యింది. తెలుగులో అయితే క్రేజ్ మామూలుగా రాలేదు. జనం ఎప్పుడో మరిచిపోయిన వాళ్లను హౌస్‌లోకి తీసుకొచ్చి కూర్చోబెట్టి ప్రేక్షకులకు చేరువ చేస్తున్నారు. తెలుగు విషయానికి వస్తే ఇప్పటికే ఏడు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకున్న బిగ్‌బాస్.. ఈ ఏడాది 8వ సీజన్‌‌లోకి అడుగుపెట్టనుంది. ఇటీవల బిగ్‌బాస్ తెలుగు 8 ప్రోమో రిలీజ్ కాగా తెలుగువారికి బిగ్‌బాస్ ఫీవర్ అంటుకుంది.

ఆగస్ట్ చివరి వారం లేదా, సెప్టెంబర్ మొదటి వారంలో బిగ్‌బాస్ 8 ప్రారంభమయ్యే అవకాశాలున్నాయని టాక్. ఈ సీజన్‌లో కంటెస్టెంట్స్ వీళ్లేనంటూ రకరకాల పేర్లు వినిపిస్తున్నాయి. యాదమ్మ రాజు, బర్రెలక్క, వేణుస్వామి, అంబటి రాయుడు, రాజ్ తరుణ్, విష్ణుప్రియ, రీతూ చౌదరి, కూమరి ఆంటీ పేర్లు తెరపైకి వస్తున్నాయి. కానీ ఇవి కేవలం గాసిప్సా లేక ఫీలర్లు వదిలారా అన్నది మాత్రం తెలియాల్సి ఉంది. అయితే కంటెస్టెంట్స్ ఎంపిక, వారికి ఫైనల్ ఇంటర్వ్యూలు పూర్తయ్యాయని త్వరలోనే లిస్ట్ బయటకు రానుందని సోషల్ మీడియాలో కథనాలు వినిపిస్తున్నాయి.

actress inaya sulthana made sensational comments on Bigg Boss Telugu

ఎప్పటిలాగే నాగార్జున హోస్ట్‌గా అలరించనున్నారు. మొన్నామధ్య రిలీజైన ప్రోమోలో వరాలిచ్చే కింగ్‌నని.. ఏం కోరుకున్నా లిమిట్ లేకుండా ఇస్తానంటూ చెబుతాడు. బిగ్‌బాస్ సెట్ కూడా ఈసారి కొత్తగా ఉంటుందని.. వెరైటీ టాస్క్‌లు, మైండ్ గేమ్స్‌‌ను ఇంట్రడ్యూస్ చేయనున్నారని టాక్. అయితే బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటకొచ్చిన కంటెస్టెంట్స్‌కు విపరీతమైన ఫాలోయింగ్, పాపులారిటీ కామన్. కానీ ఈ క్రేజ్ సదరు సెలబ్రెటీల కెరీర్‌కు ఏమాత్రం ఉపయోగపడటం లేదు.

వరుణ్ సందేశ్, సొహైల్, అఖిల్ , అలీ రెజా, వీజే సన్నీ వంటి వారి కెరీర్ పడుతూ లేస్తూ సాగుతోంది. బిగ్‌బాస్ వల్ల ఎంతమందికి ఫేమ్ వచ్చింది, ఎంతమంది నిలబడ్డారు అంటూ షకీలా సంచలన వ్యాఖ్యలు చేశారు. నాగార్జునకు తప్పించి అక్కడ ఎవరికీ ప్లస్ ఉండదని ఆమె వ్యాఖ్యానించారు. స్టూడియో వాళ్లదే, హోస్ట్ ఆయనే కాబట్టి ఏం జరిగినా నాగ్‌కే బెనిఫిట్ అని షకీలా అన్నారు. తాజాగా బిగ్‌బాస్ 6 కంటెస్టెంట్ ఇనయ సుల్తానా సైతం ఈ రియాలిటీ షోపై కీలక వ్యాఖ్యలు చేశారు.

actress inaya sulthana made sensational comments on Bigg Boss Telugu

అశ్విన్ బాబు హీరోగా వచ్చిన శివం భజే సినిమాలో ఇనయా సుల్తానా కీలకపాత్ర పోషించారు. ఈ సందర్భంగా మూవీ యూనిట్ ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో ఇనయా మాట్లాడుతూ... బిగ్‌బాస్ హౌస్ నుంచి వచ్చాక ఆఫర్లు క్యూకడతాయని అంటారని, కానీ ఎంతో స్ట్రగుల్ అయిన తర్వాతే అవకాశాలు వస్తాయన్నారు. బిగ్‌బాస్‌కు వెళ్లకముందు ఎలా తిరిగానో అలానే తిరుగుతున్నానని ఇనయా పేర్కొన్నారు. తాను నటించిన మరికొన్ని సినిమాలు రిలీజ్ కావాల్సి ఉందని ఆమె వెల్లడించారు. ప్రస్తుతం ఇనయా సుల్తానా వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X