ఆ తప్పు చేశా.. భోరున విలపించిన ఇంద్రజ!
సీనియర్ నటి ఇంద్రజ ప్రస్తుతం బుల్లితెరపై ఎక్కువగా సందడి చేస్తున్న విషయం తెలిసిందే. సినిమాలలో కంటే టెలివిజన్ స్టేజ్ పైనే బిజీగా ఉన్న ఇంద్రజ తాజాగా తప్పు చేశాను, ఒక్క ఛాన్స్ కావాలంటూ అంటూ బోరున విలపించింది. ఆమె చేసిన తప్పేంటి అనే ఇంట్రెస్టింగ్ విషయంపై ఓ లుక్కేద్దాం పదండి.
ఇంద్రజ ఒకప్పుడు హీరోయిన్ గా స్టార్ హీరోల సరసన నటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమె బుల్లితెర షోలతో బిజీబిజీగా గడిపేస్తోంది. ఓవైపు జబర్దస్త్, మరోవైపు శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోలలో జడ్జ్ గా చేస్తుంది.

జబర్దస్త్ లో సీనియర్ కమెడియన్ కృష్ణ భగవాన్ తో పాటు ఇంద్రజ కూడా జడ్జిగా వ్యవహరిస్తోంది. అందులో ఆమె స్కిట్స్ జరుగుతున్నంత సేపూ కమెడియన్లకు పంచులు వేస్తూ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తోంది. అలాగే శ్రీదేవి డ్రామా కంపెనీలో కూడా దాదాపుగా జబర్దస్త్ కమెడియన్లే కన్పిస్తుండగా, ఇంద్రజ అక్కడ కూడా జడ్జిగా సందడి చేస్తోంది.

ఈ నేపథ్యంలోనే తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీ మదర్స్ డే లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఆ ప్రోమోలో ఇంద్రజ ఎమోషనల్ అయ్యి, షోకు హాజరైన అందరినీ ఏడిపించేసింది. ఆమె ఏడుస్తూ కుప్పకూలిపోవడాన్ని ప్రోమోలో చూసిన ఫ్యాన్స్ కూడా ఆమె బాధను అర్థం చేసుకుని, రానున్న ఎపిసోడ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ప్రోమోలో చూస్తే ముందుగా షో హుషారుగానే స్టార్ట్ అయ్యింది. అమ్మ కోసం అంటూ ప్రోమో స్టార్ట్ కాగా, రష్మీ యాంకర్ గా వ్యవహరిస్తున్న ఈ షో లేటెస్ట్ ఎపిసోడ్ లో పలువురు బుల్లితెర ప్రముఖులు తమ తల్లులతో హుషారుగా ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత ఆటలు పాటలతో జల్సాగా గడిచింది. కానీ సడన్ గా అందరూ ఎమోషనల్ అయినట్టుగా చూపించారు ప్రోమోలో. సెలబ్రిటీలు తమ తల్లులతో సంతోషంగా గడపడం చూసి తన తల్లిని గుర్తు తెచ్చుకొని ఎమోషనల్ అయ్యింది ఇంద్రజ.
ఈ సందర్భంగా ఆమె బతికున్నప్పుడే తల్లిదండ్రులను సరిగ్గా చూసుకోవాలని, వాళ్ళని పట్టించుకోకుండా వేరే పనులు చేయడం వృధా అని చెప్పుకొచ్చింది. తల్లిదండ్రులు లేకపోతే ప్రపంచంలో ఎంత మంది ఉన్నా మనం అనాధలమే అంటూ ఏడ్చేసింది. అక్కడితో ఆగకుండా తన తల్లిని గుర్తు చేసుకుంటూ తాను కూడా ఎన్నో తప్పులు చేశానని, తన తల్లి బ్రతికున్నప్పుడు ఒక్కసారి గుడికి తీసుకువెళ్ళు అంటూ ప్రాధేయపడేది అని గుర్తు చేసుకొని వెక్కి వెక్కి ఏడ్చింది ఇంద్రజ.

ఆ తర్వాత గడిచిన కాలం ఒక్కసారి తిరిగి వస్తే తన తల్లికి ఏమేం చేయాలనుకున్నానో అవన్నీ చేసేస్తాను అంటూ బోరున విలపించింది. ఆమె ఏడుస్తుంటే షోలో ఉన్న వారంతా కూడా ఎమోషనల్ అయ్యి చూస్తూ ఉండిపోయారు. రష్మిక ఇంద్రజను ఓదార్చడానికి ప్రయత్నిస్తున్నట్టుగా ఆ ప్రోమోలో కనిపిస్తోంది. ప్రస్తుతం శ్రీదేవి డ్రామా కంపెనీ లేటెస్ట్ ప్రోమో వైరల్ అవుతుంది. ఈ ఆదివారం మధ్యాహ్నం ఒంటిగంటకు మదర్స్ డే స్పెషల్ గా ఈ ఎపిసోడ్ ప్రసారం కానుంది.


Click it and Unblock the Notifications











