Actress Indraja: స్టేజ్ మీదే గుక్క పెట్టి ఏడ్చేసిన ఇంద్రజ.. అసలు ఏమైందంటే?

ఈ మధ్యకాలంలో టెలివిజన్ పరిశ్రమ ఒకప్పటి హీరోయిన్లకు సెకండ్ ఆఫీస్ గా మారిపోయింది. ఇప్పుడు సినిమాలు ఏమీ లేవు అని బాధపడకుండా టెలివిజన్ షోలలో యాంకర్లుగా వ్యవహరిస్తూ... కాలం గడిపేస్తున్నారు. అలాంటి వారిలో ఇంద్రజ కూడా ఒకరు. ఒకప్పుడు హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన ఆమె తర్వాత పెళ్లి చేసుకుని సైలెంట్ అయిపోయిన ఈ మధ్య ఈటీవీలో ప్రసారమవుతున్న అనేక కార్యక్రమాల్లో ఆమె దర్శనమిస్తోంది. అయితే ఆమె తాజాగా కన్నీరు పెట్టుకున్న వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది.

నిజానికి ఒకప్పుడు రోజా ఈటీవీ కార్యక్రమాలలో ఎక్కువగా కనిపిస్తూ ఉండేది. అయితే ఆమె అనారోగ్య కారణాలతో ఇబ్బంది పడుతూ ఉండడం తర్వాత రాజకీయాల్లో బిజీ అవ్వడంతో ఇంద్రజను లైన్ లోకి తీసుకువచ్చారు ఈటీవీ మల్లెమాల సంస్థ నిర్వాహకులు. రోజా ఇప్పుడు పూర్తిగా రాజకీయాలకే పరిమితం అవుతూ ఉండటంతో ఇంద్రజ ఆల్ ఇన్ వన్ గా దూసుకుపోతూ దాదాపుగా ఈటీవీలో అన్ని కార్యక్రమాల్లోనూ కనిపిస్తూ వస్తోంది.

Photo Credits: etvteluguindia

Actress Indraja Cried in Sridevi Drama Company Show news goes viral

చేతినిండా వరుస షోలతో దూసుకుపోతున్న ఇంద్రజ కన్నీరు పెట్టుకున్న వ్యవహారం ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతుంది. నిజానికి ఇంద్రజ ఒకప్పుడు హీరోయిన్ గా ఉన్నప్పుడు ఎలా అయితే కమిట్మెంట్ తో పనిచేసేదో ప్రతి షో కి అలాగే పని చేస్తోంది. తన 100 పర్సెంట్ ఇచ్చి షోనీ హిట్ చేసేందుకు ప్రయత్నిస్తున్న ఆమె శ్రీదేవి డ్రామా కంపెనీలో కీలక పాత్ర పోషిస్తుంది.

అయితే ఇండిపెండెన్స్ డే స్పెషల్ గా శ్రీదేవి డ్రామా కంపెనీ నుంచి ఒక ఎపిసోడ్ ప్లాన్ చేశారు. ఆ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో రిలీజ్ అవ్వగా ఆ ప్రోమో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ప్రోమో గనుక మనం పరిశీలిస్తే హైపర్ ఆది ఆటో రాంప్రసాద్ వంటి వారు తమ పంచలతో ఆకట్టుకోగా ఇంద్రజ క్లాసికల్ డాన్స్ మాత్రం అందరి దృష్టిని ఆకర్షించి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచింది.

Actress Indraja Cried in Sridevi Drama Company Show news goes viral

ఇక ఇంద్ర చేసిన డాన్స్ చూసి అందరూ ఆమెను మెచ్చుకోకుండా ఉండలేకపోయారు. అందరూ అలా మెచ్చుకుంటుంటే ఇంద్రజ కూడా తన మీద కురుస్తున్న ప్రశంసల వర్షం చూసి ఆనందాన్ని తట్టుకోలేక ఒక్కసారిగా పెద్దగా గుక్క పెట్టి ఏడ్చేసింది. ఇక అంతా అయిపోయింది తనకు మళ్ళీ డాన్స్ చేసే అవకాశం రాదు అనుకున్నా.. ఆమె మళ్లీ ఒక డాన్సర్ గా డాన్స్ చేసి అందరి దృష్టి తన మీద పడడంతో ఒక్కసారిగా ఆమె కన్నీటి పర్వం అయింది.

ఇక ఈ షోల పుణ్యమా అని ఆమెకు వరుస సినిమా అవకాశాలు కూడా లభిస్తున్నాయి. చిన్న సినిమా పెద్ద సినిమా అని తేడా లేకుండా ఆమెకు కూడా వచ్చిన అవకాశాలను బట్టి సినిమాలతో పాటు ప్రోగ్రామ్స్ కూడా చేసుకుంటూ వెళుతుంది. ప్రస్తుతం బుల్లితెర మీద బిజీ పర్సన్ గా మారిపోయిన ఇంద్రజ భవిష్యత్తులో టాలీవుడ్ హీరోలకు అమ్మగా కనిపించిన అందులో ఆశ్చర్యం లేదు. చూడాలి మరి ఏమవుతుందో.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X