మా ఇద్దరి మధ్య సంబంధం అదే.. సుడిగాలి సుధీర్ విషయంలో ఇంద్రజ కన్నీళ్లు!

Indraja -Sudigali Sudheer: తెలుగు సినీ ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న నటి ఇంద్రజ (Indraja) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు వెండితెరపై స్టార్ హీరోయిన్‌గా అగ్రహీరోల సరసన నటించి ఎన్నో సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన ఆమె.. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ అదే జోష్‌తో దూసుకెళ్తున్నారు. సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తూనే, బుల్లితెరపై పలు వినోద కార్యక్రమాల్లో జడ్జిగా వ్యవహరిస్తూ మరోసారి ఫ్యామిలీ ఆడియన్స్‌కు చేరువయ్యారు. ముఖ్యంగా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి కార్యక్రమాల ద్వారా కొత్త తరానికి కూడా మరింత దగ్గరయ్యారు.

ఇదిలా ఉంటే.. ఇటీవల ఓ టాక్ షోలో పాల్గొన్న ఇంద్రజ.. యాంకర్ సుడిగాలి సుధీర్ పై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఏమన్నారంటే? నటి ఇంద్రజ ఇటీవల ఓ ప్రముఖ టాక్ షోలో పాల్గొన్నారు. ఈ షోలో ఇంద్రజ.. తన కెరీర్‌తో పాటు బుల్లితెర అనుభవాల గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ముఖ్యంగా శ్రీదేవి డ్రామా కంపెనీ రోజులను గుర్తు చేసుకుంటూ, ఆ షోలో యాంకర్‌గా వ్యవహరించిన సుధీర్‌తో ఏర్పడిన బంధాన్ని వివరించారు. సుధీర్‌తో తనకున్న అనుబంధం గురించి మాట్లాడుతూ ఆమె భావోద్వేగానికి గురయ్యారు. 'సుధీర్ నన్ను ఎప్పుడూ 'అమ్మ' అని పిలిచేవాడు. ఆ పిలుపుతోనే నాకు అతడిపై తల్లితనం పెరిగింది' అంటూ చెప్పారు.

Actress Indraja Emotional Comments on Sudigali Sudheer Viral Mother Son Bond Shocks Fans

ఇంద్రజ ఇంకా మాట్లాడుతూ.. 'సిద్ధు నా కొడుకు లాంటివాడు. అమ్మ అంటే నిజంగానే అమ్మగానే చూస్తాడు. అతడి ప్రేమ, గౌరవం చూసినప్పుడు ఇది దేవుడు ఇచ్చిన బంధంలా అనిపిస్తుంది' అని అన్నారు. ఈ ఒక్క మాటతోనే వీరిద్దరి మధ్య ఎంత మంచి అనుబంధం ఉందో స్పష్టమైంది. జబర్దస్త్ సెట్స్‌లో పనిచేసిన రోజుల్లో అందరూ తమిద్దరినీ నిజంగానే తల్లి-కొడుకుల్లా చూసేవారని ఇంద్రజ వెల్లడించారు. "బయటకు వెళ్లినా అభిమానులు అడుగుతారు.. మేడమ్, సుధీర్ ఎక్కడ? మీరు ఇద్దరూ కలిసి కనిపించట్లేదు.. మిస్ అవుతున్నాం అంటుంటారు" అంటూ ఆమె నవ్వుతూ చెప్పారు. సుధీర్ ఈటీవీ కార్యక్రమాల నుంచి దూరమైన తర్వాత తాను చాలా మిస్ అయ్యానని కూడా ఇంద్రజ తెలిపారు.

ఒకసారి ఎక్స్‌ట్రా జబర్దస్త్ కార్యక్రమంలో కెవ్వు కార్తీక్.. సుధీర్‌ను అనుకరిస్తూ స్కిట్ చేసినప్పుడు తాను భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకున్నానని చెప్పారు. "ఆ క్షణంలో నాకు నిజంగానే సుధీర్ గుర్తొచ్చాడు. అతడిని చాలా మిస్ అయ్యాను" అంటూ ఎమోషనల్ అయ్యారు. ఇంద్రజ మరో ఆసక్తికర విషయం కూడా వెల్లడించారు. "నేను సుధీర్‌ను ప్రేమగా సిద్ధు అని పిలుస్తాను. అతడు నన్ను రాజీ అని పిలుస్తాడు. మా ఇంట్లో వాళ్లు కూడా నన్ను అలాగే పిలుస్తారు. అతడు ఆ పేరుతో పిలిస్తే నాకు చాలా సంతోషంగా ఉంటుంది" అని చెప్పారు.

అంతేకాదు, జబర్దస్త్ నటుడు ప్రవీణ్ కూడా తనను అమ్మ అని పిలుస్తాడని, సుధీర్ దేవుడు ఇచ్చిన కొడుకు లాంటివాడని పేర్కొన్నారు. ఒకసారి తన వాచ్‌ను కూడా గిఫ్ట్‌గా ఇచ్చానని చెప్పారు. ఇంకా మాట్లాడుతూ.. "నన్ను మేడమ్, అక్క అని పిలవడం కంటే అమ్మ అని పిలిస్తేనే నాకు ఎక్కువ గౌరవంగా అనిపిస్తుంది. అందులో ప్రేమ ఉంటుంది.. ఆప్యాయత ఉంటుంది" అని అన్నారు. ఇక సుధీర్ గురించి మాట్లాడుతూ.. 'సుధీర్‌లో అపారమైన ప్రతిభ ఉంది. అతడు ఉండాల్సిన ఎత్తులకు ఇంకా చేరుకోలేదనే బాధ మాత్రం ఉంటుంది' అని అన్నారు. మరోవైపు ప్రస్తుతం సుధీర్ సినిమాలు, ఇతర ఛానళ్ల కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X