ఇంద్రజ పేరుతో ఆన్‌లైన్ చీటింగ్.. పోలీసులకు ఆశ్రయించిన నటి!

Actress Indraja: సీనియర్ నటి ఇంద్రజ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. 'యమలీల' సినిమాతో హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఆమె, జగపతి బాబు, నరేష్ తదితర హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైన ఇంద్రజ, 'శతమానం భవతి'తో రీఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తూనే, 'జబర్దస్త్', 'శ్రీదేవి డ్రామా కంపెనీ' వంటి ప్రముఖ టీవీ షోల్లో జడ్జిగా వ్యవహరిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే.. తాజాగా ఇంద్రజ పేరుతో సోషల్ మీడియాలో నడుస్తున్న ఫేస్‌బుక్ పేజ్ వివాదం ఇప్పుడు మరింత హాట్ టాపిక్‌గా మారింది. తనకు తెలియకుండా తన పేరుతో ఓ ఫేస్‌బుక్ పేజ్ నిర్వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇంతకీ ఏం జరిగిందంటే..

నటి ఇంద్రజ పేరుతో సోషల్ మీడియాలో నడుస్తున్న ఫేస్‌బుక్ పేజ్ వివాదం ఇప్పుడు మరింత హాట్ టాపిక్‌గా మారింది. గత కొన్ని రోజులుగా తనకు తెలియకుండా తన పేరుతో ఓ ఫేస్‌బుక్ పేజ్ నిర్వహిస్తున్నారని ఇంద్రజ మండిపడింది. తాజాగా ఆ పేజ్ అడ్మిన్ స్పందించినప్పటికీ తన ప్రశ్నలకు సరైన సమాధానం రాలేదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వివాదంపై తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో విడుదల చేసిన ఇంద్రజ.. మొదట తన పేరుతో నడుస్తున్న పేజ్ గురించి తెలుసుకున్న వెంటనే సంబంధిత వ్యక్తికి వ్యక్తిగతంగా మెసేజ్ చేసినట్లు తెలిపారు. అయితే ఆ మెసేజ్‌కు ఎలాంటి స్పందన రాకపోవడంతోనే తాను సోషల్ మీడియాలో వీడియో ద్వారా స్పందించాల్సి వచ్చిందని వెల్లడించారు.

Actress Indraja Fires Over Unauthorized Facebook Page Files Cyber Crime Complaint

ఇక తన వీడియో వైరల్ అయిన తర్వాత పేజ్ అడ్మిన్ నుంచి స్పందన వచ్చిందని ఇంద్రజ తెలిపారు. "మేడం.. నేను మీ అభిమానిని. మీపై ఉన్న అభిమానంతోనే ఈ పేజ్‌ను నడుపుతున్నాను. నేను ఎలాంటి మోనిటైజేషన్ చేసుకోలేదు. మీరు ముందే అడిగి ఉంటే ఇన్ని సంవత్సరాలుగా కష్టపడి డెవలప్ చేసిన ఈ పేజ్‌ను మీకే ఇచ్చేసేవాడిని" అని అతను తనకు మెసేజ్ పంపినట్లు ఆమె వెల్లడించారు. అయితే ఆ వివరణతో తాను సంతృప్తి చెందలేదని ఇంద్రజ స్పష్టం చేశారు.

"ముందుగా మీ అభిమానానికి థాంక్యూ. కానీ నాకు ఒకే ఒక్క ప్రశ్న ఉంది. నిజంగా అభిమానం ఉంటే దాన్ని ఫ్యాన్ పేజ్‌గా నడపాలి కదా? కానీ మీరు నేరుగా నా పేరుతోనే పేజ్ క్రియేట్ చేశారు. అంతేకాదు, అది నా అధికారిక పేజ్ అన్నట్లుగా నిర్వహించారు. మెటా వెరిఫికేషన్ తీసుకుని బ్లూ టిక్ కూడా పొందారు. ఒక వ్యక్తి తన వ్యక్తిగత అకౌంట్‌ను ఎలా నడిపిస్తాడో.. అదే విధంగా నా పేరుతో మీరు పేజ్‌ను నడిపించారు. దీనికి నా అనుమతి ఎప్పుడైనా తీసుకున్నారా?" అంటూ ప్రశ్నించారు.

ఇంద్రజ మరింత ఆగ్రహంగా మాట్లాడుతూ.. "నా తరఫున నేను ఈ పేజ్ నడుపుతున్నాను అని చెప్పడానికి మీకు ఎవరు హక్కు ఇచ్చారు? మీరు ఎప్పుడైనా నన్ను సంప్రదించారా? నా అనుమతి తీసుకున్నారా? అభిమానముంటే ఫ్యాన్ పేజ్ అని స్పష్టంగా పేర్కొని నడపాలి. కానీ అధికారిక పేజ్‌లా నడపడం తప్పు" అని వ్యాఖ్యానించారు. అలాగే మోనిటైజేషన్ అంశంపైనా ఆమె సందేహాలు వ్యక్తం చేశారు. "మీరు మోనిటైజేషన్ చేసుకోలేదని చెబుతున్నారు. కానీ మిలియన్ల వ్యూస్ వచ్చిన పేజ్‌కు ఆదాయం వచ్చే అవకాశం లేదా? ఫేస్‌బుక్ పేజ్ నడిపే వారికి ఈ విషయాలు తెలియవా? నిజంగా ఏం జరిగిందో సంబంధిత అధికారులు పరిశీలించాలి" అని అన్నారు.

ఇప్పటికే ఈ వ్యవహారంపై తాను సైబర్ క్రైమ్‌లో ఫిర్యాదు చేసినట్లు కూడా ఇంద్రజ వెల్లడించారు. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ అధికారులతో మాట్లాడినట్లు చెబుతూ, చట్టపరమైన చర్యలు ప్రారంభమయ్యాయని తెలిపారు. "మీరు అంటున్నారు కదా.. మేడం అడిగుంటే ఈ పేజ్ ఇచ్చేసేవాడిని అని. నాకు ఎవరి కష్టం అవసరం లేదు. నా పేరు, నా గుర్తింపు నాకు చాలా ముఖ్యం. నా అనుమతి లేకుండా ఎవరూ వాటిని ఉపయోగించే హక్కు లేదు. ఎవరిపైనైనా అభిమానం ఉంటే వారి పేరుతో అధికారిక అకౌంట్‌లా పేజ్‌లు నడపకండి. ఫ్యాన్ పేజ్ అని స్పష్టంగా పేర్కొని నిర్వహించండి. లేకపోతే ఇలాంటి సమస్యలు వస్తాయి" అంటూ హెచ్చరించారు.

ఇంద్రజ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అభిమాన పేజ్‌లు, అధికారిక అకౌంట్ల మధ్య ఉన్న తేడాపై మరోసారి చర్చ మొదలైంది. ఈ వ్యవహారంపై సైబర్ క్రైమ్ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Read more about: indraja extra jabardasth
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X