'సుడిగాలి సుధీర్‌ను చాలా మిస్ అయ్యా.. ఆ సమయంలో చాలా ఏడ్చేశా..': స్టార్ హీరోయిన్
Indraja -Sudigali Sudheer:అలనాటి హీరోయిన్ ఇంద్రజ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతమైన అందం, అభినయంతో ఎన్నో సినిమాల్లో నటించి, మెప్పించింది. చాలా గ్యాప్ తరువాత ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ నటిస్తూ దూసుకుపోతుంది. అలాగే.. జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోలలో కూడా జడ్జిగా చేస్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు. సుడిగాలి సుధీర్ పై పలు కామెంట్స్ చేసింది. ఇంతకీ ఏమన్నాదంటే?
అలనాటి నటి ఇంద్రజ.. ప్రసుత్తం బుల్లితెరపై జడ్జిగా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తోంది. మొదట్లో బుల్లితెర ప్రొగ్రామ్స్ ల్లో గెస్ట్‌గా వచ్చిన ఇంద్రజ.. ఆ తరువాత శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో ఫుల్‌టైమ్‌గా జడ్జిగా మారారు. ఇక జబర్దస్త్ షోలో రోజా ప్లేస్‌లో జడ్జిగా వ్యవహరిస్తున్నారు. అయితే.. సుడిగాలి సుధీర్ షో నుంచి వెళ్లిపోవడంపై నటి ఇంద్రజ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

ఇంద్రజ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తాను ఎవరి వ్యక్తిగత విషయాలను తాను మాట్లాడలేనని, తనకు అలా ఇతర విషయాలను చెప్పడం నచ్చదని తెలిపారు. తాను తనకు తెలిసిన విషయాలను తన మనసులోనే దాచుకుంటాను గానీ, వేరేవాళ్లు తనని ఇతర విషయాల గురించి అడిగిన తాను చెప్పలేనని స్పష్టం చేశారు. ఈ సమయంలో జబర్దస్త్ షో నుండి సుధీర్ వెళ్లిపోవడంపై ఇంద్రజ స్పందిస్తూ.. సుధీర్ వెళ్లిపోవడంతో తాను చాలా మిస్ అయ్యానని ఫీలయ్యారు.
ఎక్స్ట్రా జబర్దస్త్ షో నుండి సుధీర్ పెళ్లికి పోవడంపై కెవ్వు కార్తీక్ స్కిట్ వేశాడని, ఆ స్కిట్ లో అచ్చు సుడిగాలి సుదీర్లా నటించాడని అందులో మెయిన్ గా .. సుదీర్లా కార్తీక్ కళ్లద్దాలు తీస్తుంటే.. ఆ క్షణంలో తాను ఒక్కసారిగా ఏడ్చేసానని చెప్పింది. ఆ సీన్ చూసేటప్పుడు తాను కన్నీళ్లు ఆపుకోలేకపోయానని ఎమోషనల్ అయ్యారు. వాస్తవానికి తాను సుదీర్ ను సిద్దు అని పిలుస్తానని, సిద్ధు చాలా మిస్ అయ్యానని నన్ను ప్రేమగా అతడు రాజి అని పిలుస్తాడని చెప్పింది.

రాజీ అని తన ఇంట్లో వారందరూ తనని పిలుస్తారని, అలా పిలవడం తనకు ఎంతో ఇష్టమని ఇంద్రజ చెప్పింది. అలాగే అతడు తనని అమ్మ అని చాలా ప్రేమతో పిలిచేవాడని, అలా అమ్మ అని పిలిపించుకోవడం తనకు ఎంతో ఇష్టం అని భావోద్యోగానికి లోనయ్యారు. అలాగే జబర్దస్త్ నటుడు ప్రవీణ్ కూడా తనను అమ్మ అని పిలుస్తాడని, అతడు నాకు దేవుడిచ్చిన కొడుకు లాంటివాడని, అతనికి తన వాచ్ ను గిఫ్ట్ గా ఇచ్చాను చెప్పుకొచ్చింది ఇంద్రజ.
తాను చేసే షో లలో ఆర్టిస్టులతో అమ్మ అని పిలిపించుకోవడం బాగుంటుందని, మేడం, అక్క అని పిలిపించుకోవడం కంటే అమ్మ అని పిలిపించుకోవడంలోనే తాను గౌరవంగా భావిస్తానని అన్నారు. తన పిల్లల పెళ్లి విషయంలో కూడా తాను ఇన్వాల్వ్ కాబోనని ఇంద్రజ తేల్చి చెప్పారు. తన పెళ్లికి ముందే తన భర్త ఆరు ఏళ్ల ముందు తనకు తెలుసని, ఆయన తమిళ సీరియల్లలో నటిస్తారని కొన్ని సినిమాలకు స్క్రిప్ట్ కూడా రాశారని చెప్పుకొచ్చింది అయితే తామిద్దరం కలిసి ఎప్పుడు మీడియా ముందుకు రావలసిన ఆస్కారం రాలేదని చెప్పుకొచ్చింది ఇంద్రజ.


Click it and Unblock the Notifications











