ఆ బంధాన్ని దేవుడే కలిపాడేమో.. సుధీర్ విషయంలో ఇంద్రజ కన్నీళ్లు..
Indraja -Sudigali Sudheer: తెలుగు సినీ ప్రేక్షకుల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిన నటి ఇంద్రజ (Indraja), వెండితెరపై స్టార్ హీరోయిన్‌గా ఒక వెలుగు వెలిగిన వారిలో సందేహమే లేదు. తన తొలి ఇన్నింగ్స్‌లోనే టాప్ హీరోలతో కలిసి సూపర్ హిట్ సినిమాల్లో నటించి భారీ క్రేజ్‌ను సంపాదించుకుంది. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్‌లో కూడా ఇంద్రజ అదే జోష్‌తో దూసుకెళ్తున్నారు. ప్రస్తుతం పలు సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తూ.. మరోవైపు బుల్లితెర కార్యక్రమాల్లోనూ బిజీగా కొనసాగుతున్నారు. ఇంద్రజ ఇప్పుడు జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి ప్రముఖ కామెడీ షోలలో జడ్జిగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని సుడిగాలి సుధీర్ పై నటి ఇంద్రజ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇంతకీ ఏమన్నాదంటే?
అలనాటి అందాల తార ఇంద్రజ.. జబర్థస్త్ ఫేమ్ వర్ష యాంకర్ వ్యవహరిస్తున్న కిసిక్ టాక్ షోలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూలో పాల్గొని తన కెరీర్, టీవీ షోల అనుబంధం, ముఖ్యంగా సుడిగాలి సుధీర్‌తో ఉన్న సంబంధం గురించి కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించారు. సుధీర్ షోలో తన పాత్ర, అతనితో ఉన్న బంధం గురించి చెప్పిన వ్యాఖ్యలు ఇప్పుడు అభిమానుల్లో చర్చనీయాంశమయ్యాయి. జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ రోజుల్ని గుర్తుచేసుకున్నారు. ముఖ్యంగా యాంకర్ సుడిగాలి సుధీర్‌తో ఏర్పడిన తన తల్లి-కొడుకు బంధం గురించి ఆసక్తికరంగా మాట్లాడారు.

తాజా ఇంటర్వ్యూలో సీనియర్ నటి ఇంద్రజ, శ్రీదేవి డ్రామా కంపెనీ రోజుల్ని గుర్తుచేసుకుంటూ సుడిగాలి సుధీర్‌తో ఉన్న తమ ప్రత్యేక అనుబంధాన్ని పంచుకున్నారు. షోలో యాంకర్‌గా ఉన్న సమయంలో సుధీర్ తనను ఎప్పుడూ "అమ్మ" అని పిలిచేవాడని, ఆ పిలుపుతోనే తనకు అతనిపై తల్లితనం పెరిగిందని తెలిపారు."సిధ్దు నా కొడుకు లాంటివాడు. అమ్మ అంటే నిజంగా అమ్మగానే చూస్తాడు. అతడి ప్రేమ, గౌరవం... అవి దేవుడు ఇచ్చిన బంధంలా అనిపిస్తాయి," అని ఇంద్రజ చెప్పారు.
జబర్దస్త్ సెట్స్‌లో వారు కలిసి పనిచేసిన రోజుల్లో అందరూ మమ్మల్నీ అమ్మ-కొడుకు గా పిలిచేవారని, ఆ జ్ఞాపకాలు ఇప్పటికీ మధురంగానే ఉంటాయని ఆమె భావోద్వేగంగా చెప్పారు. 'బయటికి వెళ్తే కూడా ఫ్యాన్స్ అడుగుతారు... మేడమ్, సుధీర్ ఎక్కడ? మేము ఇద్దరినీ మిస్ అవుతున్నాం అని' అంటూ ఇంద్రజ ఎమోషనల్ అయ్యారు. సుధీర్ షో నుండి ఎందుకు దూరమయ్యాడనే ప్రశ్నకు ఇంద్రజ సరదాగా స్పందిస్తూ 'ఆ ప్రశ్నకు నేను సమాధానం ఇస్తే రష్మి నా పీకే కొరికేస్తుంది' అంటూ నవ్వులు పూయించారు. తరువాత సుధీర్ వ్యక్తిత్వం గురించి మాట్లాడుతూ.. 'సుధీర్‌లో అపారమైన ప్రతిభ ఉంది. కానీ అతడు ఉండాల్సిన ఎత్తులకు ఇంకా ఎందుకు చేరుకోలేకపోయాడో... అదే నాకు చిన్న బాధ'అని చెప్పారు.
అంతకు ముందుకు ఓ ఇంటర్వ్యూలో నటి ఇంద్రజ మాట్లాడుతూ.. జబర్దస్త్ షో నుంచి సుడిగాలి సుధీర్ వెళ్లిపోవడం తనకు చాలా బాధ కలిగించిందని తెలిపారు. ఎక్స్‌ట్రా జబర్దస్త్‌లో కెవ్వు కార్తీక్ సుధీర్ పెళ్లిపై చేసిన స్కిట్‌లో, అతను సుధీర్ బాడీ లాంగ్వేజ్‌ను అచ్చం పోలి నటించినప్పుడు తాను భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకున్నానని చెప్పారు. "సిధ్దు నాకు ఎంతో దగ్గరి. నేను అతడిని సిధ్దు అని, అతను నన్ను ప్రేమగా రాజీ అని పిలుస్తాడు," అని ఇంద్రజ చెప్పింది. జబర్దస్త్ నటుడు ప్రవీణ్ కూడా తనను 'అమ్మ' అని పిలుస్తాడని, అతడు దేవుడు ఇచ్చిన కొడుకు లాంటివాడని ఇంద్రజ పేర్కొన్నారు. షోలో ఆర్టిస్టులు 'అమ్మ' అని పిలవడం తనకు అత్యంత గౌరవంగా అనిపిస్తుందని చెప్పారు.


Click it and Unblock the Notifications











