ప్రేమించి మోసం చేస్తే..పుట్టగతులు ఉండవు.. బ్రేకప్‌పై ఇంద్రజ ఎమోషనల్
90వ దశకంలో దక్షిణాది చిత్ర పరిశ్రమను తన అందం, అభినయంతో ఊపేశారు ఇంద్రజ. అప్పటికే సౌందర్య, మీనా, రంభ, సంఘవి, రోజా తదితర నటీమణులు చిత్రసీమను దున్నేస్తున్న దశలో అడుగుపెట్టి తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు ఇంద్రజ. కొన్నాళ్లు పాటు హవా సాగించిన ఇంద్రజ పెళ్లి తర్వాత కొన్నాళ్లు సినిమాలకు దూరమయ్యారు. ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమాలతో ఆమె తిరిగి ప్రేక్షకుల ముందుకొచ్చి అలరిస్తున్నారు. తాజాగా జబర్దస్త్ వర్ష హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న కిస్సిక్ టాక్ షో కార్యక్రమంలో పాల్గొన్న ఇంద్రజ తన కెరీర్, పెళ్లికి సంబంధించిన కీలక విషయాలను వెల్లడించారు.
రష్మి నా పీక కొరికేస్తుంది
నా స్మైల్‌కి చిన్నపిల్లల దగ్గరి నుంచి పెద్దవాళ్ల వరకు ఫ్యాన్స్ ఉన్నారంటే జబర్దస్త్‌కి వచ్చే వరకు నమ్మలేకపోయా. అమ్మ అనే ఒకే మాటకు ఫిక్స్ అయిపోయి.. సుధీర్ నన్ను అమ్మలాగే చూసుకుంటాడు. ఈ బంధం దేవుడు ఇచ్చిన బంధమే. జబర్దస్త్‌లో నేను కూడా సుధీర్‌ను మిస్ అవుతున్నా.. దీనికి నేను కనుక ఆన్సర్ చేస్తే రష్మి నా పీక కోరికేస్తుంది. సుధీర్ చేరుకోవాల్సిన ఎత్తుకు ఇంకా ఎందుకు చేరుకోలేదని చిన్న బాధ. కొంతమంది తమకు నచ్చినట్లుగా డ్రెస్ వేసుకుంటున్నారు. మీ పర్సనల్ లైఫ్‌లో మీరు ఏమైనా చేసుకోండి అది మీ ఇష్టం. కానీ పబ్లిక్ లైఫ్‌లోకి వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేస్తారు అని ఇంద్రజ అన్నారు.

వాళ్లకి పుట్టగతులు ఉండవు
ఒకరు మనల్ని మోసం చేశారు అన్నప్పుడు ఆ బాధ ఎలా ఉంటుందని వర్ష అడగ్గా.. నేచురల్‌గా బిడ్డలకి జన్మనిచ్చినప్పుడు ఆ పెయిన్ హయ్యెస్ట్ లెవల్‌లో ఉంటుంది అంటారు. అంతకు ఈక్వల్‌గా మరో పెయిన్ ఉందంటే అది ప్రేమలో మోసపోవడమే. అది చేసినవాళ్లు ఆడదైనా, మగవాళ్లు అయినా సరే వాళ్లకి ఇంక పుట్టగతులు ఉండవు, సర్వనాశనం అయిపోతారు. మీరు పుట్టింది ప్రేమించడానికి కాదు, సాధించడానికి. టాలెంట్ ఉంటేనే సినీరంగంలో నిలదొక్కుకుంటాం.. లక్ ఉంటేనే సక్సెస్ అవుతాం. టాలెంట్ ఉన్నప్పుడు మీకు అవకాశం వస్తుంది.. కానీ లక్ ఉంటేనే సక్సెస్ వస్తుంది, మీరు ఎదుగుతారు ఇంద్రజ చెప్పారు
వాళ్లే నా బలం, నా సైన్యం
మీరు డబ్బుకి వాల్యూ ఇస్తారా? మనుషులకు వాల్యూ ఇస్తారా అని వర్ష అడగ్గా.. అందరూ మనుషులకే వాల్యూ ఇస్తాం అంటారు.. ఇప్పుడున్న రోజుల్లో ఎవ్వరూ కూడా మీతో మాట్లాడటం లేదు, మీ సక్సెస్‌తో, మీ స్టేటస్‌తో, మీ డబ్బుతో మాట్లాడుతున్నారు. నాకు ఏదైనా ప్రాబ్లమ్ వస్తే నేను ఎవ్వరికీ కాల్ చేయను, ముందు ప్రేయర్ చేస్తాను. అన్నింటికీ తోడు మా బొజ్జగణపయ్య, మా బాబా, కామాక్షీ తల్లి ఒక్కరు కాదు ఇద్దరు కాదు.. 100 మందిని నా వెనుక పెట్టుకుని ఉన్నాను. నా బలం వాళ్లు, నా సైన్యం అంతా కూడా నేను నమ్ముకున్న నా దేవుళ్లే అని ఇంద్రజ అన్నారు.
ఆమెను గట్టిగా హగ్ చేసుకోవాలని ఉంది
బిజీలో పడి జీవితంలో ఇది చేయలేకపోయాను అని ఎప్పుడైనా బాధపడ్డారా అని వర్ష అడగ్గా.. ఇంద్రజ ఒక్కసారిగా తన తల్లి గురించి చెబుతూ కంటతడి పెట్టారు. వడప్పాయ్ అనే మురుగన్ టెంపుల్ ఉంది.. అక్కడ మా మమ్మీవాళ్లు తీసుకెళ్లు, తీసుకెళ్లు అని అడిగేవారు. ప్రతిసారి నేను రెండ్రోజుల్లో తీసుకెళ్తా, మూడు రోజుల్లో తీసుకెళ్తానని చెప్పేదానిని. ఆ తర్వాత వన్ వీక్‌లో అమ్మ చనిపోయింది. ఆ గిల్ట్ ఫీల్ మాత్రం అనుభవించినవాడికే తెలుసు. ఆమె ఉంటే టైట్‌గా వర్క్ చేసుకోవాలని ఉంది అని ఇంద్రజ ఎమోషనల్ అయ్యారు. మరి ఆమె జీవితంలో ఎలాంటి ఇబ్బందులు పడ్డారు? ఇప్పుడు కెరీర్ ఎలా ఉంది? అనేది తెలుసుకోవాలంటే మరికొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.


Click it and Unblock the Notifications











