Jayalalitha: "ఆమె వల్లే ప్రేమ ఎంత మధురం సీరియల్ మానేశాను.. కానీ అది కంటిన్యూ చేస్తున్నాను"

టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా గతంలో గుర్తింపు తెచ్చుకున్న సీనియర్ నటి జయలలిత గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హీరోయిన్ గా కెరియర్ ప్రారంభించిన ఈమె.. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా కొనసాగుతోంది. 40 ఏళ్లుగా సినీ రంగంలో కొనసాగుతున్న ఈమె సీరియల్స్ లో కూడా నటిస్తూ ముందుకు వెళ్తుంది. అయితే మొన్నటి వరకు ప్రేమ ఎంత మధురం సీరియల్ లో నటించిన జయలలిత ఈ సీరియల్ ను మధ్యలోనే మానేసింది. దీంతో ఆమె స్థానంలోకి కొత్త ఆవిడ వచ్చింది. అయితే తాను ఆ సీరియల్ మానేయడానికి ఆమే కారణం అంటూ తాజాగా పాల్గొన్న ఇంటర్వ్యూలో చెప్పింది. ఆ విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

సినీ రంగంలోకి వచ్చిన తొలి నాళ్లలో హీరోయిన్ గా నటించి మెప్పించిన ఆమె.. ఆ తర్వాత అనేక రకాల క్యారెక్టర్లలోనూ కనిపించి మెప్పించింది. ముఖ్యంగా శృంగార భరిత సన్నివేషాలు ఎక్కువగా చేస్తూ.. బోల్డ్ యాక్ట్రెస్ గా పేరు తెచ్చుకుంది. ఇలా అన్ని రకాల క్యారెక్టర్లలో కనిపిస్తూ.. తెగ సందడి చేసిన ఈమె 40 ఏళ్లుగా సినీ రంగంలో కొనసాగుతూనే వస్తోంది. ముఖ్యంగా కేవలం సినిమాలు మాత్రమే కాకుండా.. సీరియల్స్ కూడా చేస్తూ తన టాలెంట్ ప్రూవ్ చేసుకుంటుంది. ప్రస్తుతం హుందాగా కనిపించే క్యారెక్టర్లు మాత్రమే చేస్తూ అందరినీ మెప్పిస్తున్న ఈమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. అక్కడే షాకింగ్ కామెంట్లు చేసింది.

Actress Jayalalitha Said Why She Stop Prema Entha MAdhuram Serial Check Details

ముఖ్యంగా ఈ ముద్దుగుమ్మ సీరియల్స్ గురించి మాట్లాడింది. తాను ప్రేమ ఎంత మధురం సీరియల్ చేయడానికి, ఆపేయడానికి గల కారణాలను తెలిపింది. అయితే ప్రేమ ఎంత మధురం సీరియల్ హీరో శ్రీరామ్ యే దాన్ని నిర్మిస్తున్నారు. ఆయనే ప్రొడ్యూసర్ కాగా.. సీరియల్ ప్రారంభిస్తున్నప్పుడు తనను శ్రీరామ్ సంప్రదించాడని.. శ్రీరామ్ మీద ఉన్న అభిమానంతోనే తాను ఆ సీరియల్ చేసేందుకు ఒప్పుకున్నట్లు చెప్పింది. ముఖ్యంగా ఓ పెద్దింటి పెద్ద మనిషిగా, శ్రీరామ్ కు తల్లిగా చేయడం తనకు బాగా నచ్చిందని వివరించింది.

చాలా రోజుల పాటు సీరియల్ హాయిగా సాగగా.. మధ్యలో కొన్ని కొత్త క్యారెక్టర్లు వచ్చాయని వివరించింది. ముఖ్యంగా తన మరదలి క్యారెక్టర్లలోకి అంటే మాన్సీతో గొడవపడి రెండో కోడలిగా ఎంట్రీ ఇచ్చిన అంజలి క్యారెక్టర్ వల్ల తనకు సమస్యలు వచ్చాయని వివరించింది. పెద్ద వాళ్లంటే గౌరవం, సీనియర్ నటి అన్న కనీస రెస్పెక్ట్ లేని ఆ అమ్మాయి తనకు నచ్చినట్లు ప్రవర్తించేదని జయలలిత చెప్పింది. సీరియల్ షూటింగ్ లో భాగంగానే.. ఓ వ్రతంలో ఆ అమ్మాయి కూర్చోవాల్సి వచ్చిందని.. అయితే చేతికి గాజులు లేకుండా ఉండడం చూసి అత్తగారి హోదాలో తను చెప్పినట్లు తెలిపింది. అయితే ఆమె ఆ విషయం అర్థం చేసుకోకుండా.. నేను వేసుకుని, నువ్వెవరు నాకు చెప్పడానికి అంటూ ఫైర్ అయినట్లు తెలిపింది.

Actress Jayalalitha Said Why She Stop Prema Entha MAdhuram Serial Check Details

అయితే ఆమె కావాలని తనతో గొడవ పెట్టుకోవడం తనను చాలా బాధించిందని.. బయటే ఉన్న శ్రీరామ్ వద్దకు వెళ్లి ఇదే విషయం చెప్పినట్లు వివరించింది. నేను ఈ సీరియల్ చేయలేను బాబు, కనీసం రెస్పెక్ట్ కూడా ఇవ్వట్లేరు, పెద్ద దాన్ననే గౌరవం కూడా లేదంటూ చెప్పగా.. శ్రీరామ్ మీకు ఇష్టం లేకపోతే చేయొద్దమ్మా అన్నారట. కారు ఇచ్చి మరీ తనను ఇంటికి పంపించారట. అలా ఆ అమ్మాయి వల్ల తాను ఈ సీరియల్ కు దూరం అయినట్లు చెప్పింది. అలాగే ప్రస్తుతం త్రినయని సీరియల్ లో అప్పుడప్పుడూ కనిపిస్తున్నానని.. సీరియల్స్ చేయడం తనకు నచ్చట్లేదని జయలలిత చెప్పుకొచ్చింది. ఇక పూర్తిగా సినిమాలే చేస్తానని కూడా క్లారిటీ ఇచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X