నటి ఝాన్సీ ఆత్మహత్య : సంచలన విషయాలు బయట పెట్టిన బాయ్‌ఫ్రెండ్!

'పవిత్రబంధం' అనే టీవీ సీరియల్ నటి ఝాన్సీ... శ్రీనగర్ కాలనీలోని తన అపార్టుమెంటులో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడంతో ఇండస్ట్రీ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఆమె మరణానికి బాయ్ ఫ్రెండ్‌ సూర్య అలియాస్ నానితో ప్రేమ వ్యవహారం చెడిపోవడమే అని, అతడు పెళ్లి చేసుకుంటానని చెప్పి మొహం చాటేయడం వల్లే మనస్తాపానికి గురై ఆమె బలవన్మరణానికి పాల్పడినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అయితే ఈ ఆరోపణలను సూర్య ఖండించారు. ఓ టీవీ ఛానల్‌తో మాట్లాడుతూ ఆయన సంచలన విషయాలు బయట పెట్టారు.

లవ్ చేసిన మాట నిజమే..

లవ్ చేసిన మాట నిజమే..

తను నన్ను లవ్ చేసింది. ఈ విషయాన్ని నేను కాదనడం లేదు. ఆమె ప్రపోజల్ గురించి నేను ఆలోచిస్తుండగా కొన్ని విషయాలు తెలిశాయి. తన ఫ్రెండ్సే ఆమె గురించి చాలా చెప్పారు. అప్పటి నుంచి దూరం పెట్టానని సూర్య తెలిపారు.

నాకంటే ముందు ఇద్దరు ముగ్గురితో లవ్

నాకంటే ముందు ఇద్దరు ముగ్గురితో లవ్

నాకంటే ముందు కూడా ఇద్దరు ముగ్గురిని ఝాన్సీ లవ్ చేసింది. వేరే విధంగా చేసిన కొన్ని వ్యవహారాల గురించి కూడా నాకు తెలిసింది. అప్పటి నుంచి ఆమెను దూరంగా ఉన్నాను. నా గురించి ఆమె కుటుంబ సభ్యులు చేస్తున్న ఆరోపణల్లో నిజంలేదని తెలిపారు.

ఆ ఇద్దరు బ్రోకర్లతో ఇబ్బంది

ఆ ఇద్దరు బ్రోకర్లతో ఇబ్బంది

సినిమా అవకాశాల విషయంలో తనది ఏదో ఇష్యూ ఉంది. అవకాశాలు ఇప్పిస్తామని బ్రోకర్స్ బాబీ, గిరి ఆమెను కలిసేవారు. వాళ్ల వైపు నుంచి ఈ అమ్మాయికి ఏదో టార్చర్ ఉంది. వారు ఇబ్బంది పెడుతున్న విషయం నాకు చెప్పగానే గిరి అనే వ్యక్తికి నేను వార్నింగ్ ఇచ్చాను. తప్పు ఎవరిదో తెలియదు. మనం చెప్పేది చెప్పాం. తను మారలేదు కాబట్టి తనతో మాట్లాడటం ఆపేసి చాలా రోజులుగా దూరంగా ఉంటున్నట్లు సూర్య తెలిపారు.

అవకాశాలే లేవు, యూజ్ చేసుకుందామనుకున్నారు

అవకాశాలే లేవు, యూజ్ చేసుకుందామనుకున్నారు

నేను సీరియల్స్ మానేయమన్నాను, నా వల్లే నటించడం మానేసింది అనే ఆరోపణల్లో నిజం లేదు. ఆ అమ్మాయికి అసలు ఛాన్సులు అనేవి లేవు. ఏమైనా వచ్చినా వాళ్లు వీళ్లు యూజ్ చేసుకుందామని అనుకున్నారు. బాబీ, గిరి అనే వ్యక్తులు ఇబ్బంది పెట్టారు. ఈ విషయం నాకు చెప్పడంతో వారిని మందలించినట్లు సూర్య తెలిపారు.

వాట్సాప్ మెసేజ్‌లో ఏముందో తెలియదు, డిలీట్ చేసింది

వాట్సాప్ మెసేజ్‌లో ఏముందో తెలియదు, డిలీట్ చేసింది

నాకు ఆమె ఒక ఫంక్షన్లో పరిచయమైంది. మా మధ్య రిలేషన్ ఏమీ లేదు. రెండు నెలల క్రితం నుంచే తెలుసు. నా కంటే ముందు కొందరిని లవ్ చేసినట్లు నా వద్ద ప్రూప్స్ కూడా ఉన్నాయి. చనిపోయే ముందురోజు రాత్రి పంపిన వాట్సాప్‌ సందేశంలో ఏముందో తెలియదు. నేను చూడక ముందే డిలీట్ ఎవ్రీవన్ చేసిందని సూర్య తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X