రాత్రికి నాతో ఉండిపోతే ఆఫరిస్తా.. స్టార్ హీరోయిన్‌‌కు నిర్మాత వేధింపులు

చిత్ర పరిశ్రమలో వెలిగిపోవాలని వస్తున్న యువతులను క్యాస్టింగ్ కౌచ్ భూతం బలి తీసుకుంటోంది. సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తామంటూ అమ్మాయిలను లోబరచుకుని తమ కోరికలు తీర్చుకుంటున్నారు కొందరు. సినిమాల్లోకి రావడానికి .. సినిమాల్లో అవకాశాలు కోల్పోకుండా ఉండేందుకు అమ్మాయిలను బెదిరించి లైంగిక దాడి చేస్తున్నారు. నిన్నగాక మొన్న వచ్చిన హీరోయిన్ల నుంచి టాప్ హీరోయిన్ల వరకు అంతా క్యాస్టింగ్ కౌచ్ బాధితులే.

హేమ రిపోర్ట్‌తో కలకలం
భారతీయ చిత్ర పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ గురించి నిత్యం ఎవరో ఒక హీరోయిన్ మీడియా ఎదుట వాపోతూనే ఉన్నారు. మలయాళ చిత్ర పరిశ్రమలోని ఈ చీకటి బాగోతాలను జస్టిస్ హేమ కమిటీ వెలుగులోకి తీసుకొచ్చిన ఘటన పరిశ్రమను నివ్వెరపరిచింది. ఈ నివేదిక ఆధారంగా నమోదైన కేసుల్లో సాక్ష్యం చెప్పడానికి బాధితులు ముందుకు రాకపోవడంతో పదుల సంఖ్యలో కేసులను సిట్ మూసివేయాల్సి వచ్చింది. ఈ ఘటన ఇండస్ట్రీలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో? కొందరు పరిశ్రమను ఎలా కనుసైగతో శాసిస్తున్నారో అర్ధమవుతుంది.

Actress Kalki Koechlin reveals her casting couch incident

కల్కి కోచ్లిన్‌కు క్యాస్టింగ్ కౌచ్ వేధింపులు
టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు క్యాస్టింగ్ కౌచ్‌కు ఎవరూ అతీతం కాదు.. చివరికి బుల్లితెరపైనా ఆడపిల్లను వదలని కామాంధులు ఎందరో. అవకాశాల కోసం అవమానాలు, వేధింపులను మౌనంగా భరిస్తున్న వారెందరో. అయితే కొందరు హీరోయిన్లు, మహిళా నటులు మాత్రం వీటిపై బహిరంగంగానే మాట్లాడుతూ పైకి పెద్ద మనుషులుగా చలామణి అవుతున్న వారి నిజస్వరూపాలను బట్టబయలు చేస్తున్నారు. తాజాగా తనకు ఎదురైన క్యాస్టింగ్ కౌచ్ అనుభవాలను బయటపెట్టారు హీరోయిన్ కల్కి కోచ్లిన్.

ఫ్రాన్స్‌లో సెటిలైన కల్కి
పుదుచ్చేరిలోని ఫ్రెంచ్ దంపతులకు జన్మించిన కల్కి కోచ్లిన్ .. చందా సినిమాతో బాలీవుడ్‌లో అడుగుపెట్టారు. ఆ తర్వాత దేవ్.డీ, జిందగీ నా మిలేగి దోబేరా, హే జవానీ హై దీవానీ, దట్ గర్ల్ ఇన్ యెల్లో బూట్స్, ఏక్‌ థి దయాన్, గల్లీ బాయ్ తదితర చిత్రాలతో టాలెంటెడ్ నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ ఏడాది తమిళంలో నెసిప్పాయతో ప్రేక్షకులను అలరించిన కల్కి.. ప్రస్తుతం ఇంగ్లీష్‌లో ఎమ్మా అండ్ ఎంజెల్ సినిమాలో నటిస్తున్నారు. బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్‌తో ప్రేమలో పడిన కల్కి తర్వాత ఊటీలోని తన నివాసంలో పెద్దల అంగీకారంతో ఆయనను పెళ్లాడారు. అయితే రెండేళ్లు తిరిగేసరికి ఈ జంట విడిపోయింది. గతేడాది గై హెర్స్‌బెర్గ్‌ అనే వ్యక్తిని పెళ్లాడి ఫ్రాన్స్‌లో స్థిరపడ్డారు కల్కి కోచ్లిన్.

బోల్డ్ కామెంట్స్‌తో సంచలనం
ఏ విషయంపై అయినా బోల్డ్‌గా మాట్లాడటం కల్కి స్టైల్. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో డ్యాన్స్, యాక్షన్ సీన్స్ గురించి శిక్షణ ఇస్తున్నారని.. అలాగే బెడ్ రూమ్ సీన్స్ చిత్రీకరించే విషయంలోనూ ముందుగా ట్రైనింగ్ ఇవ్వాలని సంచలన వ్యాఖ్యలు చేసింది. తాజాగా తన కెరీర్‌లో ఎదుర్కొన్న క్యాస్టింగ్ కౌచ్ అనుభవాలను పంచుకున్నారు కల్కి. బాలీవుడ్ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. లండన్‌లో చదువుకుంటున్న సమయంలో నోకియా ఫోన్‌ల ప్రోమో గర్ల్‌గా కేన్స్‌ ఫిల్మ్ ఫెస్టివల్‌కు వెళ్లానని గుర్తుచేసుకున్నారు. తన తల్లికి పరిచయమున్న ఓ నిర్మాత ఓ సినిమా స్క్రీనింగ్‌కు పిలిచాడని, ఆ తర్వాత విందుకు ఆహ్వానించాడని కల్కి చెప్పింది. ఇండస్ట్రీలో అవకాశాల గురించి అడగ్గా.. అది జరగాలంటే రాత్రి నేను అతనితోనే ఉండిపోవాలని చెప్పాడని కల్కి వెల్లడించింది.

ఆ నిర్మాత డిన్నర్‌కు పిలిచాడు
ఆ తర్వాత ముంబైలో ఓ పెద్ద సినిమా ఆడిషన్స్ కోసం వెళ్లానని కల్కి కోచ్లిన్ తెలిపారు. ఇది చాలా పెద్ద సినిమా అని .. నీ గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నానని ఆ నిర్మాత అన్నాడని తెలిపింది. బయటకు వెళ్దాం, డిన్నర్ చేద్దామని ఆఫర్ ఇవ్వడంతో .. తాను క్షమాపణలు చెప్పి మీ సమయాన్ని వృథా చేయడం నాకు ఇష్టం లేదని చెప్పి వచ్చేసినట్లు వెల్లడించింది. ప్రస్తుతం కల్కి వ్యాఖ్యలు చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారగా.. ఆమెను వేధించిన నిర్మాతలు ఎవరా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

More from Filmibeat

Read more about: kalki koechlin casting couch
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X