Bigg Boss Telugu 7 సీపీఐ నారాయణపై మండిపడ్డ కరాటే కల్యాణి.. డబ్బు ముట్టగానే సైలెంట్ అంటూ కామెంట్
బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ కొత్త సీజన్ ప్రారంభమైనప్పుడల్లా వివాదాలతోనే మొదలవుతుంది. ఈ షో సంప్రదాయాలను, సంస్కతిని తుంగలో తొక్కే కార్యక్రమం అంటూ కోర్టులో పిటిషన్స్ వేస్తుంటారు. అయితే బిగ్‌బాస్ తెలుగు 7 ప్రారంభానికి ముందు సీపీఐ నారాయణపై కరాటే కల్యాణి మండిపడ్డారు. సీపీఐ నారాయణ గురించి కరాటే కల్యాణి ఏమన్నారంటే?
బిగ్‌బాస్ తెలుగు షోలో బయటి వ్యక్తులు అనుకొన్నట్టు ఏమీ అసభ్యంగా ఉండదు. నేను స్వయంగా బిగ్‌బాస్‌కు వెళ్లి వచ్చాను కాబట్టి అక్కడ ఏం జరుగుతుందో నాకు తెలుసు. అర్ధమైన వాళ్లకు అర్ధమైనంత.. ప్రతీ సారి సీపీఐ నేత నారాయణ ఏదో ఒకటి అంటుంటారు. ఏమైనా సొమ్ము కోసం ఇలాంటి కామెంట్స్ చేస్తారేమో.. ఏదైనా డబ్బు కోసం ఇలాంటి కామెంట్ చేస్తారేమో. డబ్బు ముట్టిన తర్వాత ఆయన సైలెంట్ అయిపోతారేమో. బయట అనుకొనే టాక్ నేను చెబుతున్నాను అని కరాటే కల్యాణి ఘాటైన వ్యాఖ్యలు చేశారు.

సీపీఐ నారాయణ ఎన్నడైనా తన పిల్లలను విహార యాత్రకు, వినోదాలకు తీసుకెళ్లాడో లేదో తెలియదు. ప్రతీ సారి ఆయన నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంటాడు. దానిని ఎవరూ పట్టించుకోరు. అలాగే కొన్ని మహిళా సంఘాలు కూడా కోర్టులో పిటిషన్లు వేస్తుంటారు. షోను ఆపడానికి ఆదేశాలు ఇవ్వమని కోరుతుంటారు. సామాజిక సమస్యలు పట్టించుకోవడం మానేసి.. ఇలాంటి షోల గురించి ప్రచారం కోసం ఆర్బాటం చేస్తుంటారు అని కరాటే కల్యాణి క్లాస్ పీకారు.

బిగ్‌బాస్ తెలుగు 7 షో కేవలం వినోదంగా సాగే ఓ కార్యక్రమం. బిగ్‌బాస్ షో వల్ల మంచి జరుగుతుంది. చెడు జరుగుతంది. ఆ షోలో పాల్గొనే వారికి మంచి జరుగుతుంది. చెడు కూడా జరుగుతుంది. బిగ్‌బాస్ షోకు వెళ్లిన వాళ్లు ఆరు నెలలపాటు ఎక్కడా వర్క్ చేయకుండా ఒప్పందం చేసుకొంటారు. బిగ్‌బాస్ నుంచి వచ్చిన తర్వాత క్రేజ్ ఉంటుంది. ఆరు నెలలు గడిచిన తర్వాత సెలబ్రిటీలను ఎవరూ పట్టించుకోరు అని కరాటే కల్యాణి అసలు విషయం బయటపెట్టారు.
బిగ్‌బాస్‌కు వెళ్లడం వల్ల కొందరికి మంచి జరుగుతుంది. మరికొందరికి చెడు జరుగుతుంది. నా విషయంలో బిగ్‌బాస్ వల్ల నాకు పెద్దగా జరిగిందేమీ లేదు. నాకు ఎప్పుడూ మీడియాలో ఉండే క్రేజ్ ఎలాగూ ఉంటుంది. బిగ్‌బాస్ తెలుగు 7 కొత్తగా ఉండబోతుందంటే.. నేను కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను అని కరాటే కల్యాణి అన్నారు.

బిగ్‌బాస్ తెలుగు 6 ఫ్లాప్ అయిందో లేదో నాకు తెలియదు. కానీ బిగ్‌బాస్ 4 మాత్రం హిట్ అయింది. ఆ షోలో నేను కూడా ఉన్నాను. ఆ తర్వాత నేను మిగితా సీజన్‌లు నేను చూడలేదు. బిగ్‌బాస్ తెలుగు 7 మంచి ఫ్లాట్‌ఫాం. చాలా మంది రెండోసారి వెళ్తుంటారు. నాకు అవకాశం వస్తే వెళ్లడానికి ప్రయత్నిస్తా అని కరాటే కళ్యాణి అన్నారు.


Click it and Unblock the Notifications











