అనసూయను ఆంటీ అనడం అదే మీనింగ్.. ఎన్టీఆర్ అలా, మంచు లక్ష్మీది ఓవర్: 'గృహలక్ష్మి' కస్తూరి

ఒకప్పుడు స్టార్ హీరోయిన్స్ గా వెలుగు వెలిగిన ముద్దుగుమ్మలు ఇప్పుడు తమ ఏజ్ కు తగిన పాత్రలతో సినిమాల్లో సందడి చేస్తున్నారు. హీరోలకు తల్లి, సోపోర్టింగ్ క్యారెక్టర్స్ తో ముందుకుసాగుతున్నారు. మరికొంతమంది బుల్లితెరపై సీరియళ్లలో నటిస్తూ హవా కొనసాగిస్తున్నారు. అలాంటి వారిలో అలానటి గ్లామరస్ బ్యూటి కస్తూరి శంకర్ ఒకరు. ప్రస్తుతం ఇంటింటి గృహలక్ష్మి అనే సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. సినిమాలు, వెబ్ సిరీస్ ల్లో నటిస్తూ ధారావాహికల్లో రాణిస్తున్న ఆమె కాంట్రవర్సీ కామెంట్స్ తో సోషల్ మీడియాలో ట్రోలింగ్ బారిన కూడా పడుతుంటారు. అయితే తాజాగా అనసూయను ఆంటీ అని పిలవడం, జూనియర్ ఎన్టీఆర్ ఇంగ్లీష్ యాక్సెంట్ పై షాకింగ్ కామెంట్స్ చేశారు.

వరుసగా 3 ఇండస్ట్రీల్లో..

వరుసగా 3 ఇండస్ట్రీల్లో..

చిన్న వయసులోనే మిస్ చెన్నైగా ఎంపికైనా బ్యూటిఫుల్ కస్తూరి శంకర్ కు వరుసగా సినిమా అవకాశాలు వచ్చాయి. దీంతో ఆతా ఉన్ కోయిలిలే అనే తమిళ సినిమాతో కోలీవుడ్ ఇండస్ట్రీకి నటిగా పరిచయమయ్యారు. ఆ వెంటనే చక్రవర్తి అనే మలయాళ చిత్రంలో నటించింది. ఆ తర్వాత గ్యాంగ్ వార్ అనే సినిమాతో తెలుగులో చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టారు. వరుసగా మూడు ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన ఆమె అనంతరం కన్నడ చిత్రాల్లోనూ నటించి పాపులర్ అయ్యారు.

20 ఏళ్లకుపైగా..

20 ఏళ్లకుపైగా..

సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ కాలంలోనే దక్షిణాది మొత్తం కస్తూరి శంకర్ మంచి గుర్తింపు తెచ్చుకునే స్థాయికి ఎదిగారు. ఆమెకు వచ్చిన పాపులారిటీతో మరిన్ని అవకాశాలు అందిపుచ్చుకున్నారు. ఇలా దాదాపు ఇరవై ఏళ్లకు పైగానే చేతి నిండా చిత్రాలతో ఫుల్ బిజీగా మారిపోయారు. ఈ క్రమంలోనే ఎన్నో విజయాలను కూడా ఖాతాలో వేసుకున్నారు. దీంతో తన ఫాలోయింగ్‌ను దేశ వ్యాప్తంగా ఏర్పరచుకుని మరిన్ని చిత్రాలు చేశారు.

చిరంజీవికి తల్లిగా..

చిరంజీవికి తల్లిగా..

భారతీయుడు, అన్నమయ్య వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన కస్తూరి శంకర్ ప్రస్తుతం వయసుకు తగిన పాత్రలు చేస్తున్నారు. గతేడాది వచ్చిన చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమాలో చిరంజీవికి తల్లిగా చేసిన కస్తూరి పరంపర వెబ్ సిరీస్ లో నెగెటివ్ రోల్ పోషించారు. అలాగే అప్పట్లో వచ్చిన రవితేజ డాన్ శీను మూవీలో అక్కగా నటించారు. ప్రస్తుతం బుల్లితెరపై ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లీడ్ రోల్ చేస్తూ ఆకట్టుకుంటున్నారు.

వయసుతో సంబంధం లేకుండా..

వయసుతో సంబంధం లేకుండా..

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కస్తూరి యాంకర్ అనసూయను ఆంటీ అని పిలడవం, ఎన్టీఆర్, మంచు లక్ష్మీ ఇంగ్లీష్ యాక్సెంట్ పై షాకింగ్ కామెంట్స్ చేశారు. "ఒక చిన్న పాప వచ్చి పిలవడానికి, అడల్ట్ వ్యక్తి వచ్చి పిలవడానికి చాలా తేడా ఉంటుంది. చిన్నపిల్లలు కాకుండా పెద్దవారు ఎవరైనా ఒక మహిళను ఆంటీ అని పిలిచే హక్కు లేదు. వయసుతో సంబంధం లేకుండా ఏ మహిళైన ఆంటీ అని పిలవడం చిన్న పిల్లలకే కరెక్ట్. అడల్ట్ ఎవరైనా అలా పిలిచారంటే అది కచ్చితంగా అగౌరపర్చాడనికైనా అయి ఉండాలి లేదా డర్టీ మీనింగ్ అయినా ఉండాలి" అని కస్తూరి శంకర్ తెలిపారు.

అంకుల్ అని పిలవగలరా..

అంకుల్ అని పిలవగలరా..

ఇంకా కస్తూరి కొనసాగిస్తూ "ఒక హీరో లేదా నటుడి దగ్గరికెళ్లి అంకుల్ అని పిలుస్తారా.. నిజానికీ ఆంటీ అనే పదానికి ప్రస్తుతం డర్టీ మీనింగ్ కూడా వచ్చేసింది. కానీ అంకుల్ అనే పదంలో అలాంటిదేం లేదు. అనసూయ కన్నా రెట్టింపు వయసున్న హీరోలున్నారు. వాళ్లను అంకుల్ అని పిలవగలరా. ఈ విషయంలో నేను అనసూయకే సపోర్ట్ చేస్తా. ఎలా పిలవాలో తెలియకపోతే మేడమ్ అనండి. సిస్టర్ లేదా.. అమ్మా అని పిలవండి. అదీ కాదంటే గారు అని సంబోధించండి" అని చెప్పుకొచ్చారు.

మంచు లక్ష్మీ వంటి వారు..

మంచు లక్ష్మీ వంటి వారు..

గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ కార్యక్రమంలో ఎన్టీఆర్ మాట్లాడిన అమెరికన్ యాక్సెంట్ పై జరిగిన ట్రోల్స్ పైనా కస్తూరి స్పందించారు. "ఎన్టీఆర్ చాలా బాగా మాట్లాడారు. అక్కడ అలా మాట్లాడితేనే కరెక్ట్. అలాగని అమెరికన్ యాక్సెంట్ ను హైదరాబాద్ లో ట్రై చేయకూడదు. మంచు లక్ష్మీ వంటి వారు తెలుగును కూడా అమెరికన్ యాక్సెంట్ లో మాట్లాడటమంటే ఓవర్ చేయడమే" అని తన అభిప్రాయం తెలిపారు కస్తూరి శంకర్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X