Adipurush ప్రభాస్‌పై 'గృహలక్ష్మి' కస్తూరి షాకింగ్ కామెంట్స్.. రాముడిలా కాదు అలా ఉన్నాడంటూ!
ఒకప్పుడు స్టార్ హీరోయిన్స్ గా వెలుగు వెలిగిన ముద్దుగుమ్మలు ఇప్పుడు తమ ఏజ్ కు తగిన పాత్రలతో సినిమాల్లో, సీరియళ్లలో సందడి చేస్తున్నారు. అలాంటి వారిలో సీనియర్ బ్యూటి కస్తూరి శంకర్ ఒకరు. చిన్న వయసులోనే మిస్ చెన్నైగా ఎంపికైనా బ్యూటిఫుల్ కస్తూరి శంకర్ తెలుగు, తమిళ చిత్రాల్లో హీరోయిన్ గా మంచి పేరు తెచ్చుకుంది. ఇప్పుడు 'ఇంటింటి గృహలక్ష్మి' సీరియల్ తో తెలుగు ప్రేక్షకులకు మరింతగా చేరువైంది. అయితే తాజాగా ఆమె ఆదిపురుష్ లో రాముడి పాత్ర చేసిన ప్రభాస్ పై షాకింగ్ కామెంట్స్ చేసింది.
చిత్రాలతో పాపులర్: మిస్ చెన్నైగా ఎంపికైన కస్తూరి శంకర్ కు వరుసగా సినిమా అవకాశాలు వచ్చాయి. దీంతో ఆతా ఉన్ కోయిలిలే అనే తమిళ సినిమాతో కోలీవుడ్ ఇండస్ట్రీకి నటిగా పరిచయమయ్యారు. ఆ వెంటనే చక్రవర్తి అనే మలయాళ చిత్రంలో నటించింది. ఆ తర్వాత గ్యాంగ్ వార్ అనే సినిమాతో తెలుగులోకి అడుగు పెట్టారు. వరుసగా 3 ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన ఆమె అనంతరం కన్నడ చిత్రాల్లోనూ నటించి పాపులర్ అయ్యారు.

ఎన్నో విజయాలు: సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ కాలంలోనే సౌత్ సినీ ఇండస్ట్రీ మొత్తం కస్తూరి శంకర్ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆమెకు వచ్చిన పాపులారిటీతో మరిన్ని అవకాశాలు అందిపుచ్చుకుంది. ఇలా దాదాపు 20 ఏళ్లకు పైగానే చేతి నిండా చిత్రాలతో ఫుల్ బిజీగా మారిపోయారు. ఈ క్రమంలోనే ఎన్నో విజయాలను కూడా ఖాతాలో వేసుకున్నారు.

లీడ్ రోల్స్ చేస్తూ: భారతీయుడు, అన్నమయ్య వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన కస్తూరి శంకర్ ప్రస్తుతం వయసుకు తగిన పాత్రలు చేస్తున్నారు. డాన్ శీనులో రవితేజకు అక్కగా, గాడ్ ఫాదర్ లో చిరంజీవికి తల్లిగా చేసిన కస్తూరి పరంపర వెబ్ సిరీస్ లో నెగెటివ్ రోల్ పోషించారు. ప్రస్తుతం బుల్లితెరపై 'ఇంటింటి గృహలక్ష్మి' సీరియల్ లీడ్ రోల్ చేస్తూ ఆకట్టుకుంటున్నారు.

రాముడిలా కాదు: అయితే తాజాగా ఆదిపురుష్ పై కస్తూరి శంకర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. "రామలక్ష్మణులు మీసాలు, గడ్డంతో చూపించిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఇలాంటి గెటప్ లో చూపించాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది. తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతోమంది దిగ్గజ నటులు శ్రీరాముడి పాత్రను అద్భుతంగా చేశారు. ఆయన పాత్ర ఎంతో పరిపూర్ణంగా ఉండేది. కానీ ఆదిపురుష్ సినిమాలో ప్రభాస్ రాముడిలా కాకుండా కర్ణుడిలా కనిపిస్తున్నాడు" అని కస్తూరి అన్నారు.

యోధుడిగా: దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్న ఆదిపురుష్ సినిమా, అందులోని ప్రభాస్ లుక్ పై కస్తూరి శంకర్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. కొంతమంది మద్దతు ఇస్తే.. మరికొంతమంది విమర్శిస్తున్నారు. మూస ధోరణిలో రాముడిని చూసే వారికి ప్రభాస్ గెటప్ నచ్చకపోవచ్చు. ఆ రూపమే శ్రీరాముడని యోధుడిగా చూపిస్తుందనే విషయాన్ని మర్చిపోవద్దని అంటున్నారు.


Click it and Unblock the Notifications











