కుక్కలు కూడా అలా చేయవు.. ఎమ్మెల్యే బంధువుపై 'గృహలక్ష్మి' కస్తూరి.. సీఎం ఏం చేశారంటే?

అన్నమయ్య సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన హీరోయిన్ కస్తూరి శంకర్. అప్పట్లో అనేక చిత్రాలతో తన గ్లామర్ తో అలరించిన కస్తూరి ప్రస్తుతం తెలుగు బుల్లితెరపై సందడి చేస్తోన్న కస్తూరి శంకర్ ఇంటింటి గృహలక్ష్మి ధారావాహికలో ప్రధాన పాత్ర పోషిస్తోంది. అలాగే అప్పుడప్పుడు పలు టీవీ షోలకు హాజరై అలరిస్తుంది. అయితే సోషల్ మీడియాలో నిత్యం యమ యాక్టివ్ గా ఉండే కస్తూరి శంకర్ సామాజిక అంశాలపై గట్టిగానే మాట్లాడుతుంది. తాజాగా ఓ ఎమ్మెల్యే బంధువు చేసిన పనిపై తెగ ఫైర్ అయింది కస్తూరి. ఈ విషయం సీఎం వరకు వెళ్లడం విశేషంగా మారింది.

మద్యం మత్తులో:సోషల్ మీడియాలో జూలై 5న ఓ వీడియో కలకలం సృష్టించింది. అమానవీయ చర్యకు సంబంధించిన ఈ వీడియో వైరల్ కాగా అది చూసిన ప్రతి ఒక్కరు కోపంగా రగిలిపోయేలా ఉంది. మద్యం మత్తులో ఊగుతూ, సిగరెట్ కాలుస్తున్న ప్రవేశ్ శుక్లా అనే వ్యక్తి చేసిన పనికి అందరూ మండిపడుతున్నారు. మద్యం మత్తులో రోడ్డు పక్కన మెట్లపై కూర్చున్న ఒక యువకుడిపై ప్రవేశ్ శుక్లా మూత్ర విసర్జన చేశాడు.

Actress Kasthuri Shankar Fires On BJP Worker Urinating On Person In Madhya Pradesh

కఠినంగా శిక్షించాలి:ప్రవేశ్ శుక్లా అలా మూత్ర విసర్జన చేయడంతో ఆ యువకుడు ఏం చేయలేని స్థితిలో నిస్సహాయంగా కనిపించాడు. ఈ సంఘటన మధ్యప్రదేశ్ లోని సిధ్ జిల్లాలో చోటు చేసుకున్నట్లు సమాచారం. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ కావడంతో నెటిజన్లు అతనికి కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ కస్తూరి శంకర్ ఏకంగా ఆ వ్యక్తిని చీల్చి చెండాడింది.

Actress Kasthuri Shankar Fires On BJP Worker Urinating On Person In Madhya Pradesh

అలా వదిలేస్తారా:"కుక్కలు కూడా అలా చేయాలనుకోవు. ఆ సిక్కో అయినా ప్రవేశ్ శుక్లా మధ్యప్రదేశ్ లోని బీజేపీ ఎమ్మెల్యే కేదార్ నాథ్ శుక్లాకు సన్నిహితుడని అంటున్నారు. నిర్ణయాత్మకంగా తక్షణమే శిక్షిస్తారా లేదా విషయాన్ని వదిలేస్తారా? గతంలో ఎయిర్ ఇండియా విమానంలో జరిగిన, తమిళనాడు బీజేపీ లీడర్ చేసిన మరొక ఘటన గుర్తుకొచ్చి అడుగుతున్నాను" అని వీడియో షేర్ చేస్తు రాసుకొచ్చింది కస్తూరి శంకర్.

క్విక్ రియాక్షన్:కస్తూరి శంకర్ ట్వీట్ చేసిన కొద్ది సమయానికే మధ్యప్రదేశ్ పోలీసులు ప్రవేశ్ శుక్లాను అరెస్ట్ చేసినట్లు తెలిసింది. ఈ విషయాన్ని సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ను కస్తూరి రీట్వీట్ చేశారు. "వావ్ క్విక్ రియాక్షన్. ఈ విషయం గురించి ఇప్పటికే మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ తెలుసుకున్నారు" అని కస్తూరి శంకర్ చెప్పుకొచ్చింది.

సెక్షన్స్ అమలు:కస్తూరి శంకర్ చేసిన ట్వీట్ లో ఇంకా కొనసాగిస్తూ.. "యువకుడిపై మూత్ర విసర్జన చేసిన ప్రవేశ్ శుక్లాను అరెస్ట్ చేసి NSA (నేషనల్ సెక్యూరిటీ యాక్ట్) అమలు చేశారు. అతను PCA, IPC 290, IPC 352 మరిన్ని సెక్షన్ల కింద శిక్షించబడతాడు. అలాగే ఎమ్మెల్యే కేదారినాథ్ శుక్లాకు నిందితుడితో తనకు ఎలాంటి సంబంధం లేదని ఖండించారు" అని తెలిపింది. ఇలా కస్తూరి ట్వీట్ పై సీఎం స్పందించి చర్యలు తీసుకున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X