నయనతారకు ఆ అర్హత లేదు.. రజనికాంత్‌పై అలా.. మళ్లీ అగ్గి రాజేసిన 'గృహలక్ష్మి' కస్తూరి
దక్షిణాది చిత్ర పరిశ్రమలో లేడి సూపర్ స్టార్ గా పేరు సంపాదించుకుంది ముద్దుగుమ్మ నయనతార. సుమారు 17 ఏళ్ల పాటు సినిమాలతో ఎంటర్టైన్ చేస్తున్న నయనతార తెలుగు, మలయాళ, తమిళ చిత్ర పరిశ్రమలో సత్తా చాటుతోంది. అంతేకాకుండా జవాన్ మూవీతో బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోకి సైతం అడుగుపెట్టింది. ప్రస్తుతం సినిమాలతోపాటు మాతృత్వాన్ని ఆస్వాదిస్తున్న నయనతారకు ఆ అర్హత లేదంటూ 'ఇంటింటి గృహలక్ష్మి' సీరియల్ నటి కస్తూరి శంకర్ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇదివరకు లాగానే మరోసారి తన హీట్ కామెంట్లతో అగ్గి రాజేసింది. నయనతార, రజనికాంత్ గురించి కస్తూరి ఏమందంటే?
హీరోయిన్ గా:ఒకప్పుడు స్టార్ హీరోయిన్స్ గా వెలుగు వెలిగిన ముద్దుగుమ్మలు ఇప్పుడు తమ వయసుకు తగిన పాత్రలతో సినిమాలు, సీరియళ్లు చేస్తూ అలరిస్తున్నారు. అలాంటి వారిలో సీనియర్ హీరోయిన్ కస్తూరి శంకర్ ఒకరు. చిన్న వయసులోనే మిస్ చెన్నైగా ఎంపికైనా బ్యూటిఫుల్ కస్తూరి శంకర్ తెలుగు, తమిళ చిత్రాల్లో హీరోయిన్ గా మంచి పేరు తెచ్చుకున్న విషయం తెలిసిందే.

20 ఏళ్లకు పైగా: ఆతా ఉన్ కోయిలిలే అనే తమిళ సినిమాతో కోలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైన కస్తూరి శంకర్ ఆ వెంటనే చక్రవర్తి అనే మలయాళ చిత్రంలో నటించింది. అనంతరం గ్యాంగ్ వార్ అనే సినిమాతో తెలుగులోకి అడుగు పెట్టారు. వరుసగా మూడు ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన కస్తూరి కన్నడ చిత్రాల్లోనూ హీరోయిన్ గా పాపులర్ అయ్యారు. దాదాపు 20 ఏళ్లకుపైగా సినిమాలతో స్టార్ హీరోయిన్ రేంజ్ తెచ్చుకున్నారు.
లీడ్ రోల్స్ చేస్తూ: భారతీయుడు, అన్నమయ్య వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన కస్తూరి శంకర్ ప్రస్తుతం వయసుకు తగిన పాత్రలు చేస్తున్నారు. డాన్ శీనులో రవితేజకు అక్కగా, గాడ్ ఫాదర్ లో చిరంజీవికి తల్లిగా చేసిన కస్తూరి పరంపర వెబ్ సిరీస్ లో నెగెటివ్ రోల్ పోషించారు. ప్రస్తుతం బుల్లితెరపై 'ఇంటింటి గృహలక్ష్మి' సీరియల్ లీడ్ రోల్ చేస్తూ ఆకట్టుకుంటున్నారు. దీంతో ఆమె తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు.
సరోగసి ద్వారా: ఇదిలా ఉంటే సౌత్ లేడి సూపర్ స్టార్ గా పేరు పొందిన నయనతారపై మరోసారి కస్తూరి శంకర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. అంతకుముందు నయనతార సరోగసి ద్వారా పిల్లలకు జన్మనివ్వడంపై అభ్యంతరం తెలుపుతూ వ్యాఖ్యలు చేశారు. సరోగసి విధానం ప్రభుత్వ నిబంధనలకు లోబడే చేశారా? లేదా? అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించింది.

ఆయన యాప్ట్: తాజాగా నయనతారతోపాటు కోలీవుడ్ స్టార్ హీరోలపై ఊహించని వ్యాఖ్యలు చేసింది కస్తూరి శంకర్. "సౌత్ ఇండియాలో నయనతారను లేడి సూపర్ స్టార్ గా అంగీకరించలేను. నేను ఆమె ఫ్యాన్. కానీ లేడి సూపర్ స్టార్ అంటే ఒప్పుకోలేను. సూపర్ స్టార్ ఎవరు అని అడిగితే చిన్న పిల్లలు కూడా చెబుతారు రజనికాంత్ అని. అందుకు ఆయన యాప్ట్. ఆ తర్వాతే కమల్, విజయ్, అజిత్. వీళ్లేవరు కూడా రజనీకాంత్ ను కూడా భర్తీ చేయలేరు" అని కస్తూరి శంకర్ తెలిపింది.

వాళ్లు సూపర్ స్టార్స్: మీ దృష్టిలో లేడి సూపర్ స్టార్ ఎవరు అన్న ప్రశ్నకు కేపి సుందరాంబల్, విజయ్ శాంతి పేర్లను చెప్పుకొచ్చింది కస్తూరి శంకర్. ప్రస్తుతం కస్తూరి శంకర్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నాయి. నయనతారకు ఫ్యాన్ అంటూనే ఇలా మాట్లాడటంపై ఆమె అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











