పిల్లల్ని కంటే ఎంజాయ్ చేయలేం.. అందుకే వద్దనుకుంటున్నాం.. నటి సంచలనం

పెళ్లి చేసుకోవడం.. ఆ వెంటనే పిల్లల్ని కనడం.. ఆ తర్వాత సంసార బాధ్యతలను భుజాలపై వేసుకొని జీవితంతో పోరాడటం అనేది ప్రతీ వ్యక్తి జీవితంలో జరిగే పరిణామాలే. అదే జీవితం కూడా. అయితే కొందరు మాత్రం దీనిని ఏకీభవించారు. పెళ్లి, పిల్లలు, సంసారం తమకేవీ పట్టవన్నట్లుగా మాట్లాడుతుంటారు. అలాంటి వారిలో ఒకరే నటి కవితా కౌశిక్. సోనీ టీవీలో ప్రసారమైన ఎఫ్.ఐ.ఆర్ ద్వారా ప్రేక్షకులకు చేరువైన నటి కవితా కౌశిక్.. తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో సంచలనంగా మాట్లాడారు. వివరాల్లోకెళితే..

2017 లో వివాహం..

2017 లో వివాహం..

రోనిత్ బిస్వాస్ అనే వ్యక్తిని 2017 సంవత్సరం పెళ్లాడింది నటి కవితా కౌశిక్. టెలివిజన్ నటిగా మంచి పాపులారిటీ తెచ్చుకున్న ఈమె పెళ్ళైన మరునాటి నుంచే భర్తతో కలిసి హానీమూన్ షికార్లు చేస్తూ తెగ ఎంజాయ్ చేస్తోంది. అయితే ఆ దంపతులు పిల్లల్ని కనేందుకు ఆసక్తిగా లేకపోవడం విశేషం.

పిల్లల్ని కనొద్దని డిసైడ్ అయ్యాం..

పిల్లల్ని కనొద్దని డిసైడ్ అయ్యాం..

నటి కవితా కౌశిక్, ఆమె భర్త రోనిత్ బిస్వాస్ ఇద్దరూ కలిసి పిల్లల్ని కనొద్దని డిసైడ్ అయ్యారట. ఈ విషయాన్ని కవితా కౌశిక్ స్వయంగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. ప్రస్తుతం ఇద్దరం నలభై ఏళ్లకు దగ్గరగా ఉన్నాం. ఈ వయసులో పిల్లల్ని కనాలనుకోవడం లేదు. ఒకవేళ కొంతకాలం తర్వాత పిల్లల్ని కందామని అనుకున్నా అప్పటికే మాకు నలభై ఏళ్లొస్తాయి. కాబట్టి ఆ ఆలోచనే సరైందని కాదని అనుకున్నాం.. అంటోంది కవితా కౌశిక్.

వాళ్లకు 20 వస్తే మాకు 60 వస్తాయ్..

వాళ్లకు 20 వస్తే మాకు 60 వస్తాయ్..

లేటు వయసులో పిల్లల్ని కంటే వారినే కష్ట పెట్టినట్లవుతుంది. ఎందుకంటే వాళ్లకు 20 ఏళ్ల వయసొచ్చే సరికి మాకు 60 ఏళ్ళు వచ్చేస్తాయి. అంటే మా పిల్లలు ఇరవై ఏళ్లలోనే వృద్ధులైన మమ్మల్ని చూసుకోవాల్సి వస్తుంది. మా కారణంగా వాళ్ల యవ్వనంలో చాలా త్యాగాలు చేయాల్సి వస్తుంది. కాబట్టి పిల్లల్ని కనకపోవడమే మేలు.. అని పేర్కొంది కవితా.

ఎలా ఎంజాయ్ చేస్తాం.. కొన్ని సందర్భాల్లో

ఎలా ఎంజాయ్ చేస్తాం.. కొన్ని సందర్భాల్లో

ప్రస్తుతం తామిద్దరం తెగ ఎంజాయ్ చేస్తున్నామని చెప్పిన కవితా కౌశిక్.. ఒకవేళ పిల్లలుంటే ఇలా ఎంజాయ్ చేయగలమా? అని అంటుండటం గమనార్హం. ''ట్రావెల్ చేస్తూ.. భార్య భర్తలుగా అనుభవించాల్సినవన్నీ అనుభవిస్తూ ఫుల్ ఖుషీగా ఉన్నాం. కొన్ని సందర్భాల్లో తనకు నేను తండ్రిగా.. అదేవిధంగా కొన్ని సందర్భాల్లో నాకు ఆయన తల్లిగా కూడా మారిపోతూ జీవితం సాఫీగా సాగిస్తున్నాం. ఇంకా పిల్లలెందుకు? అని మాట్లాడుకొచ్చింది కవితా కౌశిక్.

Read more about: kavita kaushik ronnit biswas
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X