twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సైకో బిగ్ బాస్.. సమంత ఇష్యూ లాగుతూ మాధవీలత సంచలనం.. నాగ్ కు 100 కోట్ల జరిమానా అంటూ అతనికి సపోర్ట్?

    |

    బుల్లితెర ప్రేక్ష‌కులని అల‌రిస్తున్న‌ బిగ్ బాస్ మన సంస్కృతికి వ్యతిరేకం అంటూ ఎప్పటికప్పుడు వాదనలు తెరమీదకు వస్తూనే ఉంటుంది. ఎక్కువగా కమ్యూనిస్ట్ నేత నారాయణహడావుడి చేస్తూనే ఉంటారు. తాజాగా బిగ్ బాస్ పై తెలుగు హీరోయిన్.. కమ్ బీజేపీ నాయకురాలు అయిన మాధవి లత అలాంటి కామెంట్స్ చేయడం సంచలనంగా మారుతున్నాయి. ఆమె సోషల్ మీడియా ద్వారా బిగ్ బాస్ టీమ్ సహా హోస్ట్ గా చేస్తున్న నాగార్జునను, ఆ టీంను టార్గెట్ చేసి విమర్శలు చేసింది. ఆ వివరాల్లోకి వెళితే

    ఆయనకు సపోర్ట్?

    ఆయనకు సపోర్ట్?

    ఆమె బిగ్ బాస్ కంటెస్టెంట్ సన్నీని సపోర్ట్ చేస్తున్నట్టు అనిపిస్తోంది. నాగార్జున పాల్గొన్న ఆదివారం ఎపిసోడ్ పై ఆమె ఘాటుగా స్పందించింది. ఒక కంటెస్టెంట్ ను తీవ్రంగా వేదిస్తున్నారు. మానసికంగా అతడిని బలహీన పర్చే విధంగా మాట్లాడుతున్నారు అంటూ మాధవిలత పోస్ట్ పెట్టింది. బిగ్ బాస్ లో అనాగరిక చర్య జరుగుతుంది అంటూ ఆమె చాలా సీరియస్ గా కామెంట్స్ పెట్టడం ప్రస్తుతం చర్చనీయాంశం అయ్యింది. బిగ్ బాస్ టీమ్ - నాగార్జున ఒక మనిషిని ఆత్మహత్య చేసుకునేంతగా అవమానిస్తూ అతడిని అత్యంత దారుణంగా మానసిక క్షోభకు గురి చేస్తున్నారంటూ ఆమె తన పోస్ట్ లో పేర్కొంది. దీనిపై మానవ హక్కులు మరియు ప్రజా సంఘాల వారు ఎలాగూ స్పందించరు. నాగరిక సమాజంలో బతుకుతున్న మనం ఇలాంటి చర్యలను అస్సలు సహించవద్దు అన్నట్లుగా ఆమె పోస్ట్ లో పేర్కొంది.

    విషపు ఆలోచనలతో

    విషపు ఆలోచనలతో

    అయితే పేరు ప్రస్తావించలేదు కానీ ఆమె తాజాగా మరో సుదీర్ఘ పోస్ట్ పెట్టింది. గత కాలంలో పల్లెటూర్లలో శిక్షలు ఉండేవనీ,
    తప్పు చేసిన వాడికి సగం మీసం లేదా అరగుండు లేదా గుండు కొట్టి సున్నం బొట్టు పెట్టి గాడిద మీద ఉరేగింపు, రాత్రి కటిక నేలమీద నిద్ర చేయిస్తూ ఊరంతా నువ్ తప్పు చేసావ్ అని తెలిసేలా మెడలో ఒక బోర్డు వేసేవారని, అలా ఆరోజుల్లో శిక్షలు ఉండేవనీ అన్నారు. సున్నిత మనస్కులు తర్వాత అవమాన భారంతో ఆత్మహత్యలు చేసుకునేవారు, ఇలాంటి కఠిన విష సంసృతి వొద్దు అని, మనుషులం మనం మృగాళ్లలా ఉండొద్దు అని మనల్ని మనం మార్చుకుంటూ వచ్చామన్న ఆమె ఇప్పుడు బిగ్ బాస్ టీంలో ఇప్పటికి అలాంటి విషపు ఆలోచనలతో ఉన్నవారినే క్రియేటివ్ టీమ్ లోకి తీసుకోవడం, ఒక సైకో మనస్తత్వం ఉన్నవారికి షోని డిజైన్ చేసే అవకాశం ఇవ్వడం అనేది ఎంతటి దుర్మార్గం అని ఆమె ప్రశ్నించారు.

    సైకో మెంటాలిటీ

    సైకో మెంటాలిటీ

    ఈ నాగరిక సమాజంలో అన్ని భాషల్లో ఇలాంటి పనికిమాలిన పద్ధతులు, మనుషులని కించపరచడం, దానికి బిగ్ బాస్ హౌస్ ఒక దేవాలయం ఇక్కడ జ్ఞానం వస్తుంది అన్నట్లు డబ్బా కొట్టడం అంటూ ఆమె విమర్శించారు. తప్పుని నిలదీయలేని ఒక హోస్ట్, తెలుగులో విషపు ఆలోచనలకి బాటలు వేయడమే అని ఆమె విమర్శించారు. సైకో మెంటాలిటీ ఉన్నవాళ్లు సమాజంలో 70% ఉన్నారన్న ఆమె వాళ్ళు ఇదే సరి అయినది అన్నట్లు ఉంటున్నానీ, ఎలాంటి అనాగరికపు చర్యలకి దిగజారుతున్న టీవీ షోను కూడా పట్టించుకోకుండా ప్రజలు వదిలేస్తున్నారనీ, దాని సంబంధిత మినిస్ట్రీ దానిని పట్టించుకోవాలని ..సెన్సార్ కూడా చేయాలని డిమాండ్ చేశారు. ఎపుడూ తాను ఆ షోకి వెళ్లడానికి ఇంట్రెస్ట్ చూపించను అని, దేవుడి దయవలన డబ్బు వస్తే ఆ ఛానల్ ని కొని ఆ షో కి నేనే హోస్ట్ గ వెళ్లి రోస్ట్ చేస్తానని అన్నారు.

    హోస్ట్ కి 100 కోట్ల జరిమానా

    హోస్ట్ కి 100 కోట్ల జరిమానా

    లేదా ఆ మినిస్ట్రీ మీద నాకు పగ్గాలు వస్తే ఇలాంటి షో ని పద్ధతి లేకుండా అనాగరికపు వ్యవస్థకి పట్టం గడుతున్న యాజమాన్యం మరియు హోస్ట్ కి 100 కోట్ల జరిమానా వేయిస్తానని అన్నారు. సమాజానికి ప్రజలు మర్చిపోయిన అనాకారిక పద్ధతులని భారత దేశం అంతటా బాన్ చేయాలి, ఇది చూస్తూ నోర్ముసుకున్న సామజిక కార్యకర్తల, టీవీ చానెల్స్ స్పందించాలని డిమాండ్ చేశారు. సమంత విడాకులు విషయం ప్రపంచ వింతలా టెలికాస్ట్ చేసిన చానెల్స్, రెచ్చిపోయిన విలేకరులు, ఇలాంటి సభ్య సమాజం అస్యహించుకునే అనాకారిక చర్యల మీద మీరు మాట్లాడారా? దైర్యం లేదా? లేక భయమా? లేక మాకెందుకు అనే నిర్లక్షమా ?ఎవరు ఐన మనిషే, ఒక మనిషిని శిక్షించడానికి మీకు హక్కు లేదు, కేవలం మందలించడం మాత్రమే ..జైలు అంటున్నారు సమంజసం. మెడలో బోర్డులు తగిలించి మానసిక హింసకి గురి చేసిన యాజమాన్యం యొక్క మానసిక స్థితిగతులు ఏంటి ?అలంటి స్క్రిప్ట్ రాసిన వాడి యొక్క రాక్షస ఆలోచనల వలన సమాజం విషం కక్కుతోంది అనే విషయం మరిచారా? అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు.

    హోస్ట్ బాధ్యత విస్మరించారు

    హోస్ట్ బాధ్యత విస్మరించారు

    భారత దేశం లో బిగ్ బాస్ హౌస్ కి వెళ్లి ఇలాంటి శిక్ష అనుభవించిన వారి మానసిక వేదన ఎలాంటిది? అని ఆమె ప్రశ్నించారు. అప్పట్లో ఒక ఊరి ప్రజలకి పరిమితం ఐన పరువు కోసం ప్రాణాలు తీసుకునే వారు, మరి ప్రపంచం అంతా చూస్తున్న ఒక టీవీ షో ద్వారా ఏం చెప్పాలి అనుకుంటున్నారు? ఇది చూసి రేపు సరదాలకు, సంతోషాలకి ఓడిపోయిన వారికీ ఇలాంటి బోర్డు తగిలించి న్యూ ఛాలెంజ్ అని ఒక సామజిక దురాచారాలకు తెర లేపుతున్నారని ఆమె అన్నారు. ఇపుడు మీకోసం ఒక వీరేశలింగం గారు, ఒక రామ్మోహన రాయ్ గారు రాలేరు, దయచేసి ఆపేయండి, ఇప్పటికే సామాజిక అసమానతల వలెనే ప్రజలు కొట్టుకుంటున్నారనీ ఆమె అన్నారు. పిల్లలు ,పెద్దలు ,సైకో మనసు ఉన్నవారికి ఇలాంటివి బాగా నచ్చి చేయడం మొదలు పెడతారని హెచ్చరించిన ఆమె చదువుకుని జ్ఞానం ఉన్న మనుషులుగా సమాజంలో ఉంటూ పూర్వ కాలం నాటు పనికిమాలిన చర్యలని చూపిస్తూ మురిసిపోతున్న టీం - హోస్ట్ బాధ్యత విస్మరించారని అన్నారు.

    Recommended Video

    Tollywood Top 10 Heroines List || Filmibeat Telugu
    న్యాయస్థానం ద్వారా

    న్యాయస్థానం ద్వారా

    చీ, అనాలనిపిస్తుంది మీ సంస్కారానికి, కానీ నాకు సంస్కారం ఉంది కనుక అననన్నారు. ఇది ఇలాగె కొనసాగుతే న్యాయస్థానం ద్వారా మీ చర్యలకి అడ్డు కట్ట వేయించేలా చేస్తాననీ ఆమె హెచ్చరించారు. రోజు సమాజంలో ఇప్పటికి జతుగున్న ఎన్నో చర్యలు చూసి బాధగా ఉంటుంది కానీ చదువుకుని జ్ఞానం ఉన్న మీరు టీవీ షో ద్వారా ఇలా చేయడం బాధగా ఉందనీ ఆమె అన్నారు. తప్పయింది అంటే శత్రువుని సైతం క్షమించే నేల మనది. సరదాకి టీవీ పెడితే సైకిక్ నేచర్ ని సమర్థిస్తున్నారు చాల తప్పు ఇది అంటూ ఆమె సుదీర్ఘ పోస్ట్ పెట్టారు.

    English summary
    actress Madhavi Latha sensational post on Bigg Boss Telugu 5.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X