షో నుంచి నన్ను బలవంతంగా బయటకు పంపారు: బిగ్ బాస్ కంటెస్టెంట్ షాకింగ్ కామెంట్స్

ఉత్తరాదిలో బాగా ఫేమస్ అయింది టాప్ రియాలిటీ షో 'బిగ్ బాస్'. 2006లో హిందీలో ప్రారంభమైన ఈ రియాలిటీ షో గత 12 సీజన్లుగా టాప్ రియాలిటీ షోగా వర్ధిల్లుతోంది. దక్షిణాదిలో కూడా సత్తా చాటుతోంది. ఇప్పటికే తెలుగు, తమిళం, కన్నడం, మలయాళంలో ఈ షో ప్రసారం అవుతోంది. దక్షిణాది భాషల్లో తమిళంలో కాంట్రవర్సీలు అయినంతగా దేశంలో ఎక్కడా జరగవు. అందుకే తమిళ బిగ్ బాస్‌కు ఎంతో రేటింగ్ వస్తోంది. ఇప్పటికే ఎన్నో ఘటనలు జరిగిన ఈ షోలో.. తాజాగా మరో వివాదం చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే...

వివాదాలతో సతమతం

వివాదాలతో సతమతం

తమిళ బిగ్ బాస్ షో మొదటి నుంచీ వివాదాలతో సతమతం అవుతోంది. బిగ్ బాస్ మొదటి సీజన్‌లో కంటెస్టెంట్‌గా పాల్గొన్న ఓవియా అనే వర్ధమాన నటి ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం కలకలం రేపింది. ఆ తర్వాత హైదరాబాద్‌లో నమోదైన ఓ కేసు నిమిత్తం బిగ్ బాస్ హౌస్‌లో కంటెస్టెంట్‌గా ఉన్న సినీ నటి వనితా విజయకుమార్‌ను విచారించడానికి హైదరాబాద్ పోలీసులు అక్కడికి చేరుకోవడం కలకలం రేపింది. ఇటీవల ఓ నటుడు మహిళలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం వంటి వాటితో షోపై వ్యతిరేకత వ్యక్తమైంది.

నటి ఆత్మహత్యాయత్నంతో మరో లెవెల్

నటి ఆత్మహత్యాయత్నంతో మరో లెవెల్

‘ఒరుకల్‌ ఒరు కన్నాడీ' చిత్రంలో హాస్య పాత్రలో నటించిన మధుమిత కొద్దిరోజుల క్రితం చాకుతో మణికట్టును కోసుకుంది. దీంతో ఆమెకు వైద్యం అందించిన అనంతరం షో నుంచి బయటకు పంపించేశారు. హౌస్‌లో కవిన్ అలానే మిగిలిన కొందరి మధ్య జరిగిన వాదనల కారణంగా గొడవ జరగడంతో ఆమె ఈ నిర్ణయం తీసుకుందని తెలిసింది. మధుమిత యాభై రోజులు పైగా హౌస్‌లో ఉంది. గత వారం కెప్టెన్సీ బాధ్యతలు కూడా నిర్వర్తించింది. ఈమె చేసిన పని దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అవడంతో పాటు షో మరో లెవెల్‌కు వెళ్లింది.

నటిపై కేసు నమోదు

నటిపై కేసు నమోదు

ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన మధుమితను విజయ్ టీవీలోని బిగ్ బాస్ నిర్వహకులు బయటకు పంపివేశారు. షోకు చెడ్డ పేరు తీసుకు వచ్చిందనే కారణంతోనే వాళ్లు ఈ నిర్ణయం తీసుకున్నారని చెబుతున్నారు. ఇక, తాజాగా సదరు నటిపై షో నిర్వహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రెమ్యూనరేషన్ ఇచ్చినప్పటికీ మరింత ఇవ్వాలని డిమాండ్ చేస్తుందని, ఆమెపై చర్యలు తీసుకోవాలని వాళ్లు కేసు పెట్టారు. దీంతో ఈ వివాదం సరికొత్త మలుపు తిరిగింది.

సంచలన ఆరోపణలు

సంచలన ఆరోపణలు

తాజాగా తన ఆత్మహత్యాయత్నంపై మధుమిత సంచలన వ్యాఖ్యలు చేసింది. ‘నాతో తోటి హౌస్‌మేట్స్ దారుణంగా ప్రవర్తించేవారు. అంతా ఒక్కటిగా ఉండి నన్ను మాత్రం వేరుగా చూసేవారు. తరచూ నాపై గొడవ పడేవారు. వాళ్లంతా ప్లాన్ చేసి నన్ను బయటకు పంపేశారు. ఆ తర్వాత కమల్ సార్ కూడా వాళ్లను ఏమీ అనలేదు. ఛానెల్ వాళ్లు కూడా నన్ను మోసం చేశారు' అని ఆమె ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X