షాకింగ్: బిగ్ బాస్ హౌస్‌లో గొడవ.. ప్రముఖ నటి ఆత్మహత్యాయత్నం.. ఇండస్ట్రీలో ప్రకంపనలు

Recommended Video

బిగ్ బాస్ హౌస్‌లో గొడవ.. ప్రముఖ నటి ఆత్మహత్యాయత్నం

ఉత్తరాదిలో బాగా ఫేమస్ అయింది టాప్ రియాలిటీ షో 'బిగ్ బాస్'. 2006లో హిందీలో ప్రారంభమైన ఈ రియాలిటీ షో గత 12 సీజన్లుగా టాప్ రియాలిటీ షోగా వర్ధిల్లుతోంది. దక్షిణాదిలో కూడా సత్తా చాటుతోంది. ఇప్పటికే తెలుగు, తమిళం, కన్నడం, మలయాళంలో ఈ షో ప్రసారం అవుతోంది. దక్షిణాది భాషల్లో తమిళంలో కాంట్రవర్సీలు అయినంతగా దేశంలో ఎక్కడా జరగవు. అందుకే తమిళ బిగ్ బాస్‌కు ఎంతో రేటింగ్ వస్తోంది. ఇప్పటికే ఎన్నో ఘటనలు జరిగిన ఈ షోలో.. తాజాగా ఓ షాకింగ్ ఇన్సిడెంట్ చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే...

 తమిళంలో కొంత ప్రత్యేకం

తమిళంలో కొంత ప్రత్యేకం

బిగ్ బాస్ షోను అన్ని భాషల్లో లాగ తమిళనాడు ప్రజలు స్వాగతించలేదు. దీంతో ఈ షో ప్రారంభంపై అప్పట్లో నీలి నీడలు అలముకున్నాయి. దీనికితోడు కమల్ హాసన్ హోస్ట్ చేస్తారని తెలియడంతో చాలా మంది దీన్ని వ్యతిరేకించారు. అయినా, బిగ్ బాస్ మాత్రం అట్టహాసంగా ప్రారంభమైంది. ఆ తర్వాత విజయవంతంగా రెండు సీజన్లను కూడా పూర్తి చేసుకుంది. ఇప్పుడు మూడో సీజన్‌ కూడా ప్రారంభమైంది.

 ఓవియా ఘటనతో హైలైట్

ఓవియా ఘటనతో హైలైట్

బిగ్ బాస్ మొదటి సీజన్‌లో కంటెస్టెంట్‌గా పాల్గొన్న ఓవియా అనే వర్ధమాన నటి ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం కలకలం రేపింది. మానసిక ఒత్తిడి వల్లే ఆమె ఈ పని చేసిందని కొందరు.. హౌస్‌లో ప్రేమ విఫలమై చేసిందని మరికొందరు చెప్పారు. దీంతో ఈ ఘటన ప్రకంపనలు రేపింది. దీని తర్వాత షోపై భారీ స్థాయిలో వ్యతిరేకత వచ్చిన విషయం తెలిసిందే.

మూడో సీజన్ మరీ దారుణం

మూడో సీజన్ మరీ దారుణం

ఇక, గత నెలలో ప్రారంభమైన మూడో సీజన్ ఆది నుంచీ వివాదాలతోనే నడుస్తోంది. మొదటిరోజు ఎపిసోడ్‌లోనే హౌస్‌లోని కంటెస్టెంట్లు గొడవకు దిగడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఎక్కడా లేని విధంగా ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. దీంతో షోపై మొదటి నుంచే హైప్ క్రియేట్ అయిపోయింది. దీంతో ఈ షో ట్రెండ్ అవుతోంది.

హౌస్‌లోకి తెలంగాణ పోలీసులు

హౌస్‌లోకి తెలంగాణ పోలీసులు

హైదరాబాద్‌లో నమోదైన ఓ కేసు నిమిత్తం బిగ్ బాస్ హౌస్‌లో కంటెస్టెంట్‌గా ఉన్న సినీ నటి వనితా విజయకుమార్‌ను విచారించడానికి హైదరాబాద్ పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అప్పుడు ఇది బాగా హైలైట్ అయింది. ఆ విచారణ తర్వాత పోలీసులు ఆమెను అరెస్ట్ చేస్తారనుకున్నా.. అలా జరగలేదు. కానీ, కొద్దిరోజుల తర్వాత ఆమె హౌస్ నుంచి ఊహించని విధంగా ఎలిమినేట్ అయిపోయారు.

అమ్మాయిలపై అనుచిత వ్యాఖ్యలు

షోలోని ఓ స్కిట్‌లో భాగంగా కంటెస్టెంట్‌గా ఉన్న శరవణన్ అమ్మాయిలపై అనుచిత వ్యాఖ్యలు చేశాడు. మహిళలను, అమ్మాయిలను తాకవచ్చనే ఉద్దేశంతో తాము బస్సులు ఎక్కేవారమని ఆయన తెలిపాడు. ఆయన వ్యాఖ్యలకు షోలో ఉన్న ఇతర పార్టిసిపెంట్లు చప్పట్లు కొట్టి, ఆనందం వ్యక్తం చేశారు. దీనిపై భారీ స్థాయిలో వ్యతిరేకత వచ్చింది. సింగర్ చిన్మయి కూడా దీనిని వ్యతిరేకించింది. ఆ తర్వాత సదరు వ్యక్తి క్షమాపణ చెప్పడంతో దీనికి తెరపడింది.

నటి ఆత్మహత్యాయత్నం

నటి ఆత్మహత్యాయత్నం

ఇన్ని గొడవలు జరిగిన నేపథ్యంలో చర్చనీయాంశం అవుతున్న షోలో తాజాగా ఓ నటి ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం కలకలం రేపింది. ‘ఒరుకల్‌ ఒరు కన్నాడీ' చిత్రంలో హాస్య పాత్రలో నటించిన మధుమిత శనివారం చాకుతో మణికట్టును కోసుకుంది. దీంతో ఆమెకు వైద్యం అందించిన అనంతరం షో నుంచి బయటకు పంపించేశారు. హౌస్‌లో కవిన్ అలానే మిగిలిన కొందరి మధ్య జరిగిన వాదనల కారణంగా గొడవ జరగడంతో ఆమె ఈ నిర్ణయం తీసుకుందని తెలిసింది. మధుమిత యాభై రోజులు పైగా హౌస్‌లో ఉంది. గత వారం కెప్టెన్సీ బాధ్యతలు కూడా నిర్వర్తించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X