నేను ఒళ్లు అమ్ముకోలేదు, ఒళ్లు చూపించుకుని బతికా.. సీనియర్ నటి షాక్!

నంది అవార్డు తీసుకున్న సీరియల్ నటి మల్లి జాగుల గురించి తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మల్లిక అనడం కంటే కూడా.. కలవారి కోడలు సీరియల్ చెంచు లక్ష్మీ అంటే మరింత సులువుగా గుర్తు పట్టేస్తారు ఈమెను. చాలా ఏళ్లుగా సీరియల్స్ చేస్తూ తన టాలెంట్ ప్రూవ్ చేసుకుంటున్న ఈమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని షాకింగ్ కామెంట్లు చేసింది. ముఖ్యంగా తాను ఒళ్లు అమ్ముకొని బతకలేదని.. ఒళ్లు చూపించుకుని బతికానంటూ వివరించింది. ఆ విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

ఎన్నో సినిమాలు, సీరియల్స్ చేసినా రాని గుర్తింపు... కలవారి కోడలుతో వచ్చింది మల్లికా జాగులకు. అయితే ఈ సీరియల్ లో చెంచు లక్ష్మీగా చేసినందుకే ఈమెకు నంది అవార్డు కూడా వచ్చింది. ఇలా తన అందం, అభినయంతో అందరినీ మెప్పించిన ఈమె అనేక సీరియల్స్ చేసింది. పడమటి సంధ్యారాగం, బొమ్మరిల్లు, అభిషేకం.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. ఇన్నీ సీరియల్స్ చేసిన ఈమె కూడా ఇండస్ట్రీలో అనేక సమస్యలు ఎదర్కున్నట్లు తొలిసారి తలిపింది.

Actress malika Jagula Shocking Comments About Her Career Check Details

ముఖ్యంగా తెలుగు సినీ రంగంలో తెలుగు వాళ్లకు ఎక్కువగా అవకాశాలు ఇవ్వరు అని.. బెంగళూరు వాళ్లకే ఎక్కువ ఛాన్సులు ఇస్తుంటారని చెప్పుకొచ్చారు. నటనే జీవితంగా బితికే తనకు అవకాశాలు రాక చాలా కాలం పాటు ఏం చేయాలో తెలియక అనేక ఇబ్బందులు పడినట్లు తెలిపింది. వయసులో చాలా పెద్దవాడైన తన తండ్రి మీద ఆధారపడి జీవించాల్సిన పరిస్థితి రాగా.. కరోనా తర్వాత చీరలు అమ్ముకుని జీవనం కొనసాగించినట్లు చెప్పింది. పెట్రోల్ బంకుల్లో పని చేస్తానని వెళ్తే.. వాళ్లు అన్న మాటలు తనను ఎంతగానో బాధించాయని వివరించింది.

తాను పెద్దగా చదువుకోలేదని.. నటనతో తప్ప తనకు మరొకటి తెలియదని మల్లిక వెల్లడించింది. అయితే చాలామంది వీళ్లకేంటి.. సీరియల్స్ లో నటిస్తారు, బాగా సంపాదిస్తారు.. వాళ్లతో వీళ్లతో తిరగేస్తుంటారని చాలా మంది అనుకుంటున్నారని.. మొహం మీదే మీకు అనేక సంబంధాలు ఉన్నాయంటూ చెప్పిన వాళ్లను కూడా చూసినట్లు వివరించింది. తాను ఒళ్లు అముకుని బతకట్లేదని.. కేవలం ఒళ్లు చూపించుకుని మాత్రమే బతుకుతున్నానని మరోసారి క్లారిటీ ఇచ్చింది.

ఎన్నో కష్టాలు పడినా.. ప్రస్తుతం తన జీవితం సాఫీగానే సాగుతుందని.. నా అనుకున్న వాళ్లకు నాలుగు మెతుకులు పెట్టగల్గుతున్నానని స్పష్టం చేసింది. అలాగే తెలుగు దర్శక, నిర్మాతలకు తెలుగు వాళ్లకు సినిమా అవకాశాలు ఇస్తే బాగుంటుందని.. కళామతల్లినే నమ్ముకుని బతికే వాళ్లకు కాస్త పనిచ్చి ఆదుకోవాలంటూ కూడా తెలిపింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X