ఆ టైంలో పాలు తాగడం మా ఇంటా ఒంటా లేదు.. మంచు లక్ష్మీ ఝలక్

మంచు ఫ్యామిలీ ఏ విషయంలోనైనా ముక్కుసూటిగా మాట్లాడటం అందరికీ తెలిసిందే. సమయం, సందర్భం అనేది పట్టించుకోకుండా మనసుకు తోచి మాట్లాడటం మంచు వారి లక్షణం. ఈ తీరు కొన్నిసార్లు వారిని ఓ మెట్టు ఎక్కించాయి.. మరొకొన్ని సార్లు ఇబ్బందికి గురిచేశాయి. అయినా వారు తమ లక్షణాన్ని కొనసాగిస్తూనే ఉంటారు. తాజాగా జరిగిన స్టార్ మా పరివార్ అవార్డుల ఫంక్షన్‌లో మంచు లక్షి చేసిన హంగామా మాత్రం అందర్నీ ఆకట్టుకొన్నది. అవార్డు అందజేత సందర్బంగా మంచు లక్ష్మీ సరదాగా ఏం మాట్లాడిదంటే..

బుల్లితెర అంటే అందరికీ..

బుల్లితెర అంటే అందరికీ..

బుల్లితెర అంటే కొంత మందికి చిన్నచూపుగా చూస్తారు. టెలివిజన్ నుంచి అత్యంత ప్రజాదరణ పొందిన వ్యక్తులు చాలానే ఉన్నారు. నన్ను ప్రస్తుతం ఈ వేదిక మీద నిలచోవడానికి కారణం బుల్లితెరనే. నా కెరీర్‌ను టీవీ నుంచే ప్రారంభించాను. ఆ తర్వాత సినిమాల్లోకి వెళ్లాను అని మంచు లక్ష్మీ చెప్పారు.

తెలుగు వినోద రంగంలో

తెలుగు వినోద రంగంలో

తెలుగు వినోద రంగంలో టెలివిజన్‌ది పెద్ద పీట. ఈ పరిశ్రమ ఎంతో మందికి చోటు కల్పిస్తున్నది. అంతేకాకుండా ఇక్కడికి వచ్చిన ప్రతీ ఒక్కరికి భారీగా ప్రేక్షకాదరణ ఉంది. ఈ సందర్భంగా స్టార్ మా కుటుంబానికి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను అని మంచు లక్ష్మీ తెలిపారు. అంతేకాకుండా మరింత ఎత్తుకు ఎదగాలని ఆమె ఆకాంక్షించారు.

అత్తగా నటించిన మంచు లక్ష్మీ

అత్తగా నటించిన మంచు లక్ష్మీ

ఇక అవార్డుల కార్యక్రమంలో సుమ, మంచు లక్ష్మీ సంభాషణ ఆసక్తిని రేపింది. ఈ సందర్బంగా మంచు లక్ష్మీని వేదికపై అత్తగా నటిస్తారా? కోడలుగా నటిస్తారా అని అడిగితే.. అత్తగా నటిస్తానని చెప్పింది. అత్తా కోడళ్ల సంభాషణను మొదలుపెడుతూ.. మరో నటిని ఏమే కోడలా.. ఎం చేస్తున్నావు. నాకు కాఫీ తీసుకురా అంటే.. ఇప్పుడు కాఫీ తాగడం సరికాదు అంటూ జవాబుస్తొంది. నాకు జవాబిస్తావా.. నేను చెప్పింది చేస్తావా లేదా అంటూ కోపాన్ని ప్రదర్శిస్తుంది.

రాత్రి వేళ పాలు తాగడమా?

రాత్రి వేళ పాలు తాగడమా?

ఇలా సంభాషణ సాగుతుండగా.. కోడలు పాత్రధారి ఈ సమయంలో కాఫీ తాగడం సరికాదు.. కావాలంటే.. పాలు ఇస్తాను. అవీ తాగండి అంటుంది. దాంతో మంచు లక్ష్మీ స్వరం పెంచి.. రాత్రి వేళలో పాలు తాగడం మా ఇంటా ఒంటా లేదు అంటూ ఝలక్ ఇవ్వడంతో వేదిక ప్రాంగణంలో ఆసీనులైన ప్రతీ ఒక్కరు నవ్వుల్లో మునిగిపోయారు. ఈ సందర్భంగా సుమ, స్టార్ మా కుటుంబానికి థ్యాంక్స్ చెప్పి తనదైన శైలిలో స్పందించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X