నా కూతురిని చంపేస్తా అన్నాడు, బిగ్ బాస్ 3 నుంచి బయటకు లాగే కుట్ర!
కమల్ హాసన్ హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ తమిళ్ 3వ సీజన్ గత ఆదివారం మొదలైన సంగతి తెలిసిందే. షో ప్రారంభం రోజు మొత్తం 15 మంది కంటెస్టెంట్లు ఎంట్రీ ఇచ్చారు. అయితే షో మొదలైన రెండు రోజుల తర్వాత 16వ కంటెస్టెంటుగా నటి మీరా మిథున్ ఎంటరయ్యారు.
ఈ షోలో ఆమె ఎంటరైనప్పటి నుంచి వనితా, అభిరామి, మరికొందరు లేడీ కంటెస్టెంట్స్ ఆమెను ఏదో ఒక రకంగా ఇబ్బంది పెడుతూ బాధకు గురయ్యేలా చేస్తున్నారు. ఈ క్రమంలో రోజులో ఒక్కరైనా తమిళ బిగ్ బాస్ హౌస్‌లో మీరా కంటతడి పెట్టుకుంటోంది.

నా కూతురును చంపుతామని బెదిరించాడు
బిగ్ బాస్ ఇంట్లో మీరా పరిస్థితి అలా ఉంటే... ఆమె తల్లి సంచలన విషయం బయట పెట్టారు. కొన్నిరోజులుగా మీరాను చంపుతామని బెదిరింపులు వస్తున్నాయని తెలిపారు. కేరళకు చెందిన వ్యక్తి తన కూతురు అంతం చూస్తానని బెదిరింపులకు పాల్పడ్డట్లు వెల్లడించారు.

కావాలనే కుట్ర చేస్తున్నాడు
సదరు వ్యక్తి ఇపుడు సోషల్ మీడియాలో మీరా మీద తప్పుడు ప్రచారం చేస్తున్నాడని, తన కూతురు పేరు చెడగొట్టడానికి ఆమె గురించి నెగెటివ్ పోస్టులు పెడుతున్నాడని, మీరాను బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు రప్పించడమే అతడి లక్ష్యమని ఆమె తల్లి చెప్పుకొచ్చారు.

లీగల్ యాక్షన్ తీసుకుంటాను
తన కూతురును చంపుతామని బెదిరించడంతో పాటు ఇపుడు ఆమె పేరు చెడగొట్టే విధంగా, బిగ్ బాస్ షో ప్రేక్షకుల మదిలో ఆమెపై తప్పుడు అభిప్రాయం ఏర్పడేలా చేస్తున్న సదరు వ్యక్తిపై లీగల్ యాక్షన్ తీసుకోబోతున్నట్లు వెల్లడించారు. ఈ వివాదం ఇపుడు తమిళ మీడియాలో హాట్ టాపిక్ అయింది.

మీరా మిథున్
మీరా మిథున్ గురించిన వివరాల్లోకి వెళితే... 2016లో మిస్ ఇండియా సౌత్ కిరీటం దక్కించుకుంది. అయితే మీరా మిస్ ఇండియా సౌత్ టైటిల్ దుర్వినియగం చేసిందనే నెపంత నిర్వాహకులు దాన్ని వెనక్కి తీసుకున్నారు. 2017లో ‘8 తొట్టక్కాయ్' సినిమా ద్వారా నటిగా కెరీర్ ప్రారంభించిన మీరా ‘బిగ్ బాస్ తమిళం 3' ద్వారా మరింత పాపులారిటీ పెంచుకోవడానికి ప్రయత్నిస్తోంది.


Click it and Unblock the Notifications











