బ్రెయిన్ లో 8 వైర్లు.. చావుదాకా వెళ్లిన ముమైత్ ఖాన్.. ఏం జరిగిందంటే?
టెలివిజన్ ప్రేక్షకులకు అలరించేందుకు ఓవైపు అద్భుతమైన టీవీ షోలు రన్ అవుతూనే ఉన్నాయి. మరోవైపు టాక్ షోలు కూడా మంచి అదరణను పొందుతున్నాయి. సెలబ్రెటీల జీవిత కథలను వారి నోటనే తెలియజేసే ఈ టాక్ షోలకు బుల్లితెర ఆడియెన్స్ ఆకర్షితులవుతున్నారు. అయితే ప్రస్తుతం 'ఆహా' ప్లాట్ ఫామ్ లో 'కాకమ్మ కథలు' అనే టాక్ షో 2వ సీజన్ సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. తేజస్వి మదివాడ హోస్ట్ గా వ్యవహిరిస్తోంది. రీసెంట్ గా ప్రారంభమైన ఈ టాక్ షో రెండవ సీజన్ కు సంబంధించిన లెటస్ట్ ఎపిసోడ్ ప్రోమో విడుదలైంది. ఈ ఎపిసోడ్ కు స్టార్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ తో కలిసి, నటి, డ్యాన్సర్, మోడల్ ముమైత్ ఖాన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ముమైత్ ఖాన్ కు సంబంధించిన అనారోగ్య సమస్యలను తేజస్వి బయట పెట్టింది.
ముమైత్ ఖాన్ సినీ ప్రస్థానం..
ఇండియన్ యాక్ట్రెస్, మోడల్ గా ముమైత్ ఖాన్ తన సినీ కెరీయర్ ను ప్రారంభించింది. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ భాషల్లోని ఎన్నో చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్ లో నటించి మెప్పించింది. నటిగా పలు చిత్రాలతో మెప్పించినా.. ఆమెకు మాత్రం ఐటెమ్ సాంగ్స్ తోనే మంచి గుర్తింపు దక్కింది. నటిగా, డ్యాన్సర్ గా ఓవైపు ప్రేక్షకులను మెప్పిస్తూనే మరోవైపు 'జలక్ దిక్లా జా 6', 'బిగ్ బాస్ తెలుగు సీజన్ 1' వంటి తెలుగు రియాలిటీ షోల్లోనూ మెరిసి బుల్లితెర ఆడియెన్స్ కు బాగా దగ్గరైంది. ఇప్పటి వరకు 100 కు పైగా సినిమాల్లో నటించి మెప్పించింది ముమైత్ ఖాన్.

ముమైత్ కు పేరు తెచ్చిన సినిమాలు, స్పెషల్ సాంగ్స్..
ముమైత్ ఖాన్ తొలుత తమిళ చిత్రాల్లో సినిమా అవకాశాలను అందుకుంది. తను ప్రస్తుతం ముంబైలో ఉంటున్నా.. తన తల్లి తమిళ నాడుకు చెందిన కావడంతో అక్కడే ఉంటూ సినిమా అవకాశాల కోసం ప్రయత్నాలు చేసింది. మొదటగా 'మజును' అనే తమిళ చిత్రంలో స్పెషల్ సాంగ్ లో మెరిసింది. ఆ తర్వాత హిందీలో 'హే క్యా హో రాహ హై' చిత్రంలో ఐటెం సాంగ్ తో మెప్పించింది. ఇక తెలుగు స్వామి, 143 వంటి చిత్రాల్లో ఐటెమ్ సాంగ్స్ చేసింది. ఆ తర్వాత ఛత్రపతి, పోకిరి, యోగి, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, వీడు మాములోడు కాదు, ఆటాడిస్తా, బుజ్జిగాడు, నేనింతే, మగధీర, గుండెల్లో గోదారి, డిక్టేటర్ వంటి చిత్రాల్లో ఐటెమ్ సాంగ్స్ లో నటించి స్పెషల్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకుంది. మైసమ్మ ఐపీఎస్, ఆపరేషన్ దుర్యోదన, సామాన్యుడు వంటి చిత్రాల్లో నటిగా కూడా మెప్పించింది.
ముమైత్ ఖాన్ బ్రెయిన్ లో 8 వైర్లు.. ఆమెకు ఏమైందీ?
ఆహాలో ప్రసారం అవుతున్న 'కాకమ్మ కథలు సీజన్ 2'షోలో ముమైత్ ఖాన్ తన ఆరోగ్య సమస్యలపై స్పందించింది. యాంకర్ తేజస్వి మదివాడ ముమైత్ ఖాన్ మెదడుకు సంబంధించిన సమస్యలతో బాధపడుతుందని చెప్పుకొచ్చింది. ముమైత్ ఖాన్ మెదడులో 7 నుంచి 8 వైర్లు కూడా ఉన్నాయని, షూ లేస్ కూడా వంగి కట్టుకోవడం తన ప్రాణాలకు ప్రమాదమేనని వైద్యులు హెచ్చరించినట్టు చెప్పుకొచ్చింది. ఆ వెంటనే ముమైత్ ఖాన్ కూడా స్పందించింది. ఒకసారి షూటింగ్ వెళ్లినప్పుడు యాక్షన్ సీన్ లో పాల్గొన్నాను. షూట్ తర్వాత ఇంటికి వెళ్లేప్పుడు అస్సలు ఓపికా లేదు. వెంటనే నిర్మాత స్వప్న దత్ కు ఇలా చెప్పాను. నేను ఉదయం లేస్తే బతికి ఉన్నట్టు.. లేదంటే ఇక చనిపోయానని ఫిక్స్ అవ్వడాని నా హెల్త్ కండీషన్ చెప్పి వెళ్లిపోయాను.. అని చెప్పుకొచ్చింది.
చావు అంచుల వరకు వెళ్లిన ముమైత్ ఖాన్..
ముమైత్ ఖాన్ నరాలకు సంబంధించిన వ్యాధితో కొంత కాలంగా బాధపడుతోంది. దాని కారణంగానే 2 ఏళ్లుగా మందులు కూడా వాడుతోంది. ఆకారణంతోనే క్రమకమంగా బరువు పెరుగుతూ వచ్చింది. ఇక డాక్టర్లు జిమ్ కు ఆమెను దూరంగా ఉండాలని చెప్పారు. అంతే కాకుండా బరువులు కూడా ఎత్తకూడదని చ చెప్పుకొచ్చారు. కానీ గతంలో షూట్స్ కు వెళ్లడం వల్ల చావు అంచుల వరకు వెళ్లి వచ్చిందని తాజాగా వెల్లడించారు. ఈ క్రమంలోనే బ్రెయిన్ పై ప్రభావం పడిందని తెలుస్తోంది. ఇక ప్రస్తుతం డాక్టర్ల సలహాలు, సూచనలు, బెస్ట్ ట్రీట్ మెంట్ తో ముమైత్ ఖాన్ హెల్త్ కండీషన్ నిలకడగానే ఉంది.


Click it and Unblock the Notifications











