సెట్లో‌ అమ్మాయిలకి నో సేఫ్టీ .. క్యాస్టింగ్ కౌచ్‌పై ఎన్టీఆర్ హీరోయిన్ కామెంట్స్ , ఆ కమిటీ చాలదంటూ

మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న పరిస్ధితులపై కేరళ ప్రభుత్వం నియమించిన జస్టిస్ హేమ కమిటీ సంచలన విషయాలను బహిర్గతం చేసిన సంగతి తెలిసిందే. కేరళ చిత్ర పరిశ్రమలో మాత్రం పరిస్థితులు దారుణంగా ఉన్నాయని హేమ కమిటీ పేర్కొంది. మలయాళ ఇండస్ట్రీ ఓ మాఫియా కనుసన్నల్లో నడుస్తోందని.. మహిళలు తమపై జరిగే లైంగిక దాడులపై నోరు విప్పలేకపోతున్నారని కమిటీ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ నివేదిక తర్వాత నటీమణులు ఒక్కొక్కరిగా మీడియా ముందుకు వచ్చి తాము ఎదుర్కొన్న ఇబ్బందులను తెలియజేస్తున్నారు. తాజాగా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు హీరోయిన్ నివేదా థామస్ .

హేమ కమిటీ రిపోర్ట్ తర్వాత మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ ఇండస్ట్రీలకు చెందిన పలువురు హీరోయిన్లు స్పందిస్తున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలోనూ ఈ తరహా కమీషన్ వేయాలంటూ స్టార్ హీరోయిన్ సమంత డిమాండ్ చేయడం కలకలం రేపింది. టాలీవుడ్‌లోనూ ది వాయిస్ ఆఫ్ వుమెన్ ఏర్పాటైందని.. ఈ సబ్ కమిటీ నివేదికను బహిర్గతం చేయాలని సామ్ తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం స్పందించాల్సి ఉంది.

Actress Nivetha Thomas made shocking comments on Casting Couch In film Industry here s the details

ఇదిలాఉండగా.. నివేదా థామస్ తెలుగులో నటించిన లేటెస్ట్ మూవీ 35 చిన్న కథ కాదు. నంద కిశోర్ దర్శకత్వంలో రానా, సృజన్ యరబోలు, సిద్ధార్ధ్ రాళ్లపల్లి సంయుక్తంగా ఈ మూవీని నిర్మించారు. ప్రియదర్శి, నివేదా థామస్, విశ్వదేవ్, గౌతమి, భాగ్యరాజ్‌లు కీలకపాత్రలు పోషించారు. ఈ సినిమాలో నివేదా థామస్ ఇద్దరు పిల్లల తల్లిగా నటించారు. అంతేకాదు .. హోమ్ మేకర్ లుక్ కోసం విపరీతంగా బరువు పెరిగి కలకలం రేపారు. ఇది వృత్తిపట్ల ఆమె అంకిత భావానికి , క్రమశిక్షణకు నిదర్శనం.

సెప్టెంబర్ 6న రిలీజైన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలందుకుంది. కంటెంట్ బాగుంటే చిన్న సినిమాను కూడా ప్రేక్షకులు ఆదరిస్తారని మరోసారి రుజువైంది. లెక్కల్లో వీక్ అయిన కొడుకుని టెన్త్ ఫెయిలైన ఓ తల్లి ఎలా గాడిలో పెట్టిందనేది ఈ చిత్ర కథ. డబుల్ మీనింగ్ డైలాగ్స్, ఇంగ్లీష్ - తెలుగు మిక్స్ చేసి వస్తున్న సంభాషణల మధ్య చాలా రోజుల తర్వాత అచ్చ తెలుగు పదాలు స్క్రీన్‌పై సందడి చేశాయి. తెరపై చూస్తున్నంత సేపు సరస్వతి అనే ఇల్లాలే కనిపిస్తుంది తప్పించి నివేదా థామస్ కనిపించదంటే ఆమె ఎలా నటించారో అర్ధం చేసుకోవచ్చు.

35 చిన్న కథ కాదు మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా నివేదా మీడియాతో ముచ్చటిస్తూ క్యాస్టింగ్ కౌచ్‌పై స్పందించారు. మలయాళ చిత్ర పరిశ్రమలో ఇలాంటి పరిణామాలు బాధాకరమన్నారు. హేమ కమిటీ రిపోర్ట్‌ను తాను పూర్తిగా చదవలేదని, తమకు జరిగిన అన్యాయాలపై మహిళా నటులు ధైర్యంగా ముందుకొస్తున్నారని నివేద ప్రశంసించారు. ఇది చాలా సున్నితమైన అంశమని.. ఇలాంటి కమీషన్‌లు అన్ని చోట్లా రావాలని ఆమె ఆకాంక్షించారు. వర్క్ ప్లేస్ అనేది రెండో ఇల్లు లాంటిదని.. అది మహిళలకు సురక్షితంగా ఉండాలని నివేదా థామస్ కోరారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X