Don't Miss!
- News
రంగంలోకి ప్రధాని మోదీ - షా : తెలంగాణలో త్రిముఖ వ్యూహం..!!
- Finance
fpi: ఇండియన్ మార్కెట్ల నుంచి FPIల నిష్క్రమణ.. ఒక్క నెలలోనే అన్ని కోట్లా ??
- Lifestyle
శృంగార కోరికలు తగ్గడానికి ఈ 3 హార్మోన్లే కారణం... దీన్ని వెంటనే పరిష్కరించండి...!
- Sports
పని పాట లేని వెదవలు క్రియేట్ చేసే స్టోరీలు.. బాబర్ నాకు కొడుకుతో సమానం: వసీం అక్రమ్
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
- Technology
ధర రూ.15000 ల లోపు మార్కెట్లో ఉన్న బెస్ట్ 5G ఫోన్లు! లిస్ట్ ,ధర వివరాలు!
- Automobiles
దేశీయ విఫణిలో విడుదలైన కొత్త BMW X1: ధర రూ. 45.90 లక్షలు
ఢీ లైవ్ లో ప్రపోజల్.. ప్రియమణి సహా అందరూ షాక్.. గుక్క పెట్టి ఏడ్చేసిన పూర్ణ!
తెలుగులో రియాలిటీ షోస్ కి ఇప్పుడు మంచి రేటింగ్స్ వస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఈటీవీలో ప్రసారమవుతున్న డ్యాన్స్ కు సంబంధించిన రియాలిటీ షో ఢీ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇప్పటికే ఈ ఢీ షో చాలా సీజన్లు పూర్తిచేసుకుని ప్రస్తుతం 13వ సీజన్ విజయవంతంగా జరుపుకుంటోంది. ఈ షోకి జడ్జీలుగా ప్రియమణి, పూర్ణ, గణేష్ మాస్టర్ వ్యవహరిస్తున్నారు. అయితే తాజాగా విడుదలైన ఒక ప్రోమోలో మాత్రం ఒక జంట లైవ్ లోనే ఐ లవ్ యు చెప్పుకోగా పూర్ణ మాత్రం ఎమోషనల్ అయినట్లు చూపించారు. దానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే
టాప్ తీసేసి షాకిచ్చిన పూనమ్ బజ్వా: అందాల ఆరబోతలో గేట్లు ఎత్తేస్తూ.. ఓ రేంజ్లో చూపించిన హీరోయిన్

సూపర్ రెస్పాన్స్
ఈటీవీ లో ప్రసారమయ్యే ఢీ షో గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు మల్లెమాల ప్రొడక్షన్ ఆధ్వర్యంలో నడిచే ఈ షో సౌతిండియాలోని బిగ్గెస్ట్ డాన్స్ షో గా చెబుతూ ఉంటారు. ఇప్పటికే దాదాపు 12 సీజన్లను పూర్తి చేసుకున్న ఈ షో 13వ సీజన్ ప్రస్తుతం జరుగుతోంది. ఢీ ది కింగ్స్ వర్సెస్ క్వీన్స్ గా పేర్కొనబడిన ఈ షో కు ప్రస్తుతం ప్రదీప్ మాచిరాజు యాంకర్ గా వ్యవహరిస్తున్నారు.
అయితే కింగ్స్ టీం కి సుడిగాలి సుధీర్ హైపర్, ఆది మెంటర్లుగా వ్యవహరిస్తూ ఉండగా క్వీన్స్ టీం కి రష్మీ గౌతమ్, దీపికా పిల్లి మెంటర్లుగా వ్యవహరిస్తున్నారు. ఇక ఇక గతంలో శేఖర్ మాస్టర్, ప్రియమణి, పూర్ణ జడ్జిలుగా వ్యవహరించే వారు. కానీ శేఖర్ మాస్టర్ తప్పుకోవడంతో ఆయన స్థానంలో కి గణేష్ మాస్టర్ వచ్చారు.
Bigg Boss Telugu 5లోకి ఎంట్రీ ఇస్తున్న ఇషా చావ్లా: మతి పోగొట్టే ఫోజులతో ఘాటు ఫొటోలు

కొత్త ప్రేమ
అయితే ఈ మధ్య ఈ షోలో ఇద్దరి మధ్య ప్రేమ అనే మొదలైనట్లుగా చూపిస్తూ వస్తున్నారు. క్వీన్స్ టీమ్ నుంచి నైనిక కింగ్స్ టీం నుంచి సాయి మధ్య ప్రేమ చిగురిస్తున్నట్టు ప్రచారం చేస్తూ వస్తున్నారు. మొన్న ఒక పర్ఫామెన్స్ వీరిద్దరూ కలిసి చేయడంతో ఇద్దరి మధ్య కెమిస్ట్రీ సరిగ్గా కుదరలేదు అని జడ్జీలు భావించారు.
అదేంటి అని అడిగితే నేను బాగానే ఉన్నాను కానీ వాడే ఏదోలా ఫీల్ అవుతున్నాడు అని నైనిక స్టేజి మీద చెప్పింది. ఆ చెప్పడమేగాక ఫోన్ కాల్స్ చాటింగ్ లో రొమాన్స్ బాగా ఉంటుందని ఇక్కడ మాత్రం రొమాన్స్ లేదని చెప్పి అందరికీ షాక్ ఇచ్చింది. అయితే నిజానికి మల్లెమాల ఇప్పటికే రెండు జంటలని తయారు చేసిందని ఇప్పుడు మూడు జంటలు తయారు చేస్తుందని బయట ట్రోలింగ్ చేస్తుండడంతో ఆది కూడా అదే ఉద్దేశంతో మీరు ఓకే అంటే చెప్పండి మీ పెళ్లి కూడా పెట్టేస్తారు మన వాళ్ళు అంటూ కౌంటర్ వేశారు.
కంగనా రనౌత్ ఘాటు ఫోజులు: అరాచకమైన ఫొటోలతో రచ్చ చేసిన బ్యూటీ

పెళ్లవుతుందో లేదో తెలియదు కానీ
నిజంగా వీళ్లిద్దరూ పెళ్లి చేసుకుంటారా లేదో తెలియదు కానీ ఈ రోజు మళ్ళీ వీళ్ళిద్దరి మధ్య ఏదో ఉంది అని అనిపించేలాగా ఒక ప్రోమో వదిలారు మల్లెమాల వారు. ప్రోమోలో చూపించిన దాని ప్రకారం కింగ్స్ టీం నుంచి డాన్స్ వేస్తున్న సాయి అల్లు అర్జున్ హీరోగా వచ్చిన అల వైకుంఠపురం సినిమాకి సంబంధించిన పుట్ట బొమ్మ సాంగ్ కి కాలు కదిపారు.
ఆ డాన్స్ పూర్తయిన వెంటనే నయనిక దగ్గరకు ఒక బొకే తీసుకెళ్లి ఐలవ్యూ కూడా చెప్పాడు.. నైనిక ప్రియమణి తనను చూస్తున్నారా లేదా అన్నట్టు చూస్తూ బొకే తీసుకొని ఆ బొకే ముఖానికి అడ్డు పెట్టి మరి సిగ్గు పడుతూ ఉండటం చూపించారు.. నువ్వు ఐ లవ్ యు చెప్పావు కానీ ఇక్కడ నయనిక ఏమీ అంటుందో చూడాలి కదా ఆమె మనసులో ఏముందో తెలుసుకోవాలి కదా అంటూ నయనికను ప్రశ్నిస్తుంది.
నయనికని కూడా దీనికి మీ సమాధానం ఏమిటి అని ప్రియమణి ప్రశ్నిస్తుంది. ఆమె మరి ఇంకేదైనా చెబుతుందేమో అని అందరూ ఆశిస్తున్న నేపథ్యంలో ఆమె కూడా ఐ లవ్ యూ అని చెప్పడంతో ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు.

అసలు ఏమైంది
అయితే ఈ ఎపిసోడ్ పూర్తయిన వెంటనే హీరోయిన్ పూర్ణ ఏడుస్తున్నట్లుగా చూపించారు. అయితే ఆమె దేని గురించి ఏడుస్తున్నారు ? ఏమిటి ? అనే విషయం చూపించ లేదు. పూర్ణ ఏడవడం మొదలు పెట్టగానే గణేష్ మాస్టర్, ప్రియమణి వెంటనే ఆమె పక్కకి చేరి ఆమెని ఓదార్చే ప్రయత్నం చేస్తున్నారు. ప్రదీప్ కూడా హుటాహుటిన స్టేజీ దిగి పూర్ణా దగ్గరికి వెళ్లి సముదాయించే ప్రయత్నం చేస్తున్నాడు. అయితే ఐ లవ్ యు చెప్పిన తర్వాత జరగడంతో దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా అని భావిస్తున్నారు.
Recommended Video

కెవ్వు కార్తీక్ ఏమైనా?
కానీ
మధ్యలో
ఒక్క
సెకన్
పాటు
కెవ్వు
కార్తిక్
ని
చూపించడంతో
వాళ్ళు
ఏదైనా
చేసి
ఉండొచ్చని
దానిని
చూసి
పూర్ణ
తన
రియల్
లైఫ్
లో
జరిగిన
ఏదైనా
సంఘటనను
గుర్తు
చేసుకుని
ఉండొచ్చని
భావిస్తున్నారు.
మొత్తం
మీద
పూర్ణ
ఏడుస్తున్న
ప్రోమో
ఇప్పుడు
సోషల్
మీడియాలో
విపరీతంగా
వైరల్
అవడమే
కాక
ప్రస్తుతం
హ్యాష్
ట్యాగ్
తో
యూట్యూబ్
లో
దూసుకుపోతోంది.
ఈ
ఎపిసోడ్
మాత్రం
18వ
తేదీ
ఆగస్టు
నెలలో
ప్రసారం
కాబోతోంది.