బిగ్‌బాస్‌లోకి అందరూ అందుకే వెళ్తారు.. దానికి రెండే కారణాలు.. ఎంట్రీపై నటి ప్రగతి క్లారిటీ
బిగ్ బాస్ షో అంటే ఒక్కొక్కరికి ఒక్కో అభిప్రాయం ఉంటుంది. ఎవరికి ఎలాంటి ఒపినీయన్ ఉన్నా గానీ తెలుగు ప్రేక్షకులను బిగ్ బాస్ బాగానే మెప్పించింది. గడిచిన మూడు సీజన్ల టీఆర్పీలు, రెండు తెలుగు రాష్ట్రాల్లో కంటెస్టెంట్ల అభిమానుల మధ్య జరిగిన రచ్చ చూస్తూనే అది అర్థమవుతోంది. ఇక నాల్గో సీజన్ ప్రారంభించేందుకు యాజమాన్యం సిద్దమవుతోంది. ఇప్పటికే అధికారికంగా ఓ ప్రకటన కూడా ఇచ్చేశారు. ప్రీ ప్రొడక్షన్, ప్రోమోకు సంబంధించిన పనులన్నీ పూర్తి చేసేస్తున్నారు.

సర్వం సిద్దం..
బిగ్ బాస్ నాల్గో సీజన్‌కు సంబంధించిన పనులన్నీ పూర్తయినట్టు తెలుస్తోంది. ఈ మధ్యే షూటింగ్‌లో పాల్గొన్నట్టు నాగార్జున కొన్ని స్టిల్స్‌ను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ప్రోమో షూటింగ్‌లో భాగంగా నాగార్జున కోవిడ్ 19 పరిస్థితుల్లో షూటింగ్ కోసం మొదటి సారిగా బయటకు వచ్చాడు. ఇప్పటికే కంటెస్టెంట్లను కూడా సెలెక్ట్ చేసి క్వారంటైన్‌లో ఉంచినట్టు తెలుస్తోంది.

లిస్ట్ వైరల్..
ఎప్పుడైతే నాల్గో సీజన్‌కు సంబంధించిన ప్రోమో విడుదలైందో.. అప్పటి నుంచి కంటెస్టెంట్ల లిస్ట్ ఓ రేంజ్‌లో వైరల్ అవుతోంది. సింగర్ సునీత, హేమచంద్ర, వైవా హర్ష, హంసా నందిని, యామినీ భాస్కర్, నందు, అఖిల్ సార్ధిక్, మంగ్లీ, జబర్దస్త్ నరేష్, ప్రగతి,తరుణ్, శ్రద్దా దాస్ వంటి వారున్నారని ప్రచారం జరుగుతోంది. అయితే ఇందులో తరుణ్, శ్రద్దా దాస్ మాత్రం ఈ వార్తలను ఖండించారు.

స్పందించిన ప్రగతి..
రియాల్టీ షోలపై ప్రగతి తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చింది. కొన్ని మంచిగా ఉన్నాయని, మరికొన్ని చెడ్డగా ఉన్నాయని తెలిపింది. అయితే ఈ క్రమంలోనే నాల్గో సీజన్ కంటెస్టెంట్లలో తన పేరు ప్రచారం కావడంపై ప్రగతి స్పందించింది.

రెండు కారణాలతోనే..
బిగ్ బాస్ షోలోకి వెళ్లాలంటే రెండు కారణాలుంటాయని, ఒకటి పేరు తెచ్చుకోవడానికి, రెండోది ఉన్న పేరును మార్చుకోవడానికి అని తెలిపింది. అసలు ఎలాంటి ఫేమ్, నేమ్ లేకపోతే అందులోకి వెళ్లి క్రేజ్ తెచ్చుకోవచ్చు లేదా తమ మీద చెడు అభిప్రాయాన్ని చెరిపేసి, తానేంటో నిరూపించుకుని కొత్తగా ఆవిష్కరించుకోవడానికే వెళ్తారని పేర్కొంది.
Recommended Video

తనకు అలాంటి అవసరం లేదు..
అయితే బిగ్ బాస్ ఎంట్రీపై క్లారిటీ ఇస్తూ.. తనకు ఆ రెండూ అవసరం లేదని తెలిపింది. తనకు ఫేమ్ ఉందని, అది కూడా అందరి దృష్టిలో మంచి పేరే ఉందని అలాంటప్పుడు తనకు బిగ్ బాస్‌కు వెళ్లాల్సిన అవసరం ఏముందని, రూమర్లను ఖండించింది.


Click it and Unblock the Notifications











