వాళ్లు పిలిచినా వెళ్లను.. ఎందుకిలా చేస్తున్నారు.. అవన్నీ ఆపండని ప్రగతి ఫైర్
రెండు తెలుగు రాష్ట్రాల్లో బిగ్‌బాస్ సందడి మొదలు కాబోతోంది. ఇప్పటికే విడుదల చేసిన రెండు ప్రోమోలు, వాటి కాన్సెప్ట్, నాగ్ లుక్స్ అన్నీ తెగ వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో లీకులు జోరందుకున్నాయి. మొదటి సీజన్ తప్పా మిగిలిన రెండు సీజన్లు లీకుల బారిన పడ్డాయి. కంటెస్టెంట్ల లిస్ట్ నుంచి.. ఎలిమినేషన్, వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇలా ప్రతీ ఒక్క విషయం ముందుగా లీకవుతూ వచ్చింది. ఇక బిగ్ బాస్ మొదలు కాబోతోండటంతో ప్రస్తుతం లీకు వీరులు రెచ్చిపోతున్నారు.
Recommended Video

కంటెస్టెంట్ల లిస్ట్ వైరల్..
బిగ్ బాస్ 4లో పార్టిసిపేట్ చేయబోతోన్న కంటెస్టెంట్లు వీరేనంటూ ఎవరి ఇష్టం వచ్చినట్టు వారు ఓ లిస్ట్‌ను వైరల్ చేసేస్తున్నారు. అన్ని లిస్ట్‌ల్లోనూ కొందరైతే కామన్‌గా ఉన్నారు. నందు, నోయెల్, రఘు మాస్టర్, ప్రణవి, జబర్దస్త్ ఆర్టస్ట్‌లు, యూట్యూబ్ స్టార్, మంగ్లీ, సీరియల్ నటులు ఇలా ఒక్కో కేటగిరీ నుంచి ఒక్కో సెలెబ్రిటీనీ తీసుకున్నట్టు తెలుస్తోంది.

ఖండించిన లిస్ట్..
బిగ్‌బాస్ 4లో కనబడబోతోంది వీరేనంటూ.. తరుణ్, శ్రద్దా దాస్, పూనమ్ కౌర్, ప్రగతి వంటి వారి పేర్లను సోషల్ మీడియాలో వైరల్ చేశారు. వీరంతా సోషల్ మీడియా వేదికగానో లేక ఇంటర్వ్యూల్లోనో ఓ క్లారిటీ ఇచ్చారు. బిగ్ బాస్‌లో పార్టిసిపేట్ చేయడం లేదంటూ ఖండించారు. అందులోనూ ప్రగతి అయితే మరింత స్పష్టంగా క్లారిటీ ఇచ్చింది.

ఆ రెండింటి కోసమే..
క్రేజ్ తెచ్చుకోవడానికి లేదా ఉన్న బ్యాడ్ ఇమేజ్‌ను, ఒపీనియన్‌ను మార్చేందుకు బిగ్ బాస్ షోలో పాల్గొంటారని ప్రగతి చెప్పుకొచ్చింది. తనకు క్రేజ్ ఉందని, అది కూడా పాజిటివ్ ఇమేజ్ ఉందని అలాంటప్పుడు బిగ్ బాస్‌కు వెళ్లాల్సిన అవసరం లేదని తెలిపింది.

పిలిచినా వెళ్లను..
ప్రగతి ఇంత చెప్పినా సరే కొందరు మాత్రం ఇంకా రూమర్స్ క్రియేట్ చేస్తూనే ఉన్నారు. వీటిపై ప్రగతి మరోసారి ఫైర్ అయింది. తాను బిగ్ బాస్ షోలో పార్టిసిపేట్ చేయడం లేదని, అది కేవలం రూమర్ అని, ఒకవేళ వారు పిలిచినా కూడా వెళ్లనని స్పషంగా చెబుతూ.. రూమర్స్‌ను ఇకనైనా ఆపండని వార్నింగ్ ఇచ్చింది. ఈ కథను ఇక్కడతో ముగించండని కోరింది.

ఆ తేదీల్లోనే ప్రారంభం..
ఇంత వరకు బిగ్ బాస్ షోను చిరంజీవి బర్త్ డే సందర్భంగా ప్రారంభిస్తారని రూమర్స్ హల్చల్ చేశాయి. ఆగస్ట్ 22న ప్రారంభిస్తారని కొందరు లేదు లేదు ఆగస్ట్ చివరి వారంలో స్టార్ట్ చేయబోతోన్నారని ఇంకొందరు వార్తలు పుట్టిస్తున్నారు. కానీ ఇంత వరకు అధికారికంగా మాత్రం ఎవ్వరూ ప్రకటించలేదు.


Click it and Unblock the Notifications











