‘వాడొక మేల్ రాధిక... బాయ్‌ఫ్రెండ్ చేతుల్లో అలా మోసపోయా’
జీవితంలో ఎంతో సాధించిన కొందరు సెలబ్రిటీలు వ్యక్తిగత జీవితంలో మాత్రం ఎన్నో ఇబ్బందులు పడుతుంటారు. ముఖ్యంగా ప్రేమ, రిలేషన్, పెళ్లి విషయంలో పడుతున్న బాధల్ని బయటపెట్టరు. కానీ కొందరు మాత్రం పలు ఇంటర్వ్యూలలో వ్యక్తిగత జీవితంలో ఎదురైన కష్టాలను పంచుకుని ఎమోషనల్ అవుతారు. తాజాగా ఓ నటి తాను బాయ్‌ఫ్రెండ్ చేతిలో ఎలా మోసపోయానో వివరిస్తూ కంటతడి పెట్టింది. ఈ వివరాల్లోకి వెళితే..
కర్ణాటకకు చెందిన బుల్లితెర నటి ప్రిన్సీ బీ కృష్ణన్ కన్నడతో పాటు పలు తెలుగు సీరియల్స్‌లో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. ఉదయ టీవీలో కావేరి అనే సీరియల్ ద్వారా కెరీర్ ప్రారంభించిన ఈ ముద్దుగుమ్మ మంచి గుర్తింపు తెచ్చుకుంది. స్టార్ మాలో ప్రసారమైనప కుంకుమ పువ్వు సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించింది ప్రిన్సీ. ఆ తర్వాత జెమినీ టీవీలో రోజా సీరియల్‌లో నటించింది. కొద్దిరోజుల క్రితం ఓ ఛానెల్‌తో మాట్లాడుతూ.. తెలుగు సీరియల్స్‌లో తనకు ఆశ్చర్యకరంగా అవకాశం వచ్చిందని చెప్పారు.

నేను కన్నడ సీరియల్స్ చేస్తుండగా.. ఛానెల్ వాళ్లు నా ఫోటోలు చూశారట. అయితే నా కాంటాక్ట్ నెంబర్ కూడా లేదు. ప్రొడ్యూసర్ దగ్గర ఫోటోషూట్ చేసి కన్నడ బుల్లితెరపై కో ఆర్డినేటర్ ద్వారా నన్ను కాంటాక్ట్ అయ్యారు. ఆ ఫోటోలు కన్నడలో నేను చేసిన సీరియల్‌లో హీరోతో చేసిన ఫోటో షూట్. కో ఆర్డినేటర్‌కి హీరో బాగా తెలియడంతో ఆ హీరో దగ్గరి నుంచి నా కాంటాక్ట్ నెంబర్ తీసుకుని కాల్ చేశారు. తెలుగులో సీరియల్ చేసేటప్పుడు భాష తెలియకపోవడంతో చాలా ఇబ్బందిపడ్డా. తెలుగు సినిమాలు కూడా చూసేదాన్ని కాదు.. సెట్‌లో అంతా రోజూ మాట్లాడుతుండటంతో, వాళ్ల మాటలు విని, డైలాగ్స్ ప్రాక్టీస్ చేసి నేర్చుకున్నా. తెలుగు ప్రేక్షకులు నన్ను బాగా రిసీవ్ చేసుకున్నారు. అలాగే నా కెరీర్‌లో అవార్డ్ కూడా తెలుగులోనే వచ్చింది. కన్నడ ఇండస్ట్రీలో సాధించలేనిది, ఇక్కడ సాధించానని తెలిపింది ప్రిన్సీ.
ఇకపోతే.. స్టార్ మాలో ప్రసారమవుతున్న ఆదివారం విత్ స్టార్ మా పరివారం షో.. హోలీ సందర్భంగా ప్రత్యేకంగా ముస్తాబైంది. బుల్లితెర సెలబ్రిటీలంతా ఈ షోకు విచ్చేసి సందడి చేశారు. యాంకర్ శ్రీముఖి వీరందరికీ రంగుపూసి సరదాగా గేమ్స్ ఆడించింది. తాజాగా విడుదల చేసిన ప్రోమోలో స్టార్స్ అంతా తమ జీవితంలో ప్రేమలో విఫలమైన సందర్భాలను పంచుకుంటూ ఎమోషనల్ అయ్యారు. అలా ప్రిన్సీ కూడా తన ప్రేమ కథను పంచుకున్నారు.
ప్రతి ఒక్కరి జీవితంలో రాధిక లాంటి అమ్మాయి ఉంటుంది. మీ లైఫ్‌లో రాధిక అనే అమ్మాయి ఎవరైనా ఉన్నారా అని అబ్బాయిలను అడిగింది యాంకర్ శ్రీముఖి. ఎక్స్‌ప్రెస్ హరి మాట్లాడుతూ.. నా లైఫ్‌లో ముగ్గురు ఉన్నారని చెప్పాడు. అసలు ఫస్ట్ అంతమందిని ఎలా ప్రేమించావాంటూ ఇమ్మాన్యుయేల్ పంచ్ విసరడంతో అంతా నవ్వేశారు. నాకైతే ఏ రాధిక లేదని ఇమ్ము చెబుతుండగా వీడే రాధిక అని రోహిణి పంచ్ విసిరింది. పృథ్వీరాజ్ మాట్లాడుతూ.. డబుల్ జరిగిందని, ఆ టైంలో నాకు లవ్ అనేది కరెక్ట్‌గా అర్దం కాలేదని చెప్పాడు. మీ లైఫ్‌లో కూడా రాధిక లాంటి అబ్బాయి ఉండే ఉంటాడని శ్రీముఖి అడుగుతుంది.
దీనికి ప్రిన్సీ స్పందిస్తూ... ఒక వ్యక్తి ఉండేవాడు, అతను నాకంటే 7 ఏళ్లు పెద్దాయన. గాడ్ ఫాదర్‌లా, ఒక గార్డియన్‌లా అనుకున్నా, కట్ చేస్తే ఆయన ఆల్రెడీ వేరే అమ్మాయితో సహజీవనం చేస్తున్నాడని చెప్పి ఎమోషనల్ అయ్యింది. ఇంతలో అవినాష్ వచ్చి ఓదార్చాడు. అలాగే రోహిణి, శ్రీముఖిలు కూడా తమ జీవితంలో రాధిక లాంటి అబ్బాయిల్ని బయటపెట్టారు. అయితే వారి వివరాలు చెప్పేలోగా ప్రోమో ఎండ్ అయ్యింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











