దీప్తీ సునయన, షణ్ముఖ్ రియల్ పెయిర్!.. సీరియల్ నటి పోస్ట్ వైరల్
బుల్లితెరపై జంటలు, లవ్ ట్రాక్‌లు, రహస్య బంధాలు కొత్తేమీ కాదు. అందులో దీప్తి సునయన-షణ్ముఖ్ వ్యవహారం ఎవ్వరికీ అంతగా అంతు పట్టదు. ఏదో ఒకటి కుండబద్దలు కొట్టినట్టు మొహం మీదే చెప్పరు. షణ్ముఖ్ ఆ మధ్య ఫుల్ పాపులర్ అయ్యాడు. తన వెబ్ సిరీస్ సక్సెస్ అయిన క్రమంలో మీడియాలో తెగ హల్చల్ చేశాడు. ఆ సమయంలోనూ ప్రేమ వ్యవహారానికి సంబంధించిన ప్రశ్నలు ఎదురయ్యాయి. కానీ నోరు విప్పి ఏదీ కూడా నేరుగా చెప్పలేదు.

దీప్తి సునయన అలా..
బిగ్ బాస్ షోకి రాకముందు దీప్తి సునయన డబ్ స్మాష్ ద్వారా బాగానే పాపులర్ అయింది. డబ్ స్మాష్ ద్వారా దీప్తి, యూట్యూబ్ ద్వారా షణ్ముఖ్ బాగానే క్లిక్ అయ్యారు. ఇద్దరూ కలిసి చేసే కవర్ సాంగ్స్ కూడా బాగా వైరల్ అయ్యేవి. అయితే బిగ్ బాస్ షోలోకి దీప్తి సునయన వచ్చే సరికి షణ్ముఖ్ వ్యవహారం ఎక్కువగా బయటకు వచ్చింది. ఆ షోలో ఎన్నో సార్లు షణ్ముఖ్ టాపిక్ వచ్చింది.

షణ్ముఖ్ ఇలా..
అయితే షణ్ముఖ్ మాత్రం ఎక్కడా కూడా దాని గురించి నేరుగా స్పందించడు. ప్రేమ వ్యవహారానికి సంబంధించిన ప్రశ్నలు వస్తే చాలు అందరికీ తెలిసిందే కదా? అంటూ తప్పించుకుంటాడు. ఏది ఏమైనా గానీ షణ్ముఖ్ మాత్రం ఇప్పుడు యూట్యూబ్‌లో ఓ స్టార్ అయిపోయాడు.

వదినమ్మ ఫేమ్..
తాజాగా బుల్లితెర సెలెబ్రిటీల్లో రియల్ జంటలు ఒకే చోటకు చేరారు. వదినమ్మ సీరియల్ ఫేమ్ ప్రియాంక నాయుడు (సిరి పాత్ర ధారి) తాజాగా ఓ పోస్ట్ చేసింది. గత కొన్ని రోజులుగా ఈమె వార్తల్లో వైరల్ అవుతోన్న సంగతి తెలిసిందే. సీరియల్ నటుడు మధుతో ప్రియాంక వివాహాం జరగడంతో ఈ జంట ట్రెండింగ్‌లోకి వచ్చేసింది.

రియల్ జంటలతో..
సెలెబ్రిటీల జంటలతో తాజాగా ఓ షోను చేస్తున్నారు.అందులో ఈ కొత్త జంట ప్రియాంక మధు కూడా పాల్గొన్నారు. వీరితో పాటు నిరుపమ్ పరిటాల మంజుల పరిటాల జంట కూడా విచ్చేసింది. అయితే వీరంతా నిజ జీవితంలోనూ భార్యా భర్తలే. కానీ అక్కడ దీప్తి సునయన షణ్ముఖ్‌లు కూడా ఉన్నారు. అయితే వారికి ఇంకా పెళ్లి కాలేదు.

అదే ప్రేమ..
కానీ వారిని కూడా రియల్ జంటలో కలిపేసింది ప్రియాంక నాయుడు. రెండు శరీరాలను ఒకే ఆత్మగా చేసేదే ప్రేమ అంటూ రియల్ కపుల్.. గేమ్ షో.. ఎంతో సరదాగా ఉందంటూ పోస్ట్ చేసింది. అయితే ఇది ఏ చానెల్‌లో వచ్చే షో.. కొత్త షోనా? అన్నది ఏ మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.


Click it and Unblock the Notifications











