సీఎం జగన్ బర్త్‌డే రోజున.. లక్ష్మీ‌రాయ్ దారుణంగా రీట్వీట్.. సోషల్ మీడియాలో వైరల్

బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షో సీజన్ 4 ముగింపు వేడుకల్లో అందాల భామ లక్ష్మీరాయ్ సందడి చేసింది. తన అంద చందాలతో లక్ష్మీరాయ్ ఆకట్టుకొన్నారు. అయితే బిగ్‌బాస్ క్లోజింగ్ వేడుకల ఉత్సాహంలో ఉన్న ఈ ముద్దుగుమ్మ ఓ నెటిజన్ చేసిన ట్వీట్‌ను చూసుకోకుండా రీ ట్వీట్ చేసింది. ఇప్పుడు ఆ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇంతకు లక్ష్మీరాయ్ చేసిన రీ ట్వీట్ ఏమిటంటే..

బిగ్‌బాస్ వేదికపైన రాయ్ లక్ష్మీ

బిగ్‌బాస్ వేదికపైన రాయ్ లక్ష్మీ

బిగ్‌బాస్ తెలుగు 4 గ్రాండ్ ఫినాలేలో లక్ష్మీరాయ్ హంగామా చేసింది. వేదికపైన గ్లామరస్ లుక్‌తో కనిపించిన ఆమె పలు హిట్ పాటలకు డ్యాన్సులు చేసింది. రత్తాలు రత్తాలు పాటకు ఆమె చేసిన డ్యాన్స్ ప్రేక్షకులకు గిలిగింతలు పెట్టింది.

అరియానా గ్లోరిని ఎలిమినేట్ చేసి

అరియానా గ్లోరిని ఎలిమినేట్ చేసి

ఇక బిగ్‌బాస్ టాప్ 5 కంటెస్టెంట్ల ఎలిమినేషన్ ప్రక్రియలో కూడా పాల్గొన్నారు. బిగ్‌బాస్ ఇంటిలోకి వెళ్లి టాప్ 4 కంటెస్టెంట్ ఎలిమినేషన్ ప్రాసెస్‌ను చేపట్టారు. ఈ ప్రక్రియలో అరియానా గ్లోరిని ఎలిమినేట్ చేసి వేదిక మీదకు తీసుకు వచ్చారు. అలా ముగింపు వేడుకలో లక్ష్మీరాయ్ పాల్గొన్నారు. అక్కడి వరకు అంతా బాగానే సాగిపోయింది.

లక్ష్మీరాయ్ గురించి నెటిజన్ ట్వీట్

లక్ష్మీరాయ్ గురించి నెటిజన్ ట్వీట్

లక్ష్మీరాయ్ బిగ్‌బాస్ ఎలిమినేషన్ ప్రక్రియలో పాల్గొన్న సమయంలో ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు. లక్ష్మీరాయ్ బజర్ ప్రెస్ చేస్తుంది. ఒకవేళ గ్రీన్ లైట్ వెలిగితే టాప్ కంటెస్టెంట్ ఎలిమినేట్ అవుతారు అంటూ కామెంట్ పెట్టాడు. ఆ తర్వాత #HBDYSJalaga అనే హ్యాష్ ట్యాగ్‌ను జత చేశాడు. దానిని చూసుకోకుండా రీట్వీట్ చేసింది.

 వైఎస్ జగన్ బర్త్ డే రోజున ట్రెండింగ్‌గా హ్యాష్ ట్యాగ్స్

వైఎస్ జగన్ బర్త్ డే రోజున ట్రెండింగ్‌గా హ్యాష్ ట్యాగ్స్

అప్పటికే ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని ఆయన వ్యతిరేక వర్గం #HBDYSJalaga, #HBDFakeCM అనే హ్యాష్ ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు. ఓ నెటిజన్ #HBDYSJalaga అనే ట్యాగ్‌ను పెట్టి పోస్ట్ చేయగా దానిని లక్ష్మీరాయ్ రీట్వీట్ చేసింది. ఇప్పుడు ఆ పోస్టు వైరల్‌గా మారింది.

Recommended Video

Bigg Boss Telugu 4 : Netizens trolls bigg Boss for splitting winner Abhijeet prize money to Sohel
లక్ష్మీరాయ్ రీట్వీట్ వైరల్

లక్ష్మీరాయ్ రీట్వీట్ వైరల్

ప్రస్తుతం #HBDYSJalaga అనేది వైరల్ అవుతున్న క్రమంలో లక్ష్మీరాయ్ పోస్టు విస్తృతంగా ప్రచారం జరుగుతున్నది. లక్ష్మీ రాయ్ ఆ రీట్వీట్‌ను ఇంకా డీలీట్ కావడంతో పెద్ద మొత్తంలో రీట్వీట్ చేయడం అలాగే సోషల్ మీడియాలో సర్కులేట్ చేయడం జరుగుతున్నది. ఇలా లక్ష్మీరాయ్ తెలియకుండానే పప్పులో కాలేసిందని నెటిజన్లు కామెంట్లు విసురుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X