రాశి గారి ఫలాలా? అనసూయ నోటి దురదపై హీరోయిన్ రాశి ఘాటు వ్యాఖ్యలు
దండోరా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరోయిన్ల డ్రెస్సింగ్ స్టైల్‌పై హీరో శివాజీ చేసిన వ్యాఖ్యలు చిత్ర పరిశ్రమలో వైరల్ అయ్యాయి. దీనిపై సింగర్ చిన్మయి శ్రీపాద, స్టార్ యాంకర్ అనసూయ భరద్వాజ్ తదితర సినీ ప్రముఖులు, సోషల్ మీడియా నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. దాంతో శివాజీ మహిళా లోకానికి క్షమాపణలు చెప్పారు. తాను చెప్పాలనుకున్న ఉద్దేశం కరెక్టే కానీ, ఈ ప్రాసెస్‌లో రెండు పదాలు తప్పుగా దొర్లాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వివాదంలో తెలంగాణ మహిళా కమీషన్ నుంచి నోటీసులు రావడంతో ఆయన కమీషన్ ఎదుట హాజరై వివరణ ఇచ్చుకున్నారు. అయితే ఆ తర్వాత కూడా అనసూయ తరచుగా సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెట్టడం, కొంతమంది యూట్యూబర్ల కారణంగా ఈ వివాదం మరింత ముదురుతోంది. ఈ నేపథ్యంలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. సీనియర్ హీరోయిన్ రాశీ ఈ వివాదంపై స్పందించడంతో పాటు గతంలో తన గురించి చేసిన బాడీ షేమింగ్ కామెంట్స్‌పై సీరియస్ అయ్యారు. ఈ వివరాల్లోకి వెళితే...
మైక్ దొరికితే ఏదో ఒకటి మాట్లాడొచ్చు అని కాదు. ప్రస్తుతం ఒక ఇష్యూ జరుగుతోంది. శివాజీ గురించి ఏదో మాట్లాడుతున్నారు. శివాజీగారు మాట్లాడింది 100 శాతం తప్పని నేను అనను, కానీ కొన్ని పదాలను వాడటం మాత్రం కరెక్ట్ కాదు. ఆ పదాలను అనుకోకుండా ఉపయోగించానని శివాజీ గారు కూడా బాధపడ్డారు. దానికి క్షమాపణలు చెప్పడం కూడా జరిగింది. వ్యక్తిగతంగా శివాజీ గారి గురించి నాకు తెలుసు. శివాజీ గారి టాపిక్ కాదు కానీ, అనవసరంగా నా గురించి మాట్లాడిన ఓ విషయాన్ని మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను అని రాశీ తెలిపారు.

నాలుగేళ్ల క్రితమో, మూడేళ్ల క్రితమో మా ఆయన ఓ షోకి సంబంధించిన క్లిప్పింగ్ చూపించారు. ఆ షో మీ అందరికి తెలుసు.. రెగ్యులర్‌గా చూస్తూనే ఉంటారు. ఆ షో జడ్జిలు కూడా మీకు తెలిసినవాళ్లే. అందులో నాకొక కాల్ అక్కడి నుంచి వచ్చింది. ఓ స్కిట్ చేయాలని అడగ్గా... కొన్ని ఎపిక్స్‌ని మనం టచ్ చేయకూడదని చెప్పా. సావిత్రమ్మ లెజండరీ.. అలాగే ప్రతి ఆర్టిస్ట్‌కి ఒక మూవీ ఉంటుంది. నాకు ప్రేయసిరావే. చిన్నపిల్లలంతా నన్ను గుర్తుపడుతున్నారంటే దానికి కారణం ప్రేయసిరావే. రెగ్యులర్‌గా అది ఛానెల్‌లో వస్తుంటుంది. ఆ మూవీని మీరు సీక్వెల్ చేయడం, దానికి కామిక్‌గా తీస్తారేమో చేయను అని చెప్పా. జడ్జిగా రమ్మంటే ఖచ్చితంగా వస్తా.. అయినప్పటికీ దాని సీక్వెల్ చేయడం కరెక్ట్ కాదని చెప్పానని రాశీ గుర్తుచేసుకున్నారు.
జానకీ కలగనలేదు సీరియల్ షూట్‌లో ఉన్నప్పుడు ఇది జరిగింది, సరిగ్గా గుర్తే లేదు. ఇది అయిన తర్వాత సేమ్ ఛానెల్‌లో ఓ స్కిట్ చేశారు. ఆ స్కిట్‌లో రాశీ ఫలాలు అనే పదం వాడారు. ఆ ఎపిసోడ్‌కి యాంకర్‌గా ఉన్నామె.. ఒక మహిళ అయ్యుండి రాశీగారి ఫలాలు గురించి మాట్లాడుతున్నావా? అని అడిగింది. అలా ఎలా అడుగుతుంది? నేను అది గమనించలేదు.. మైండ్‌కి తీసుకోలేదు. ఇప్పుడు ఆవిడ బాగా మాట్లాడుతున్నారు. రాశి ఫలాలు అనేది మామూలే. అది మనందరికీ తెలుసు. రాశి ఫలాల్లో నేను లేను.. రాశి అనేది నా ఒరిజినల్ పేరు కాదు, నా పేరు విజయలక్ష్మీ. సినిమా పేరు తెలుగులో రాశి.. తమిళ్‌లో మంత్ర. రాశీ గారి ఫలాల గురించి చూస్తే.. గారిలో నేనున్నా. అంటే ఆమె నా గురించి మాట్లాడింది. అక్కడ జడ్జిలలో ఒక లేడీ ఉన్నారు.. ఆవిడ పడి పడి నవ్వింది. నేనైతే నవ్వేదానిని కాదు అని రాశీ అన్నారు.
నేను ఆ ప్లేస్‌లో ఉండుంటే.. స్కిట్ ఆపేసి ఎందుకు రాశీగారి ఫలాలు అనే పదాన్ని వాడుతున్నారు. అనవసరంగా ఎందుకు అని అడిగేదానిని. కామెడీ చేయొచ్చు.. కానీ బాడీ షేమింగ్ చేయడానికి కన్నతల్లికి, కన్నతండ్రికి కూడా రైట్ లేదు. అది మీ అందరికీ తెలుసు.. పిల్లల్ని మనం ఏమన్నా అంటే పిల్లలే కేసులు పెడుతున్నారు. సోషల్ మీడియాకు, టీవీకి నేను చాలా దూరంగా ఉంటాను అని చెబితే నమ్మరు. అందరూ హాయిగా ఉండండి, అనవసరంగా ఎందుకు ఈ గొడవలు. కెమెరా తీసుకుని సెల్ఫీలు, సెల్ఫ్ వీడియోలు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు. సోషల్ మీడియాని ఒక మంచి ఫ్లాట్‌ఫాంగా ఉపయోగించండి, ఇలాంటి ఇష్యూత్‌తో సోషల్ మీడియాని బ్యాడ్ చేస్తున్నారని రాశీ సీరియస్ అయ్యారు.
మీ ఫ్యామిలీని, మీ ఫ్రెండ్స్‌ని చూసుకోండి.. మీకు నచ్చినవాళ్లతో మాట్లాడండి, నచ్చలేదా మాట్లాడటం మానేయండి. అంతే తప్ప.. ఖాళీగా ఉంటే మొబైల్ తీసుకుని ఎవరిని ట్రోల్ చేద్దామా? ఎవరిని ఏం అందామా అనేది వద్దు. అసలు ఎవరిని అనడానికి రైట్ ఎవరికి ఉంది. నిజానికి దీనిని నేను లీగల్ ఇష్యూ చేద్దామని అనుకున్నా. అయితే అమ్మ అడిగిన క్వశ్చన్‌కు నా దగ్గర ఆన్సర్ లేదు. మీ అందరితో షేర్ చేసుకుందామని ఈ వీడియో పెట్టాను అని రాశీ తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా... అనసూయ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











