సదా పరువు తీసేసిన స్టార్ హీరోయిన్.. అతన్ని లవ్ చేయడంపై షాకింగ్ కామెంట్స్!
బ్యూటిఫుల్ అండ్ గ్లామరరస్ బ్యూటి సదాను ఇప్పుడు అప్పుడే మర్చిపోలేం. ఎందుకంటే వెళ్లవయ్యా వెళ్లు అంటూ యూత్ గుండెల్లో గూడు కట్టుకుని కూర్చొంది ఈ హీరోయిన్. జయం సినిమాలో సదా చెప్పిన ఈ డైలాగ్ ఎంత పాపులరో పెద్దగా చెప్పనవసరం లేదు. ఈ ఒక్క డైలాగ్‌తోనే కుర్రకారును కట్టిపడేసింది. ఇక తర్వాత తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ చిత్రాల్లో నటించి ఆకట్టుకుంది. ఇటీవల హలో వరల్డ్ వెబ్ సిరీస్ తో ప్రేక్షకులను పలకరించిన సదా పలు షోలతో బిజీగా ఉంది. అలాగే బీబీ జోడీ అనే రియాలిటీ షోలో న్యాయ నిర్ణేతగా అలరిస్తోంది. ఈ క్రమంలోనే సదా ఒకరిపై విపరీతంగా ప్రేమ చూపిస్తోందని మరో స్టార్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్ చేసింది.
Pic Credits : Star Maa You Tube

లోపల దాగి ఉన్న డ్యాన్సర్స్..
సెలబ్రిటీలకు అడ్డాగా ప్రారంభమైన బిగ్ బాస్ రియాలిటీ షోలో మొదట్లో పాపులర్ నటీనటులే ఎంట్రీ ఇచ్చారు. తర్వాతి కాలంలో సీజన్ లు పెరుగుతున్న కొద్దీ సీరియల్ నటినటులు, సోషల్ మీడియా స్టార్స్, రివ్యూవర్స్, యాంకర్స్, జర్నలిస్ట్స్ ఇలా రకరకాల రంగంలో రాణించిన వ్యక్తులను కంటెస్టెంట్లుగా తీసుకొచ్చారు.
ఇక వాళ్లందరు బిగ్ బాస్ షోలో అడుగుపెట్టాక ఉదయం పూట డ్యాన్స్ చేస్తూ అలరించేవారు. ఈ కంటెస్టెంట్ల లోపల మంచి డ్యాన్సర్స్ దాగి ఉండటంతో వారందరిచేత బీబీ జోడీలో డ్యాన్స్ చేయిస్తున్నారు మేకర్స్.

న్యాయ నిర్ణేతగా సదా..
బీబీ జోడీ డ్యాన్స్ రియాలిటీ షోలో కమెడియన్ అవినాష్-యాంకర్ అరియానా గ్లోరి, అర్జున్ కల్యాణ్-వాసంతి కృష్ణన్, అఖిల్ సార్థక్-తేజస్వి మదివాడ, ఆర్జే సూర్య-ఫైమా, రవికృష్ణ-భాను, ఆర్జే చైతూ-ఆర్జే కాజల్, మెహబూబ్-శ్రీ సత్య, కౌశల్-అభినయ శ్రీ మొత్తంగా 8 జోడీలుగా పార్టిస్ పేట్ చేస్తున్నారు.
ఈ షోకి బిగ్ బాస్ తెలుగు మూడో సీజన్ రన్నరప్, బుల్లితెర రాములమ్మ శ్రీముఖి యాంకర్ గా వ్యవహరించనుంది. అలాగే అలనాటి స్టార్ హీరోయిన్ రాధతోపాటు గ్లామరస్ హీరోయిన్ సదా, ప్రముఖ కొరియోగ్రాఫర్ తరుణ్ మాస్టర్ జడ్జ్ లుగా ఉన్నారు.

డ్యాన్స్ లతో అట్రాక్ట్ చేస్తూ..
ఇక బిగ్ బాస్ కంటెస్టెంట్లందరితో నిర్వహిస్తున్న ఈ బీబీ జోడీ డ్యాన్స్ షోను ప్రతి శని, ఆది వారాల్లో ప్రసారం చేస్తున్నారు. ఈ ఎపిసోడ్స్ కు సంబంధించిన ప్రోమోలను విడుదల చేస్తూ ఎపిసోడ్స్ పై క్యూరియాసిటీ క్రియేట్ చేస్తున్నారు మేకర్స్. అందులో భాగంగానే ఈవారం వచ్చే ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. ఈ ప్రోమోలో సినిమా సినిమా రౌండ్ లో భాగంగా జోడీలంతా తమ డ్యాన్స్ లతో తెగ ఎంటర్టైన్ చేశారు.

విపరీతమైన అప్రిషియేషన్..
సినిమా సినిమా స్పెషల్ రౌండ్ లో ఆర్జే చైతూ-కాజల్ చేసిన డ్యాన్స్ కు చాలా నచ్చి చేతులతో హార్ట్ సింబల్ వేసి చూపించింది సదా. తర్వాత చైతూతో సదా డ్యాన్స్ చేసింది. అనంతరం కౌశల్-అభినయ శ్రీ డ్యాన్స్ నచ్చలేదని షాక్ ఇచ్చిన సదా తర్వాత నాకు చాలా బాగా నచ్చింది అని మరో షాక్ ఇచ్చింది. అనంతరం మెహబూబ్-శ్రీ సత్య, రవికృష్ణ-భాను డ్యాన్స్ లకు విపరీతమైన అప్రిషియేషన్స్ వచ్చింది.

హగ్ చేసుకున్న సదా..
రవికృష్ణ-భాను డ్యాన్స్ కి మీ డ్యాన్స్ ఎప్పుడు అయిపోతుందా.. స్టేజీ పైకి ఎప్పుడు వచ్చేద్దామా అని అనిపించిదని సదా తెలిపింది. అప్పుడు షారుక్ ఖాన్ వాయిస్ ఇమిటేట్ చేస్తూ కామెడీ పండించాడు అవినాష్. అనంతరం ఫైమా-ఆర్జే సూర్య పర్ఫామెన్స్ కు మెస్మరైజ్ అయిన సదా స్టేజీపైకి వెళ్లి.. వాళ్లను హగ్ చేసుకుంది. సీనియర్ హీరోయిన్ రాధా కుర్చీలో కూర్చోనే ఫ్లయింగ్ కిస్ ఇచ్చింది. మైండ్ బ్లోయింగ్ పర్ఫామెన్స్ అని తరుణ్ మాస్టర్ కొనియాడారు.

రాధ కామెంట్స్.. సదా పరువు గోవిందా..
యాంకర్ అరియానా గ్లోరి-అవినాష్ వచ్చి డ్యాన్స్ పర్ఫామెన్స్ ఇచ్చారు. అవినాష్ తనపై అరియానాను కూర్చునిపెట్టుకుని మూమెంట్స్ వేశారు. వీళ్ల డ్యాన్స్ కి 'ఐ లవ్యూ డ' అని రాధా అంటే.. 'నేను చెప్పేది మీరు చెప్పేసారు' అని సదా అంది. దీంతో 'వద్దు.. చాలా లవ్ చేస్తున్నావ్ నువ్' అని రాధ షాకింగ్ కామెంట్స్ చేసింది.
దీంతో షాక్ అయిన సదా పరువు పోయినట్లుగా ఏదో చెప్పుకునే ప్రయత్నం చేసింది. అయితే అవినాష్ లాంటి భర్త కావాలని ఇదివరకు సదా చెప్పిన విషయం తెలిసిందే. దాన్ని దృష్టిలో ఉంచుకునే రాధ అలాంటి కామెంట్స్ చేసి ఉండొచ్చని నెటిజన్లు అనుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











