నాకు అలాంటి మగాడంటే ఇష్టం.. కట్ చేసుకోవాలంటూ హీరోయిన్ రాధ బోల్డ్ కామెంట్స్

ఒకప్పటి స్టార్ హీరోయిన్ రాధ గురించి తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరు. 80వ దశకంలో అప్పటి స్టార్ హీరోలందరితో ఆడిపాడి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల్లో భాగమైంది. ఎక్కువగా మెగాస్టార్ చిరంజీవి సినిమాలతో తెగ క్రేజ్ సంపాదించుకుంది.

ప్రస్తుతం సపోర్టింగ్ క్యారెక్టర్స్ చేస్తూ టెలివిజన్ రంగంలోని పలు షోలకు న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తోంది. ఇటీవలే బీబీ జోడీ డ్యాన్స్ షోకి జడ్జ్ గా అలరించిన రాధ ఇప్పుడు నీతోనే డ్యాన్స్ షోతో అకట్టుకుంటోంది. ఈ షోలో తనకు ఎలాంటి మగాడు అంటే ఇష్టమో చెప్పి షాకింగ్ కామెంట్స్ చేసింది.

Actress Radha Comments On Shiva Kumar Priyanka Jain Dance In Neethone Dance Show

ఉదయ చంద్రిక: స్టార్ హీరోయిన్ గా మంచి పేరు తెచ్చుకున్న అలనాటి రాధ అసలు పేరు ఉదయ చంద్రిక. కేరళలోని తిరువనంతపురంలో జన్మించిన రాధ అగ్ర కథానాయికగా తెలుగు చిత్రాల్లో చెరగని ముద్ర వేసుకుంది. 250కి పైగా సినిమాలతో అలరించిన రాధ ప్రస్తుతం నీతోనే డ్యాన్స్ అనే షోలో న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తోంది.

రియల్-రీల్: స్టార్ మా వేదికగా 'నీతోనే డ్యాన్స్' అంటూ ప్రారంభం అయిన ఈ డ్యాన్స్ షోలో కొందరు రియల్ లైఫ్ కపుల్స్ ఉంటే మరికొందరు రీల్ పెయిర్స్ ఉన్నారు. ఈ షోలో మొత్తంగా 8 జంటలు పాల్గొంటున్నాయి. వారిలో అమర్ దీప్-తేజస్విని, నిఖిల్-కావ్య శ్రీ, శివ కుమార్-ప్రియాంక జైన్, నటరాజ్-నీతూ, సందీప్-జ్యోతి రాజ్, యాదమ్మ రాజు-స్టెల్లా, సాగర్-దీపా జగదీష్, పవన్-అంజలి జోడీలుగా ఉన్నారు.

Actress Radha Comments On Shiva Kumar Priyanka Jain Dance In Neethone Dance Show

ముగ్గురు జడ్జెస్: ఇక ఈ నీతోనే డ్యాన్స్ షోకి హీరోయిన్ రాధతోపాటు గ్లామరస్ బ్యూటి సదా, ప్రముఖ కొరియోగ్రాఫర్ తరుణ్ మాస్టర్ న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ ముగ్గురు ఇదివరకు బీబీ జోడీ డ్యాన్స్ షోకి సైతం జడ్జెస్ గా ఉన్న విషయం తెలిసిందే. అలాగే వీరితోపాటు ఆ షోకి యాంకర్ గా చేసిన శ్రీముఖి కూడా నీతోనే డ్యాన్స్ కు హోస్ట్ గా చేస్తోంది.

డ్యాన్స్ ఆఫ్ ఇండియా: ఇదిలా ఉంటే ఈ నీతోనే డ్యాన్స్ షోలో జంటలు రెచ్చిపోతూ రొమాన్స్ పండిస్తున్నారు. వారికి హాట్ పర్ఫామెన్స్ కు జడ్జెస్ సైతం ఊగిపోతున్నారు. తాజాగా ఈ షో ప్రోమోను విడుదల చేశారు. అందులో ఈసారి డ్యాన్స్ ఆఫ్ ఇండియా అనే థీమ్ ఉన్నట్లుగా శ్రీముఖి తెలిపింది. దీంతో జానకి కలగనలేదు సీరియల్ ఫేమ్ ప్రియాంక జైన్ జోడీ పంజాబీ కాస్ట్యూమ్ తో ఆకట్టుకుంది.

కట్ చేసేయాలి: ప్రియాంక-శివ కుమార్ డ్యాన్స్ పై జడ్జెస్ ప్రశంసలు కురిపించారు. తర్వాత "నాకు ఒక పంజాబీ మెన్ (మగాడు) అంటే చాలా ఇష్టం" అని రాధ సిగ్గు పడుతూ చెప్పింది. దీంతో రాజశేఖర అనే సాంగ్ బ్యాక్ గ్రౌండ్ లో ప్లే అయింది. దానికి "ఇది కట్ చేస్కోవాలి. నేను చెప్పినది కట్ చేసేయాలి" అని రాధ అంది. ప్రస్తుతం ఈ ప్రోమో వైరల్ గా మారింది. అలాగే మిగతా జోడీలు కూడా తమ డ్యాన్సులతో ఆకట్టుకున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X