For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఆ ఇద్దరి కారణంగా ట్రెయిన్ ఫోబియా.. బాత్రూం వద్ద వాటేసుకుని, ముద్దు.. షాకింగ్ విషయాలు బయటపెట్టిన రజిత!

  |

  తెలుగులో నటి రజిత అందరికీ సుపరిచితురాలు, ఆమె పేరు గుర్తు పట్టలేని వారు సైతం ఆమెను చూస్తే గుర్తు పడతారు. తన కెరీర్ లో నాలుగు వందల సినిమాల్లో తనదైన కామెడీ పాత్రల్లో నటించిన రజిత హీరోయిన్ గా సైతం ఒడియా భాషలో నటించింది. అక్కడ ఆమెకు అప్పట్లో మంచి ఫాలోయింగ్ కూడా ఉండేది. ఇక రజిత తెలుగు సినిమాల్లో అడుగుపెట్టి 35 ఏళ్ళు దాటింది. సినిమాల్లో సహాయక పాత్రలతో పాటు బుల్లి తెరపై కూడా తనదైన ముద్ర వేసుకుంది రజిత. తాజాగా ఆలీతో సరదాగా షోలో పాల్గొన్న ఆమె తన జీవితానికి సంబంధించి కీలక విషయాలు వెల్లడించింది. ఆ వివరాల్లోకి వెళితే

  షూటింగ్ మీద ఇంట్రెస్ట్ తో

  షూటింగ్ మీద ఇంట్రెస్ట్ తో

  తూర్పుగోదావరి జిల్లా కాకినాడ సమీపంలో జన్మించిన రజిత సినిమా షూటింగుల మీద ఆసక్తితో చెన్నై వెళ్ళింది. ప్రముఖ నటీమణులు కృష్ణవేణి, రాగిణి ఆమెకు పినతల్లులు అవుతారు. అయితే సినిమా షూటింగులు చూద్దామని చెన్నై వెళ్లిన రజిత అనుకోకుండా అక్కినేని నాగేశ్వరరావు, నాగర్జునలు హీరోలుగా వస్తున్న అగ్నిపుత్రుడు సినిమాలో అక్కినేని కుమార్తె నటించాల్సి వచ్చింది.

  వద్దన్నా అవకాశం

  వద్దన్నా అవకాశం


  మొదట సినిమాల్లో నటించే ఆసక్తి లేదని రజిత చెప్పినా సరే ఇంట్లో వాళ్ళు చెప్పడంతో నటించడానికి ఒప్పుకుంది. ఆ తర్వాత ఆమెకు సినిమా అవకాశాలు చాలా వచ్చాయి. ఆ సినిమా పూర్తి చేశాక మళ్లీ కాకినాడ వచ్చి పదో తరగతి పూర్తి చేసిన రజిత మళ్లీ ఇంటర్మీడియట్ చదువు కోసం చెన్నై వెళ్ళింది. అక్కడ చదువుకుంటూనే సినిమాల్లో నటించింది.

  హీరోయిన్ గా

  హీరోయిన్ గా


  అయితే ఆమె తమిళ, కన్నడ, ఒడియా భాషలలో కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా కూడా నటించింది. ఇక వయసు మళ్ళిన తర్వాత హీరోయిన్ పాత్రలు తగ్గిపోవడంతో ఆమె తెలుగులో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా స్థిరపడింది. దాదాపు తెలుగులో ఆమె చాలా సినిమాల్లో నటించింది. తాజాగా ఆలీతో సరదాగా షో లో పాల్గొన్న ఆమె తనకు ట్రైన్ ఫోబియా ఉందని చెప్పుకొచ్చింది. ఆ ఫోబియా ఏర్పడడానికి కారణం ఇద్దరూ టిటిఈలు అని పేర్కొంది.

  వాటేసుకుని ముద్దు పెట్టడానికి

  వాటేసుకుని ముద్దు పెట్టడానికి


  మొదటిసారి చెన్నై నుంచి హైదరాబాద్ వస్తున్న సమయంలో ఫస్ట్ క్లాస్ ఏసీ భోగీలో టిటిఈ తనను బలవంతంగా వాటేసుకుని ముద్దు పెట్టడానికి ప్రయత్నించాడని బెదిరి పోయి అరిచినా ట్రైన్ లో ఎవరికీ వినపడలేదు అని చెప్పుకొచ్చింది. తర్వాత విడిపించుకుని తోటి నటీనటులను లేపే లోపు అతను అక్కడి నుంచి పారిపోయాడు అని చెప్పుకొచ్చింది.

  కబుర్లు చెబితేనే టికెట్

  కబుర్లు చెబితేనే టికెట్


  ఇక మరోసారి చెన్నై వెళుతున్న సమయంలో హైదరాబాద్ నుంచి విజయవాడ వరకు తనతో కూర్చుని కబుర్లు చెబితేనే కన్ఫాం అయినట్టు టికెట్ ఇస్తానని టిటిఈ పట్టుబట్టాడని, తనకు ఉదయమే షూటింగ్ ఉందని చెప్పినా వినకుండా రాత్రంతా కబుర్లు చెబుతూనే ఉన్నాడు అని చెప్పుకొచ్చింది. ఈ దెబ్బతో నిర్మాతలకు తాను కొన్ని రూల్స్ పెట్టానని తనకు టిక్కెట్ ఇస్తే తన సహాయకులకు కూడా అదే బోగీలో టికెట్ ఇవ్వాలని అప్పటి నుంచి రూల్ పెట్టానని చెప్పుకొచ్చింది..

  Ram Gopal Varma Released 'Deyyam Tho Sahajeevanam' Teaser

  శివగామి సీన్ ముందే


  ఇక మరో సారి ఒక అభిమాని తన తలను తీసుకొచ్చి తన కాళ్లకు అంటించాడని, అచ్చంగా సినిమాలో శివగామి రమ్యకృష్ణ కాళ్ళను కట్టప్ప ఎలా అయితే అంటించుకుంటాడో అలానే జరిగింది అని చెప్పుకొచ్చింది.. అమెరికాలోని వర్జీనియా రాష్ట్రంలో తన అభిమానిని అంటూ వచ్చిన ఒక వ్యక్తి ఇలా చేశాడని ఆమె చెప్పుకొచ్చింది.

  English summary
  Telugu actress rajitha is well known for her character roles in most of the tollywood films. She recently e appeared in alitho saradaga talk show. Hindi talk show she reveal about her train phobia and the reasons for heart line phobia
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X