Bigg Boss Telugu 7లో అడుగుపెట్టిన రతికా ఎవరు? హార్ట్ బ్రేక్ చేసింది నువ్వే అంటూ నాగార్జునకు హార్ట్ స్ట్రోక్!
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 అంగరంగ వైభంగా ప్రారంభం అయింది. చిరంజీవి సాంగ్ తో ఎంట్రీ ఇచ్చిన నాగార్జున... ఒక్కో కంటెస్టెంట్స్ హోజ్ లోకి అడుగు పెడుతున్నారు. ఇక పదో కంటెస్టెంట్ గా రతికా బిగ్ బాస్ లోకి అడుగు పెట్టింది. రావడం రావడమే.. నాగార్జునతో పులిహోర కలిపింది ఈ భామ. ఇక సూపర్ యాక్టివ్ గా షోలో పాల్గొని హౌజ్ లోకి వెళ్లింది. ఇక ఈమె ఎవరు.. ఏ సినిమాల్లో నటించింది... అనే వివరాలు తెలుసుకుందాం.
రతికా రోజ్... ఈ భామ గురించి తెలుగు ప్రేక్షకులకు అంతా పరిచయం లేని పేరు. మొన్నటి వరకు బిగ్ బాస్ లోకి రతికా ఎంట్రీ అంటూ లీక్ రావడంతో.. అంతా అశోకా వనంలో అర్జున కల్యాణం హీరోయిన్ రితికా నాయక్ అనుకున్నారు. ఇక రితికా నాయక్ ఎంట్రీ అంటూ వార్తలు రాసేసుకున్నారు. కానీ ఆమె వేరు... ఈమె వేరు. ఈమె పేరు రతికా రోజ్. ఈ భామ తెలుగు సినిమాల్లో నటించింది.

రతికా రోజ్.. బిగ్ బాస్ లోకి అడుగు పెట్టింది. ఇక దసరా సినిమాలోని చమ్కీలా అంగిలేసి సాంగ్ కు స్టేప్పులు వేసి ఆకట్టుకుంది. ఈమె నటిగా, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ మంచి క్రేజ్ అయితే సాధించుకుంది. రావడంతోనే నాగార్జునతో పులిహోర కలుపుతూ మంచి యాక్టివ్ గా కనిపించింది. హార్ట్ బ్రేక్ చేసింది నువ్వే అంటూ నాగార్జునకు హార్ట్ స్ట్రోక్ తెప్పించింది.
ఇక రతికా రోజ్ విషయానికి వస్తే.. ఈమె ఆంధ్రప్రదేశ్ లో జన్మించింది. ఆమె పది, ఇంటర్ చదివిన తర్వాత పై చదువుల కోసం హైదరాబాద్ వచ్చింది. ఇక్కడ రతికా గ్యాడ్యూయేషన్ పూర్తి చేసింది. అకడమిక్ ఎక్సలెన్స్ కోసం... రతిక రోజ్ నల్లమల్లా రెడ్డి ఇన్‌స్టిట్యూషన్స్‌లో చేరి.. అక్కడ ఆమె ఇంజనీరింగ్ డిగ్రీని అభ్యసించింది. అక్కడ ఉండగానే ఆమెకు నటన పట్ల ఆసక్తి కలిగింది.
ఇక నటన మీద ఆసక్తితో రతికా రోజ్ మోడలింగ్ ప్రపంచంలోకి అడుగుపెట్టింది. అలా 2020లో షకలక శంకర్ నటించిన "బొమ్మ అదిరింది దిమ్మ తిరిగింది" చిత్రంలో రతికా నటించింది. ఇక ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అంతగా ఆడలేదు కానీ.. ఈమె పాత్రకు మాత్రం మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. ఇక తదుపరి సినిమాల్లో కూడా ఆమెకు ఛాన్స్ లు వచ్చాయి.
బెల్లంకొండ గణేశ్ హీరోగా నటించిన "నేను స్టూడెంట్ సర్" చిత్రంలో ఒక పోలీసు అధికారిగా నటించింది. ఈ పాత్రలో రాతికా రోజ్ కు మంచి గుర్తింపు వచ్చింది. ఇక ఇన్ స్టాగ్రామ్ లోనూ యాక్టివ్ ఉండే ఈ భామ.. 130కె ఫాలోవర్స్ ఉన్నారు. ఎప్పుడు తన ఫోటోలతో కుర్రకారుకు ట్రీట్ ఇస్తుంది ఈ భామ.
ఇక ఇప్పుడు నటి, సోషల్ మీడియా ఇన్ ఫ్లూయిన్సర్ రతికా రోజ్ బిగ్ బాస్ లోకి అడుగుపెట్టారు. తన డ్యాన్స్, అందంతో బిగ్‌బాస్ మనసు దోచుకొన్నారు. దాంతో అతనికి బిగ్‌బాస్ తెలుగు 7 సీజన్‌లో పాల్గొనే ఆఫర్ లభించింది. సెప్టెంబర్ 3వ తేదీన ప్రారంభమయ్యే బిగ్‌బాస్ రియాలిటీ షో ద్వారా ప్రేక్షకులకు మరింత దగ్గర కాబోతున్నారు. తెలుగు ఫిల్మి బీట్ నుంచి రతికా రోజ్ కు ఆల్ ది బెస్ట్.


Click it and Unblock the Notifications











