Bigg Boss 7 Telugu రితికా కాదురా అది రతికా.. అక్షరంతో మనుషుల్ని మార్చేశారు కదరా!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 షో అంగరంగ వైభవంగా ప్రారంభం కానుంది. అయితే చాలా మంది బిగ్ బాస్ తెలుగు సీజన్ 7లో పాల్గొనే కంటెస్టెంట్స్ లిస్ట్ ఇదేనంటూ సోషల్ మీడియాలో పేర్లు వైరల్ గా మారాయి. అయితే అందులో రితికా నాయక్ రాబోతుందని వార్తలు వచ్చాయి. అంతే కాదు... బిగ్ బాస్ లోకి మరో హీరోయిన్ ఎంట్రీ.. విశ్వక్ సేన్ మరదలు అంటూ వార్తలు రాసుకొచ్చారు. అయితే బిగ్ బాస్ లోకి అడుగుపెట్టబోయేది రితికా నాయక్ కాదు... రతికా రోజ్ అని తెలుస్తోంది. ఒక్క అక్షరంతో మనిషినే మార్చేశారు చాలా మంది. ఇక రతికా రోజ్ ఎవరు అనే విషయాలు తెలుసుకుందాం.

గత కొంతకాలంగా బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 కంటెస్టెంట్స్ వీరే అంటూ సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. అందులో భాగంగానే రితికా నాయక్ బిగ్ బాస్ లోకి రాబోతుందని వార్తలు వినిపించాయి. అంతే కాదు విశ్వక్ సేన్ మరదలు, విశ్వక్ సేన్ హీరోయిన్ అంటూ వార్తలు రాసుకొచ్చారు. అయితే రితికా నాయక్ విశ్వక్ సేన్ నటించిన అశోక వనంలో అర్జున కల్యాణం సినిమాలో నటించింది. అందుకే అలా రాసుకొచ్చారు.

Actress Rathika Rose into Bigg Boss Telugu 7: Here are the personal and Professional Details

అయితే రితికా బిగ్ బాస్ లోకి అడుగుపెట్టడం లేదు. అసలు రతికా అనే అమ్మాయి రాబోతుండగా... ఒకే ఒక్క అక్షరంతో మనిషిని మార్చేసి వార్తలు రాసుకున్నారు. అయితే ఈ రతికా రోజ్ కూడా తెలుగు నటి. ఈమె ఆంధ్రప్రదేశ్ రాష్టానికి చెందినది. పైచదువుల కోసం ఆమె హైదరాబాద్ క వచ్చింది. అలా ఆమె నల్లమల్లా రెడ్డి ఇన్‌స్టిట్యూషన్స్‌లో చేరి.., అక్కడ ఆమె ఇంజనీరింగ్ డిగ్రీని అభ్యసించారు. ఆమె చదువుకునే రోజుల్లోనే నటన పట్ల ఆసక్తితో నటిగా మారింది.

Actress Rathika Rose into Bigg Boss Telugu 7: Here are the personal and Professional Details

రతికా రోజ్ విద్యను పూర్తి చేసిన తర్వాత... మోడలింగ్ ప్రపంచంలోకి అడుగుపెట్టి కెరియర్ ప్రారంభించింది. అదే సమయంలో తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేయాలని నిర్ణయించుకుంది. తన కెరీర్ ప్రారంభ దశలో, రతికా రోజ్ అనేక చిత్రాలలో నటించింది కానీ అంతగా గుర్తింపు రాలేదు. ఆమెను ఎవరూ గుర్తించలేకపోయారు.

Actress Rathika Rose into Bigg Boss Telugu 7: Here are the personal and Professional Details
2020లో షకలక శంకర్ నటించిన "బొమ్మ అదిరింది దిమ్మ తిరిగింది" చిత్రంలో ఆమె ఒక పాత్రలో నటించింది. అయితే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అంతగా ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఇక ఆమె పాత్రకు గుర్తింపు రాలేదు. ఇక బెల్లంకొండ గణేష్ హీరోగా నటించిన "నేను స్టూడెంట్ సర్" చిత్రంలో ఒక పోలీసు అధికారిగా నటించింది. ఈ పాత్రకు ఆమె మంచి క్రేజ్ తీసుకువచ్చింది.
Actress Rathika Rose into Bigg Boss Telugu 7: Here are the personal and Professional Details

ఇక ఇన్ ఇస్టాగ్రామ్ లోనూ యాక్టివ్ గా ఉండే రతికారోజ్... 130కే ఫాలోవర్స్ ఉన్నారు. ఎప్పటికప్పుడు తన అందంతో ఆకట్టుకునే ఈ భామ ఇప్పుడు బిగ్ బాస్ లోకి అడుగుపెట్టబోతుంది. ఈమెకు బిగ్‌బాస్‌ తెలుగు 7 సీజన్‌లో పాల్గొనే ఆఫర్ లభించింది. సెప్టెంబర్ 3వ తేదీన ప్రారంభమయ్యే బిగ్‌బాస్ రియాలిటీ షో ద్వారా ప్రేక్షకులకు మరింత దగ్గర కాబోతున్నారు. తెలుగు ఫిల్మి బీట్ నుంచి రతికా రోజ్ కు ఆల్ ది బెస్ట్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X