బిగ్ బాస్ లోకి జనసేన వీర మహిళ.. వైజాగ్ బ్యూటీకి బంపర్ ఆఫర్
మరో వారంలో ఆగస్ట్ రాబోతోంది.. అయినా బిగ్‌బాస్ సందడేం కనిపించడం లేదంటని తెలుగు ఆడియన్స్ హైరానా పడిపోతున్నారు. ఎన్నికలు, ఐపీఎల్, టీ 20 వరల్డ్ కప్ కూడా ముగిసిపోవడంతో జనాలు వినోదం కోసం తపించిపోతున్నారు. ఆ బిగ్‌బాస్ ఏదో త్వరగా ప్రారంభమైతే బాగుండని భావిస్తున్నారు. నిర్వాహకులు కూడా అంతే వేగంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు బుల్లితెర టాక్. బిగ్‌బాస్ 8 తెలుగు కంటెస్టెంట్స్ వీళ్లేనంటూ రకరకాల పేర్లు తెరపైకి వస్తున్నాయి. సెప్టెంబర్ మొదటి లేదా రెండో వారంలో బిగ్‌బాస్ 8 ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇప్పటికే ప్రోమో షూట్ పూర్తవ్వగా.. కంటెస్టెంట్స్ ఎంపిక శరవేగంగా జరుగుతోంది. ఫోన్లు, మెయిల్స్ తదితర లాంఛనాలు పూర్తి చేసి షార్ట్ లిస్ట్ అయినవారికి హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని స్టార్ మా ఆఫీసులో ఇంటర్వ్యూలు జరుగుతున్నాయని వినికిడి. సుమారు 200 మందికి పైగా ఫోన్ కాల్స్ రాగా.. వారిలో 70 మందిని ఇంటర్వ్యూకి పిలిచినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ 70 మందిలోనూ 30 మందిని షార్ట్ లిస్ట్ చేసి.. అనేక రకాలుగా వడపోతల అనంతరం 20 మందిని తుది జాబితాలో ఖరారు చేస్తారని తెలుస్తోంది.

ఉల్టా పల్టా అంటూ సాగిన గత సీజన్ ప్రేక్షకులకు వినోదాన్ని అందించింది. నాగ్ హోస్టింగ్‌తో పాటు నిర్వాహకులు తీసుకున్న జాగ్రత్తలే ఈ సక్సెస్‌కు కారణం. ఈసారి కూడా ఎక్కువ మంది బుల్లితెర నటీనటులు, యాంకర్స్, పోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్స్, యూట్యూబర్లు , కొందరు వివాదాస్పద వ్యక్తులు హౌస్‌లో అడుగుపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. బర్రెలక్క, కుమారి ఆంటీ, యాదమ రాజు, రీతూ చౌదరి, విష్ణుప్రియ, బుల్లెట్ భాస్కర్, పొట్టి రమేష్ తదితరుల పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. అందరిలోకి ఓ పేరు ఆసక్తికరంగా మారింది.
వైజాగ్ బ్యూటీ.. హీరోయిన్ రేఖా భోజ్‌ను బిగ్‌బాస్ 8 కోసం నిర్వాహకులు సంప్రదించగా ఆమె ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది. మాంగళ్యం, దామిని విల్లా, రంగేలా, కళ్యాణ తస్మై నమ: వంటి సినిమాలలో రేఖ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆస్తుల్ని, తను సంపాదించిన మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టి విశాఖపట్నంలో సొంతంగా స్టూడియో పెట్టుకుని కవర్ సాంగ్‌లు, వీడియో ఆల్బమ్స్ చేస్తూ రేఖ ఫేమస్ అయ్యారు. ఆమె అసలు పేరు శ్రీసుష్మ. అన్నింటిలోకి టీమిండియా ప్రపంచకప్ గెలిస్తే విశాఖ బీచ్‌లో స్ట్రీకింగ్ చేస్తానంటూ సంచలన ప్రకటన చేసి దేశవ్యాప్తంగా ఫేమస్ అయ్యింది.

ఇక పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్‌కు రేఖ వీరాభిమాని కావడంతో ఆ వైపు నుంచి కూడా ఫుల్ సపోర్ట్ గ్యారంటీ. 2024 ఏపీ ఎన్నికల్లో పవన్ తరపున పిఠాపురంలో విస్తృతంగా ప్రచారం చేసి జనసైనికులకు మరింత దగ్గరయ్యారు. తెలుగు సినిమాల్లో తెలుగు అమ్మాయిలకు అవకాశాలు దక్కడం లేదంటూ గళం విప్పిన ఆమె.. తన పేరును శ్రీసుష్మకు బదులు రేఖా భోజ్‌గా మార్చుకుంది.
ముక్కుసూటితనం, మంచి మాటకారి కావడం వంటి క్వాలిఫికేషన్స్ బిగ్‌బాస్ నిర్వాహకులకు నచ్చేశాయి. దీంతో బిగ్‌బాస్ 8కు రావాల్సిందిగా ఆహ్వానం అందిందట. ఇక్కడ ఆమెకు అవకాశం దక్కేలా గానీ జనాలకు మంచి ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రం పక్కా అని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. మరి రేఖా భోజ్‌కు బిగ్‌బాస్ 8లో కంటెస్టెంట్‌గా అవకాశం దక్కిందో లేదో తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.


Click it and Unblock the Notifications











