అతడి వల్లే జబర్ధస్త్ మానేశా.. ఛాన్స్ అడిగితే అలా చేయమన్నారు: తొలిసారి నోరు విప్పిన రీతూ చౌదరి

బుల్లితెరపై ఇప్పుడు ఎంతో మంది అమ్మాయిలు తమదైన రీతిలో అలరిస్తున్నారు. అయితే, వారిలో కొందరు మాత్రమే ప్రత్యేకం అనిపించుకుని హైలైట్ అవుతున్నారు. అందులో బోల్డు బ్యూటీ రీతూ చౌదరి ఒకరు. చాలా కాలం నుంచే టెలివిజన్ రంగంలో తనదైన మార్కును చూపిస్తోన్న ఈ చిన్నది.. ఈ మధ్యన వరుసగా అవకాశాలను సొంతం చేసుకుంటూ దూసుకుపోతోంది. అయితే, కొద్ది రోజుల క్రితం జబర్ధస్త్ నుంచి తప్పుకుంది. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో రీతూ చౌదరి దీనిపై స్పందించింది. అలాగే, సినిమాలపై క్లారిటీ ఇచ్చింది. ఆ వివరాల్లోకి వెళ్తే....

సీరియల్ నటిగా ఫేమస్
రీతూ చౌదరి ముందుగా యాంకర్‌గా తన ప్రయాణాన్ని మొదలు పెట్టింది. ఇలా ఎన్నో షోలను నడిపించింది. ఈ క్రమంలోనే 'గోరింటాకు' అనే సీరియల్‌తో నటిగా జర్నీని స్టార్ట్ చేసుకుంది. అనంతరం 'సూర్య వంశం', 'ఇంటిగుట్టు' వంటి సీరియళ్లలో నటించి హైలైట్ అయింది. ఇక, ప్రదీప్ 'పెళ్లి చూపులు' షోలో పాల్గొని రీతూ చౌదరి ఒక్కసారిగా సెన్సేషన్ అయింది.

Actress Rithu Chowdary Comments About Jabardasth and Movie Offers

జబర్ధస్త్ షోతో మరింతగా
చాలా కాలం పాటు యాంకర్‌గా, సీరియల్ నటిగా నటించి మెప్పించిన రీతూ చౌదరి.. జబర్ధస్త్ షోలోకి సైతం వచ్చింది. అందులో హైపర్ ఆది టీమ్‌లో తనదైన రీతిలో అలరించింది. దీంతో ఆమెకు ఆ షోలో వరుసగా అవకాశాలు లభించాయి. తద్వారా రీతూ చౌదరి రేంజ్ మరింతగా పెరిగింది. ఈ కారణంగానే ఈ తెలుగు పిల్లకు ఎన్నో అవకాశాలు కూడా సొంతం అయిపోయాయి.

అది మానేసి వాటిలోనే
బుల్లితెరపై తనదైన అందం, అభినయంతో అలరించిన రీతూ చౌదరి.. జబర్ధస్త్ షోలో బాగా హైలైట్ అయింది. అయితే, కొద్ది రోజుల క్రితమే ఆమె ఈ షో నుంచి తప్పుకుంది. కానీ, అప్పుడప్పుడూ కొన్ని ఈవెంట్లు చేస్తూ వచ్చింది. అలాగే, 'దావత్' అనే షోను హోస్ట్ చేసింది. ఇక, ఇప్పుడు స్టార్ మాలో ప్రసారం అవుతోన్న ఓ గేమ్ షోలో కూడా రీతూ చౌదరి భాగం అయిపోయింది.

Actress Rithu Chowdary Comments About Jabardasth and Movie Offers

ఆది వల్లే తప్పుకున్నా
వరుసగా ఆఫర్లను అందుకుంటూ దూసుకుపోతోన్న రీతూ చౌదరి తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ సందర్భంగా బుల్లితెరపై చేస్తున్న షోలకు సంబంధించిన విశేషాలతో పాటు సినిమా ఆఫర్ల గురించి తొలిసారి పెదవి విప్పింది. మరీ ముఖ్యంగా అసలు జబర్ధస్త్ షో నుంచి హైపర్ ఆది కారణంగానే తప్పుకున్నానని రీతూ అందరికీ షాక్ ఇచ్చేసింది.

అతడు లేకుండా వేస్ట్
సదరు యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడిన రీతూ చౌదరి 'జబర్ధస్త్ షో వల్ల నాకు గతంలో కంటే ఎక్కువగా పేరు వచ్చింది. అందుకు హైపర్ ఆది గారే కారణం. అయితే, ఆయన ఈ షో నుంచి తప్పుకున్న తర్వాత నాకు కూడా అందులో చేయాలని అనిపించలేదు. అందుకే దాని నుంచి బయటకు రావాల్సి వచ్చింది. ఇప్పుడు వేరే షోలు చేసుకుంటున్నాను' అని చెప్పింది.

Actress Rithu Chowdary Comments About Jabardasth and Movie Offers

సినిమా ఛాన్స్‌లపైనా
ఆ తర్వాత రీతూ చౌదరి కంటిన్యూ చేస్తూ.. 'నాకు ఇప్పుడు చాలా షోలలో అవకాశాలు వస్తున్నాయి. అలాగే, సినిమా ఛాన్స్‌లు కూడా వస్తున్నాయి. కానీ, అందులో చాలా మంది నాకోసం బోల్డ్ క్యారెక్టర్లనే ఆఫర్ చేస్తున్నారు. పైగా నువ్వు బయట బోల్డుగానే ఉంటావు కదా చెయ్ అంటున్నారు. అది నచ్చని కారణంగానే సినిమాలు చేయడం లేదు' అంటూ వివరణ ఇచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X