Bigg Boss 7 Telugu: బిగ్ బాస్‌లోకి విశ్వక్ సేన్ మరదలు.. ఊహించని విధంగా ఆఫర్

అసలేమాత్రం పరిచయం లేని కంటెంట్‌తో వచ్చినా.. తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుని నెంబర్ వన్ రియాలిటీ షోగా ఎదిగిపోయింది బిగ్ బాస్. అంతేకాదు, దేశంలోనే ఏ షోకూ రానంత రేటింగ్‌ను సొంతం చేసుకుని రికార్డులు క్రియేట్ చేసింది.

దీంతో నిర్వహకులు మరింత ఉత్సాహంతో సీజన్ల మీద సీజన్లను పూర్తి చేసుకుంటూ వస్తున్నారు. ఇలా ఇప్పుడు ఏడో సీజన్‌ను ప్రారంభించబోతున్నారు. ఈ నేపథ్యంలో ఇందులో పాల్గొనబోయే మరో కంటెస్టెంట్ పేరు బయటకు వచ్చేసింది. ఇంతకీ ఎవరా సెలెబ్రిటీ? ఆ పూర్తి వివరాలను మీరే చూడండి మరి!

Actress Ritika Nayak Likely Entry To Bigg Boss 7 Telugu

ఆదివారం నుంచే మొదలు: తెలుగులో సూపర్ సక్సెస్ అయిన బిగ్ బాస్ షో ఇప్పటికే ఆరు రెగ్యూలర్, ఒక ఓటీటీ వెర్షన్ సీజన్లు కంప్లీట్ అయ్యాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు ఏడో దాన్ని ప్లాన్ చేశారు. దీన్ని సెప్టెంబర్ 3వ తేదీ అంటే ఆదివారం నుంచి మొదలుపెడుతున్నారు. ఈ సీజన్‌ను కూడా అక్కినేని నాగార్జునే హోస్ట్ చేస్తున్నారు. దీని నుంచి వచ్చిన ప్రతి ప్రోమోకు అదిరిపోయే రెస్పాన్స్ కూడా లభించింది.

కొత్త కాన్సెప్టు.. అంచనాలు: వాస్తవానికి బిగ్ బాస్ తెలుగులో ఎప్పుడూ వచ్చినా సక్సెస్ అవుతుంది. కానీ, ఆరో సీజన్ అంతగా క్లిక్ అవలేదు. దీంతో ఇప్పుడు ఏడో దాన్ని నిర్వహకులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇందులో భాగంగానే ఈ సీజన్‌ను సరికొత్తగా 'ఉల్టాపుల్టా' అనే కాన్సెప్టుతో తీసుకు రాబోతున్నట్లు నాగార్జున వెల్లడించాడు. ఫలితంగా ఆరంభంలోనే ఈ సీజన్‌పై అంచనాలు భారీ స్థాయిలో ఏర్పడ్డాయి.

నేటి నుంచే షూట్‌ చేస్తూ: ఆదివారం నుంచే వైభవంగా మొదలు కాబోతున్న బిగ్ బాస్ ఏడో సీజన్‌కు సంబంధించి నిర్వహకులు పనులను ఇప్పటికే కంప్లీట్ చేసుకున్నారు. ముఖ్యంగా కంటెస్టెంట్లను ఉంచే హౌస్‌, స్టేజ్ పనులు కూడా పూర్తి అయిపోయాయి. శుక్రవారం, శనివారం కంటెస్టెంట్ల ఎంట్రీ పెర్ఫార్మెన్స్‌లను షూట్ చేయబోతున్నారు. దీన్ని ఆదివారం సాయంత్రం 7 గంటల నుంచి ప్రసారం చేస్తారు.

Actress Ritika Nayak Likely Entry To Bigg Boss 7 Telugu

20 మందిలో తగ్గుతారని: భారీ అంచనాల నడుమ ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ ఏడో సీజన్‌ కంటెస్టెంట్ల ఎంపిక ప్రక్రియను నిర్వహకులు ఎప్పుడో ప్రారంభించారు. కానీ, ఈ లిస్టును ఫైనల్ చేయడానికి మాత్రం చాలా సమయమే తీసుకున్నారు. ఇలా ఇప్పుడు మొత్తం 20 మందితో కూడిన ఫైనల్ లిస్టును వాళ్లు రెడీ చేశారట. అయితే, వీరిలోనూ కొందరిని తగ్గించి 17 లేదా 18 మందిని లోపలికి పంపిస్తారని టాక్.

Actress Ritika Nayak Likely Entry To Bigg Boss 7 Telugu

విశ్వక్ సేన్ హీరోయిన్‌తో: గ్రాండ్‌గా లాంచ్ కాబోతున్న బిగ్ బాస్ ఏడో సీజన్‌లో పాల్గొనే కంటెస్టెంట్లలో ఎక్కువ మందిని అమ్మాయిలనే సెలెక్ట్ చేశారని తెలిసింది. ఇందులో భాగంగానే మోడల్‌గా ఫేమస్ అయి.. విశ్వక్ సేన్ 'అశోక వనంలో అర్జున కల్యాణం' చిత్రంతో హీరోయిన్‌గా పరిచయమైన రితికా నాయక్‌ను కూడా తీసుకున్నారట. ఆమె కూడా ప్రీమియర్ ఎపిసోడ్‌లో హౌస్‌లోకి అడుగు పెట్టబోతుంది.

Actress Ritika Nayak Likely Entry To Bigg Boss 7 Telugu

అలా ఛాన్స్ పెట్టేసింది: వాస్తవానికి బిగ్ బాస్ నిర్వహకులు ముందుగా అనుకున్న లిస్టులో రితికా నాయక్ పేరు లేదు. కానీ, కొందరు లేడీ కంటెస్టెంట్లు అనివార్య కారణాలతో షోకు దూరం అయిపోయారు. దీంతో రితికా నాయక్‌ను బిగ్ బాస్ టీమ్ సంప్రదించగా ఆమె ఓకే చేసిందట. ఇదంతా ఈ రెండు మూడు రోజుల్లోనే జరిగిందని తెలిసింది. అంటే.. అనుకోకుండానే ఈమె షోలోకి అడుగు పెట్టబోతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X