శేఖర్ మాస్టర్ అవుట్.. రోజా వచ్చేసింది.. మరి నాగబాబు?

Recommended Video

Actress Roja Selvamani Makes A Comeback To Televison || Filmibeat Telugu

బుల్లి తెరపై బాగా పాపులర్ అయిన తెలుగు షోలలో జబర్దస్త్ ఒకటి. ఈ కామెడీ షోకు ఏళ్ల తరబడి విశేష ఆదరణ లభిస్తోంది. సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను, హైపర్ ఆది లాంటి నటులంతా జబర్దస్త్ వల్లే పాపులర్ అయ్యారు. ఇదిలా ఉండగా జబర్డస్త్ ఆరంభం నుంచి జడ్జీలుగా సీనియర్ హీరోయిన్ రోజా, మెగా బ్రదర్ నాగబాబు తమదైన ముద్ర వేస్తున్నారు. ఇటీవల ఆంధ్ర ప్రదేశ్ లో జరిగిన సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రోజా, నాగబాబు జబర్దస్త్ కు తాత్కాలికంగా దూరమైన సంగతి తెలిసిందే. తాజాగా జబర్దస్త్ షోకి రోజా రీ ఎంట్రీ ఇచ్చింది.

 ఎన్నికల బరిలో

ఎన్నికల బరిలో

రోజా జబర్దస్త్ షోలో జడ్జిగా కొనసాగుతూనే రాజకీయాల్లో కూడా బిజీగా ఉంది. ఆమె వైసిపి తరుపున ఇటీవల ముగిసిన ఎన్నికల్లో నగిరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన సంగతి తెలిసిందే. ఇక నాగబాబు ఎన్నికలకు కొద్దిరోజుల ముందు జనసేన పార్టీలో చేరారు. ఆయన నరసాపురం పార్లమెంట్ స్థానం నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఎన్నికలకు ప్రచారం నిర్వహించాల్సి ఉండడంతో జబర్దస్త్ షోకు తాత్కాలికంగా దూరమయ్యారు.

రోజా, నాగబాబు స్థానంలో

రోజా, నాగబాబు స్థానంలో

రోజా, నాగబాబు స్థానంలో హీరోయిన్ మీనా, శేఖర్ మాస్టర్ జబర్దస్త్ కు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. 90 దశకంలో క్రేజీ హీరోయిన్ గా మీనా టాలీవుడ్ లో టాప్ లీగ్ లో కొనసాగింది. వివాహం తర్వాత అప్పుడప్పుడూ వెండి తెరపై మీనా మెరుస్తోంది. దృశ్యం, సాక్ష్యం లాంటి చిత్రలో మీనా నటించిన సంగతి తెలిసిందే. ఇక శేఖర్ మాస్టర్ డాన్స్ కొరియోగ్రాఫర్ గా మంచి గుర్తింపు సొంతం చేసుకున్నారు.

 రోజా రీఎంట్రీ

రోజా రీఎంట్రీ

జబర్దస్త్ లో రోజా, నాగబాబుని మిస్సవుతున్నాం అనుకునే వాళ్లకు ఇక మంచి వార్త. రోజా జబర్దస్త్ కు తిరిగొచ్చారు. తదుపరి ప్రసారం కాబోయే ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోలో రోజా దర్శనం ఇచ్చారు. కానీ నాగబాబు ఇంకా రాలేదు. తదుపరి ఎపిసోడ్స్ లో నాగబాబు కూడా జాయిన్ అవుతారేమో చూడాలి. రోజా రీఎంట్రీ ఇవ్వడంతో శేఖర్ మాస్టర్ జబర్దస్త్ నుంచి తప్పుకున్నారు. ప్రస్తుతం రోజా, మీనా న్యాయ నిర్ణేతలుగా కొనసాగుతున్నారు.

ఎన్నికల్లో విజయం సాధిస్తే

ఎన్నికల్లో విజయం సాధిస్తే

ఇదిలా ఉండగా రోజా, నాగబాబు ఎన్నికల్లో విజయం సాధిస్తే జబర్దస్త్ లో కొనసాగుతారా లేదా అనేది ప్రశ్నార్థకమే. నాగబాబు మాత్రం జబర్డస్త్ ని వీడనని, రాజయాల్లో కొనసాగుతూనే జబర్దస్త్ లో కూడా పాల్గొంటానని ఇటీవల క్లారిటీ ఇచ్చారు. ఇక వైసిపి అధికారంలోకి వచ్చి, రోజా నగిరి నుంచి విజయం సాధిస్తే ఆమెకు పార్టీలో భాద్యతలు పెరిగే అవకాశం ఉంది. అలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు జబర్దస్త్ పట్ల రోజా ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X