Sadha: పెళ్లిపై హీరోయిన్ సదా క్లారిటీ.. ఎప్పుడంటే..!
Heroine Sadha: ప్రముఖ హీరోయిన్ సదా గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. నితిన్ హీరోగా వచ్చిన జయం సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన సదా, తొలి సినిమాతోనే తన అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. 'ముఖ్యంగా వెళ్లవయ్యా... వెళ్లు' అనే డైలాగ్ ఆమెకు విపరీతమైన పాపులారిటీ తెచ్చిపెట్టింది. ఆ తర్వాత ఎన్టీఆర్, ఉదయ్ కిరణ్, బాలకృష్ణ వంటి స్టార్ హీరోలతో నటిస్తూ కుర్రాళ్ల కలల రాణిగా మారింది.
అయితే కొన్నేళ్ల తర్వాత వరుస ఫెయిల్యూర్స్ కారణంగా ఆఫర్స్ తగ్గడంతో సదా సినిమాలకు దూరమైంది. ప్రస్తుతం సింగిల్ గా జీవితం గడుపుతూ, బుల్లితెరపై రియాల్టీ షోలు, డాన్స్ షోలలో జడ్జిగా కనిపిస్తోంది. దాదాపు నాలుగు పదుల వయసుకు చేరువవుతున్నప్పటికీ, సింగిల్ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తోంది. తాజాగా పెళ్లిపై చేసిన కామెంట్స్ నెట్టింట్లో తెగవైరలవుతున్నాయి. ఇంతకీ ఏమన్నారంటే?

అసలేం జరిగిందంటే?
బిగ్‌బాస్ సీజన్ 9 ముగిసిన వెంటనే అదే టైమ్‌స్లాట్‌లో ప్రారంభమైన ప్రోగ్రామ్ బీబీ జోడీ సీజన్ 2. ఈ షోకు రోజురోజుకీ ప్రేక్షకుల్లో మంచి ఆదరణ సంపాదిస్తోంది. బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్లు జోడీలుగా మారి డాన్స్ పోటీల్లో పాల్గొనడం, వాటికి తోడు వినోదాత్మకమైన టాస్కులు, జడ్జీల కామెంట్స్ షోకు ప్రత్యేక ఆకర్షణగా మారాయి. ఈ షోకుశేఖర్ మాస్టర్, సదా, శ్రీదేవి విజయ్‌కుమార్ జడ్జీలుగా వ్యవహరిస్తుండగా, యాంకర్‌గా ప్రదీప్ మాచిరాజు తన సెటైరికల్ కామెంట్స్‌తో నవ్వులు పూయిస్తున్నాడు.
తాజాగా విడుదలైన లేటెస్ట్ ప్రోమోలో హీరోయిన్ సదా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. సీజన్ 2లో భాగంగా 'డైరెక్టర్స్ స్పెషల్' అనే కాన్సెప్ట్‌తో డాన్స్ పెర్ఫార్మెన్స్‌లు సాగాయి. ఈ కాన్సెప్ట్‌లో భాగంగా జడ్జీలందరూ స్టేజ్‌పైకి రావడం జరిగింది. ఈ సందర్భంగా హీరోయిన్ శ్రీదేవి నార్మల్ డ్రెస్సింగ్‌లో కనిపించగా, సదా మాత్రం పెళ్లికూతురు తరహాలో గ్రాండ్‌గా రెడీ కావడం అందరి దృష్టిని ఆకర్షించింది.
దీంతో యాంకర్ ప్రదీప్ తనదైన స్టైల్‌లో సెటైర్ వేయడం మొదలుపెట్టాడు. 'మేడం... ఈరోజు పెళ్లికూతురు థీమ్ ఉందా?' అంటూ అడగడంతో సదా ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. అదే సమయంలో పక్కనే ఉన్న శ్రీదేవి వెంటనే స్పందిస్తూ 'లాస్ట్ టైం డబుల్ ఎస్ వేశారు కదా' అంటూ సరదాగా కామెంట్ చేసింది. వెంటనే ప్రదీప్'ఈ వీక్ ఏకంగా పెళ్లికూతురు రెడీ వచ్చారు' అంటూ సెటైర్ వేశాడు. ఈ కామెంట్లకు స్పందించిన సదా సరదాగా 'నెక్స్ట్ వీక్ నా పెళ్లి ఇక్కడే' అంటూ నోరు జారింది. దీంతో స్టేజ్‌పై ఒక్కసారిగా నవ్వుల పండుగ మొదలైంది.
యాంకర్ ప్రదీప్ 'ఏంటి నిజంగానా?' అంటూ ఆశ్చర్యంగా ప్రశ్నించగా, సదా వెంటనే తాను జస్ట్ జోక్ చేశానని, అందరూ చాలా స్పీడ్‌గా వెళ్తున్నారని తనను తాను సమర్థించుకోవడానికి ప్రయత్నించింది. అదే సమయంలో శేఖర్ మాస్టర్ ఎంటర్ ఇచ్చి 'నువ్వు అంత స్పీడ్‌గా మాట్లాడతావు కాబట్టే... ఇతను కూడా అంత స్పీడ్‌గా ఆలోచించాడు'అంటూ ఫన్నీ కామెంట్ చేసి నవ్వులు పూయించాడు. ఇప్పుడు ఈ ప్రోమోలోని సదా కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
ముఖ్యంగా 'నెక్స్ట్ వీక్ నా పెళ్లి' అన్న డైలాగ్‌ను పట్టుకుని నెటిజన్స్ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. కొందరు 'సదా పెళ్లి త్వరలోనే' అంటూ సరదాగా స్పందిస్తుండగా, మరికొందరు 'ఇది జస్ట్ ఫన్ మాత్రమే' అంటూ అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే గతంలోనూ పెళ్లి, సింగిల్ లైఫ్ గురించి సదా చేసిన వ్యాఖ్యలు చర్చకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి బీబీ జోడీ వేదికగా ఆమె పెళ్లి మేటర్ హాట్ టాపిక్‌గా మారింది.ఇక సదా నిజంగా ఎప్పుడు పెళ్లి పీటలెక్కుతుందో, లేదా సింగిల్ లైఫ్‌ను అలాగే కొనసాగిస్తుందో అనేది వేచిచూడాలి. కానీ ప్రస్తుతానికి మాత్రం ఆమె చేసిన ఈ కామెంట్స్ వైరలవుతున్నాయి.


Click it and Unblock the Notifications











