మెహబాబ్, శ్రీ సత్య, మెహబూబ్ సాండ్​విచ్ డ్యాన్స్.. బీబీ జోడీ షోలో రచ్చ

బుల్లితెర పాపులర్ కామెడీ షో జబర్దస్త్ ద్వారా క్రేజ్ సంపాందించుకున్న కమెడియన్లలో అవినాష్ ఒకరు. తనైదన కామెడీతో ఆద్యం నవ్వించే అవినాష్ జబర్దస్త్ షోతో మంచి పేరు తెచ్చుకున్నాడు. అనంతరం బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చిన అవినాష్ మరింత పాపులారిటీ సాధించాడు. బిగ్ బాస్ తెలుగు 4 సీజన్ లో జోకర్ గా వైల్డ్ కార్డుతో ఎంట్రీ ఇచ్చిన అవినాష్ తనదైన కామెడీతో ఆకట్టుకున్నాడు. బిగ్ బాస్ తర్వాత పలు షోలలో కామెడీ చేస్తూనే బీబీ జోడీ అనే రియాలిటీ డ్యాన్స్ షోలో కంటెస్టెంట్ గా పార్టిస్ పేట్ చేస్తున్నాడు. ఈ క్రమంలో స్టార్ హీరోయిన్ అవినాష్ కాళ్లు మొక్కి షాక్ ఇచ్చారు.

సెలబ్రిటీ షోగా..

సెలబ్రిటీ షోగా..

సెలబ్రిటీలకు అడ్డాగా ప్రారంభమైన బిగ్ బాస్ రియాలిటీ షోలో తొలుత పాపులర్ నటీనటులే ఎంట్రీ ఇచ్చారు. తర్వాతి కాలంలో సీజన్ లు పెరుగుతున్న కొద్దీ సీరియల్ నటినటులు, సోషల్ మీడియా స్టార్స్, రివ్యూవర్స్, యాంకర్స్, జర్నలిస్ట్స్ ఇలా రకరకాల రంగంలో రాణించిన వ్యక్తులను కంటెస్టెంట్లుగా తీసుకొచ్చారు. ఇక వాళ్లందరు బిగ్ బాస్ షోలో అడుగుపెట్టాక ఉదయం పూట డ్యాన్స్ చేస్తూ అలరించేవారు. ఈ కంటెస్టెంట్ల లోపల మంచి డ్యాన్సర్స్ దాగి ఉండటంతో వారందరిచేత బీబీ జోడీలో డ్యాన్స్ చేయిస్తున్నారు మేకర్స్.

జడ్జ్ లుగా వాళ్లు..

జడ్జ్ లుగా వాళ్లు..

బీబీ జోడీ డ్యాన్స్ రియాలిటీ షోలో కమెడియన్ అవినాష్-యాంకర్ అరియానా గ్లోరి, అర్జున్ కల్యాణ్-వాసంతి కృష్ణన్, అఖిల్ సార్థక్-తేజస్వి మదివాడ, ఆర్జే సూర్య-ఫైమా, రవికృష్ణ-భాను, ఆర్జే చైతూ-ఆర్జే కాజల్, మెహబూబ్-శ్రీ సత్య, కౌశల్-అభినయ శ్రీ మొత్తంగా 8 జోడీలుగా పార్టిస్ పేట్ చేస్తున్నారు. ఈ షోకి బిగ్ బాస్ తెలుగు మూడో సీజన్ రన్నరప్, బుల్లితెర రాములమ్మ శ్రీముఖి యాంకర్ గా వ్యవహరించనుంది. అలాగే అలనాటి స్టార్ హీరోయిన్ రాధతోపాటు గ్లామరస్ హీరోయిన్ సదా, ప్రముఖ కొరియోగ్రాఫర్ తరుణ్ మాస్టర్ జడ్జ్ లుగా ఉన్నారు.

రెగ్యులర్ గా కాకుండా..

రెగ్యులర్ గా కాకుండా..

ఇక బిగ్ బాస్ కంటెస్టెంట్లందరితో నిర్వహిస్తున్న ఈ బీబీ జోడీ డ్యాన్స్ షోను ప్రతి శని, ఆది వారాల్లో ప్రసారం చేస్తున్నారు. ఈ ఎపిసోడ్స్ కు సంబంధించిన ప్రోమోలను విడుదల చేస్తూ ఎపిసోడ్స్ పై క్యూరియాసిటీ క్రియేట్ చేస్తున్నారు మేకర్స్. అందులో భాగంగానే ఈవారం వచ్చే ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. అయితే రెగ్యులర్ జోడీ అంటే ఇద్దరు ఉంటారు. కానీ ఈసారి ఏకంగా ముగ్గురు కలిసి డ్యాన్స్ పర్ఫామెన్స్ ఇవ్వనున్నారు.

అప్రిషీయేషన్స్..

అప్రిషీయేషన్స్..

ముగ్గురు కంటెస్టెంట్స్ కలిసి ఇస్తున్న డ్యాన్స్ కు తీన్ మార్ రౌండ్ అని పేరు పెట్టారు. ఈ తీన్ మార్ రౌండ్ లో కొత్తగా బ్రహ్మముడి సీరియల్ హీరో మానస్, యాంకర్ నేహా చౌదరి, బిగ్ బాస్ తెలుగు ఓటీటీ విన్నర్ బిందు మాధవి తదితరులు ఎంట్రీ ఇచ్చారు. వీరిలో కౌశల్, అఖిల్, అవినాష్, వాసంతి, ఫైమా, మెహబూబ్ డ్యాన్స్ పర్ఫామెన్సులకు మంచి అప్రిషియేషన్స్ వచ్చాయి.

 సాండ్ విచ్ డ్యాన్స్..

సాండ్ విచ్ డ్యాన్స్..


మెహబాబ్, శ్రీ సత్య, మెహబూబ్ లవర్ అని ప్రచారంలో ఉన్న శ్వేతా నాయుడు ముగ్గురు కలిసి హాట్ గా డ్యాన్స్ చేశారు. మెహబూబ్ కి కింద ఒకరు పైన ఒకరు ఉండి డ్యాన్స్ చేయడంతో 'మొదటి సారి సాండ్ విచ్ డ్యాన్స్ అనేది' అంటూ హాట్ కామెంట్స్ చేశారు తరుణ్ మాస్టర్. వీళ్ల పర్ఫామెన్స్ కు జడ్జస్ అందరూ తెగ ఎంజాయ్ చేశారు. హీరోయిన్ సదా అయితే అరుస్తూ మరి ఎంకరేజ్ చేసింది. అనంతరం వాసంతి, అర్జున్ కల్యాణ్ టెర్రిఫిక్ డ్యాన్స్ కు మెస్మరైజ్ అయ్యారు.

అవినాష్ కాళ్లు పట్టుకుని..

అవినాష్ కాళ్లు పట్టుకుని..

ఈ క్రమంలోనే అవినాష్, అరియానా గ్లోరి, అమర్ దీప్ డ్యాన్స్ పర్ఫామ్ చేశారు. ఇందులో అవినాష్ ట్రాన్సెంజడర్ పాత్ర చేశాడు. ఈ డ్యాన్స్ కొంచెం ఎమోషనల్ గా సాగింది. అవినాష్ యాక్టింగ్ కు జడ్జస్ అందరూ ఫిదా అవ్వడమే కాకుండా సీట్లో కూర్చోనే కన్నీళ్లు పెట్టుకున్నారు. నాకు అయితే గుండె ఇలా పగులగొట్టినట్లు అనిపించింది అని చెబుతూ స్టేజీపైకి వచ్చి అవినాష్ కాళ్లు పట్టుకుంది ఒకప్పటి స్టార్ హీరోయిన్ సదా. అనంతరం అవినాష్ ను హగ్ చేసుకుంది. తర్వాత నేను ఎన్నో షోలు చూశాను కానీ ఈ క్యారెక్టర్ ని ఇలా ఎవ్వరూ చూపించలేదు అని అవినాష్ ను పొగిడింది.

అలా ఎవరికీ వస్తుంది..

అలా ఎవరికీ వస్తుంది..


అనంతరం సీనియర్ హీరోయిన్ రాధ మాట్లాడుతూ.. నేను ఒక ట్రాన్సెంజడర్ వాళ్ల ఫంక్షన్ కి వెళ్లాను. నేను అక్కడ ఎలాంటి వాళ్లను చూశాను అంటే.. నేను ఒక ఆడదాన్ని, నేను వాళ్లమీదికి నథింగ్ అని అనిపించింది. ఎందుకంటే వారిలో అబ్బాయిల స్ట్రెంత్, అమ్మాయిల హార్ట్ ఉంటుంది. అలా ఎవరికీ వస్తుంది అని చెప్పారు. ఇది తీన్ మార్ కా తడ్కా కాదు.. సింగిల్ మార్ కా తడ్కా అని తరుణ్ మాస్టర్ అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X