అవినాష్ ఫుల్ రొమాంటిక్.. ఆయన లాంటి మొగుడు కావాలి.. మనసులో మాట చెప్పేసిన హీరోయిన్!

బుల్లితెర పాపులర్ కామెడీ షో జబర్దస్త్ ద్వారా క్రేజ్ సంపాందించుకున్న కమెడియన్లలో అవినాష్ ఒకరు. ఎంతోమందిని తనైదన కామెడీతో నవ్వించే అవినాష్ జబర్దస్త్ షో ద్వారా కొన్నాళ్లపాటు హాయిగా సాగింది. అనంతరం బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చిన అవినాష్ మరింత పాపులారిటీ సాధించాడు. బిగ్ బాస్ తెలుగు 4 సీజన్ లో జోకర్ గా వైల్డ్ కార్డుతో ఎంట్రీ ఇచ్చిన అవినాష్ తనదైన కామెడీతో ఆకట్టుకున్నాడు.

అలాగే హౌజ్ లో అమ్మాయిలను ఫ్లర్ట్ చేస్తూ కామెడీ చేశాడు. పలు షోలలో కామెడీ చేస్తూనే బీబీ జోడీ అనే రియాలిటీ డ్యాన్స్ షోలో కంటెస్టెంట్ గా పార్టిస్ పేట్ చేస్తున్నాడు. ఈ క్రమంలో అవినాష్ వంటి భర్త కావాలని అందరి ముందు తన మనసులోని మాట బయట పెట్టింది బ్యూటిఫుల్ హీరోయిన్.

జబర్దస్త్ ద్వారా పాపులర్..

జబర్దస్త్ ద్వారా పాపులర్..

మొదట జబర్దస్త్ కామెడీ షో ద్వారా తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ ను అందుకున్నాడు అవినాష్. అయితే అతన్ని ఎక్కువగా షోలలో ముక్కు అవినాష్ అంటూ కామెడీ చేస్తారు. జబర్దస్త్ తర్వాత కొన్ని సినిమాల్లో కూడా నటించాడు అవినాష్. అయితే సినిమాల్లో ఎంత ప్రయత్నం చేసిన కూడా అతని స్థాయి ఒక లెవెల్లోనే ఆగిపోయింది. ఇక ఎలాగైనా తన క్రేజ్ ను మరింత పెంచుకోవాలని అవినాష్ ప్రయత్నాలు చేశాడు.

వైల్డ్ కార్డ్ ద్వారా బిగ్ బాస్ లోకి..

వైల్డ్ కార్డ్ ద్వారా బిగ్ బాస్ లోకి..

అవినాష్ ప్రయత్నాల్లో భాగంగానే బిగ్ బాస్ హౌస్ తెలుగు సీజన్ 4లో ఛాన్స్ అందుకున్నాడు. బిగ్ బాస్ అవకాశం రాగానే వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చి మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. అయితే హౌజ్ లో ఎక్కువగా యాంకర్ అరియానా గ్లోరితో చనువుగా ఉండేవాడు అవినాష్. వీళ్లిద్దరు ఉన్న క్లోజ్ నెస్ చూసి అరియానా, అవినాష్ మధ్య ఏదో నడుస్తుందని రూమర్స్ తెగ వచ్చాయి. అయితే అవన్నీ నిజం కాదని, అవినాష్ పై తనకు ఎలాంటి ఫీలింగ్స్ లేవని షోలోనే గట్టిగా చెప్పింది అరియానా.

బీబీ జోడీలో అవినాష్..

బీబీ జోడీలో అవినాష్..

ఇక బిగ్ బాస్ అనంతరం అవినాష్ లైఫ్ ఒక్కసారిగా మారిపోయింది. భారీగా ఆదాయం అందుకోవడమే కాకుండా సొంతంగా ఓ ప్రత్యేకమైన ఇల్లు కూడా కట్టుకున్నాడు. ప్రస్తుతం కొన్ని షోలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఆహా వేదిక ప్రసారం అవుతున్న కామెడీ స్టాక్ ఎక్స్చేంజ్ లో తనదైన కామెడీతో నవ్వించే ప్రయత్నం చేస్తున్నాడు అవినాష్. అలాగే బీబీ జోడీ అనే రియాలిటీ డ్యాన్స్ షోలో కూడా పార్టిస్ పేట్ చేస్తున్నాడు.

జడ్జ్ గా గ్లామరస్ బ్యూటి..

జడ్జ్ గా గ్లామరస్ బ్యూటి..

బీబీ జోడీ డ్యాన్స్ రియాలిటీ షోలో అవినాష్ కు జోడీగా యాంకర్ అరియానా గ్లోరి ఉండగా.. అర్జున్ కల్యాణ్-వాసంతి కృష్ణన్, అఖిల్ సార్థక్-తేజస్వి మదివాడ, ఆర్జే సూర్య-ఫైమా, రవికృష్ణ-భాను, రోల్ రైడా-ఇనయా సుల్తానా, ఆర్జే చేతూ-ఆర్జే కాజల్, మెహబూబ్-శ్రీ సత్య ఉన్నారు. ఈ షోకి బిగ్ బాస్ తెలుగు మూడో సీజన్ రన్నరప్, బుల్లితెర రాములమ్మ శ్రీముఖి యాంకర్ గా వ్యవహరించనుంది. అలాగే అలనాటి స్టార్ హీరోయిన్ రాధతోపాటు గ్లామరస్ హీరోయిన్ సదా, ప్రముఖ కొరియోగ్రాఫర్ తరుణ్ మాస్టార్ జడ్జ్ లుగా ఉన్నారు.

కొరియోగ్రాఫర్స్ రౌండ్..

కొరియోగ్రాఫర్స్ రౌండ్..

బిగ్ బాస్ కంటెస్టెంట్లందరితో నిర్వహిస్తున్న ఈ బీబీ జోడీ డ్యాన్స్ షోను ప్రతి శని, ఆది వారాల్లో ప్రసారం చేస్తున్నారు. ఈ ఎపిసోడ్స్ కు సంబంధించిన ప్రోమోలను విడుదల చేస్తూ ఎపిసోడ్స్ పై క్యూరియాసిటీ పెంచేస్తున్నారు మేకర్స్. అందులో భాగంగానే తాజాగా తర్వాత వచ్చే ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. ఈ ప్రోమోలో కొరియోగ్రాఫర్స్ రౌండ్ లో భాగంగా జోడీలంతా తమ డ్యాన్స్ లతో ఆకట్టుకున్నారు.

అవినాష్ లాంటి మొగుడు కావాలి..

అవినాష్ లాంటి మొగుడు కావాలి..

కొరియోగ్రాఫర్స్ స్పెషల్ రౌండ్ లో నెల్లూరి నెరజాన పాటకు అవినాష్ అండ్ అరియానా గ్లోరి తమ డ్యాన్స్ తో మెస్మరైజ్ చేశారు. ఈ డ్యాన్స్ లో వాళ్ల రొమాంటిక్ మూమెంట్స్, రొమాంటిక్ ఎక్స్ ప్రెషన్స్ తో హీట్ పెంచేశాయి. వారి పెర్ఫామెన్స్ కు తరుణ్ మాస్టర్ పేపర్ చింపి కాంప్లిమెంట్ ఇస్తే.. "అంటే ఏదైనా సరే.. మొగుడు మాత్రం ఇలాంటి వాడే కావాలి" అని అవినాష్ ను చూపించింది బ్యూటిఫుల్ హీరోయిన్ సదా. దీంతో జడ్జ్ తో పాటు అందరూ షాక్ అయ్యారు.

పెళ్లయిన పదేళ్ల తర్వాత..

పెళ్లయిన పదేళ్ల తర్వాత..

అనంతరం స్టేజీపైకి వచ్చిన రాధ.. "మీ ఇద్దరి కెమిస్ట్రీ ఎలా ఉందంటే. పెళ్లయిన 10 ఏళ్ల తర్వాత కూడా ఒక హస్బండ్ వైఫ్ ఉన్నట్లు ఉన్నారు. ఐ లవ్ ఇట్" అని చెప్పి అరియానాను మెచ్చుకున్నారు. దీంతో రాధ కాళ్లకు నమస్కారిస్తూ ఆశీర్వాదం తీసుకుంది బ్యూటిఫుల్ అరియానా గ్లోరి. ఆ తర్వాత రాధ, సదా మధ్యలో ఉండి అదే పాటకు డ్యాన్స్ చేశాడు అవినాష్. ఇలా ముగ్గురు కలిసి నెల్లూరి నెరజాన పాటకు డ్యాన్స్ చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X