ఒక్క రూపాయితోనే హీరోయిన్ సంగీత...పండుగ

By Srikanya

Sangeetha
హైదరాబాద్ : మాజీలు అయిపోతున్న హీరోయిన్స్ కు బుల్లితెర అడ్డాగా మారుతోంది. ఇప్పటికే పేరున్న హీరోయిన్స్ అందరూ టీవికి షిప్ట్ అయ్యారు. తాజాగా సంగీత కూడా ఆ లిస్ట్ లోకి చేరింది. కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన 'ఖడ్గం'లో 'ఒకే ఒక్క ఛాన్స్' అంటూ కుర్రకారు గుండెల్ని పిండేసిన ముద్దుగుమ్మ సంగీత బుల్లితెరపై అడుగుపెడుతోంది. తెలుగు తెరపై హీరోయిన్స్ గా వెలుగులు విరజిమ్మిన తారలతో రోజ, ఖుష్బూ, రాశి వంటి వంటి వాళ్లు ఇప్పటికే పలు కార్యక్రమాలతో బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్నారు. '

నవ్వుకి నవ్వు, డబ్బుకి డబ్బుని కలగలిపి 'బిందాస్' పేరుతో జీ తెలుగు మరో సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ గేమ్ షో ని సంగీత నిర్వహించనుంది. ఈనెల 6నుంచి ఈ కార్యక్రమం ప్రసారం కానుంది. ప్రస్తుతం ప్రసారమవుతున్న గేమ్‌షోలలోనే విభిన్నతనీ, విలక్షణతనీ ప్రదర్శిస్తూ ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా 'బిందాస్' రూపొందిందనీ, ఈ కార్యక్రమంలో వెండితెర, బుల్లితెర నటీనటులు పాల్గొని ఆనందాన్ని పొందుతూ ప్రేక్షకులకు వినోదాన్ని పంచనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

ఈ కార్యక్రమం మిగతా కార్యక్రమాలకన్నా విభిన్నంగా ప్రతి రౌండు కేవలం ఒకే ఒక్క రూపాయితో మొదలై, రౌండు ముగిసేసరికి ప్రతి ఒక్కరూ లక్ష రూపాయలు గెలుపొందే అరుదైన అవకాశాన్ని కల్పిస్తుంది. ప్రతి ఎపిసోడ్‌లోనూ ముగ్గురు అమ్మాయిలు, ముగ్గురు అబ్బాయిలు కలిసి మూడు జంటలుగా పాల్గొంటారు. 'బిందాస్' కార్యక్రమం అనుక్షణం ఉత్కంఠను రేకెత్తిస్తూ ఆద్యంతం వినోదాన్ని అందిస్తూ ప్రేక్షకుల్ని ఆకట్టుకోనున్నదని నిర్వాహకులు వెల్లడించారు. ఈ కార్యక్ర మం ప్రతి బుధవారం రాత్రి 9.30 గం.లకు ప్రేక్షకులకు కనువిందు చేయనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X