twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అది చాలా నీచమైన పాత్ర, దర్శకుడిని తిట్టేశా... అందుకే ఒప్పుకున్నా: హీరోయిన్ సంగీత

    |

    'ఖడ్గం' మూవీలో ''ఒక్క ఛాన్స్.. ఒకే ఒక్క ఛాన్స్'' డైలాగుతో పాపులర్ అయిన నటి సంగీత తాజాగా అలీతో సరదాగా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె నుంచి అలీ పలు ఆసక్తికర విషయాలు రాబట్టారు. ఈ సందర్భంగా ఆమె తన పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్‌కు సంబంధించిన విషయాలు రాబట్టారు.

    మా తాత తమిళంలో పెద్ద ప్రొడ్యూసర్. ఎంజీఆర్, శివాజీ గణేశన్‌తో 20 సినిమాలు చేశారు. మాకు సినిమా ఒక థియేటర్, డబ్బింగ్ స్టూడియో ఉంది. మా అమ్మ చాలా అందంగా ఉంటారు. ఎంజీఆర్ వాళ్లు వచ్చి అమ్మని ఒక సినిమాకు హీరోయిన్‌గా అడిగారు. అయితే తాతయ్య ఒప్పుకోలేదు. వెంటనే 16 ఏళ్లకే పెళ్లి చేశారని... సంగీత తెలిపారు.

    నాకు సినిమాల్లోకి రావడం ఇష్టం లేదు

    నాకు సినిమాల్లోకి రావడం ఇష్టం లేదు

    హీరోయిన్ అవ్వాలనేది మా అమ్మ డ్రీమ్ అనుకుంటాను. అందుకే నన్ను హీరోయిన్‌గా చేసింది. కానీ నాకు సినిమా మీద అస్సలు ఇంట్రస్టు లేదు. బాగా చదువుకు కోవాలని, విదేశాలకు వెళ్లాలని ఉండేది. కానీ మా అమ్మ వల్ల సినిమాల్లోకి వచ్చినట్లు సంగీత తెలిపారు.

    అప్పుడు నిజంగా నా పరిస్థితి ‘ఒక్క ఛాన్స్' అనే విధంగా ఉండేది

    అప్పుడు నిజంగా నా పరిస్థితి ‘ఒక్క ఛాన్స్' అనే విధంగా ఉండేది

    మొదట్లో నేను చేసిన సినిమాలన్నీ ప్లాప్ అవుతూ వచ్చాయి. తెలుగు, తమిళం, కన్నడలో అన్ని చోట్లా అదే పరిస్థితి. నాకు సినిమా ఇండస్ట్రీ సరైంది కాదు అనిపించింది. ఆ సమయంలోనే కృష్ణ వంశీగారు పిలిచి ఖడ్గం ఆఫర్ ఇచ్చారు. అప్పుడు నిజంగా నా పరిస్థితి ‘ఒక్క ఛాన్స్' అనే విధంగా ఉండేది. అది నా మనసులో నుంచి వచ్చింది కాబట్టే ఆ సీన్ బాగా పాపులర్ అయింది. సినిమా ఇండస్ట్రీలో ఉన్న చీకటి కోణం చూపించే పాత్ర కావడంతో చాలా మంది హీరోయిన్లు ఆ పాత్ర రిజెక్ట్ చేశారని తెలిసిందని... సంగీత తెలిపారు.

    లవ్ మ్యారేజ్, మా అమ్మకు ఆ ఛాన్స్ ఇవ్వలేదు

    లవ్ మ్యారేజ్, మా అమ్మకు ఆ ఛాన్స్ ఇవ్వలేదు

    నాది లవ్ మ్యారేజ్. మా అమ్మగారికి నేను చేసుకునే పెళ్లి ఇష్టమా? లేదా? అని నిర్ణయించే ఛాన్స్ ఇవ్వలేదు. ఎందుకంటే అప్పటికే నా వయసు 29 సంవత్సరాలు. అందుకే నా జీవిత భాగస్వామిని నేనే వెతుక్కున్నట్లు సంగీత తెలిపారు.

    అది చాలా నీచమైన పాత్ర

    అది చాలా నీచమైన పాత్ర

    ఒకసారి నా వద్దకు భిన్నమైన కథ వచ్చింది. తప్పుడు రిలేషన్ చూపించే సినిమా. ఒక వదిన తన మరిది మీద ఆశ పడుతుంది. మన సంస్కృతిలో అది చాలా తప్పు. డైరెక్టర్ వచ్చి చెప్పగానే కోపం వచ్చింది. ఏం మాట్లాడుతున్నారు సర్... ఇలాంటి రిలేషన్ షిప్స్ ఎక్కడా ఉండవు, మీరు ఎలా చూపిస్తారు? అని తిట్టేశాను. ఆయన వెంటనే ఇది నా రియల్ లైఫ్ స్టోరీ అని చెప్పడంతో షాకయ్యాను. నాకు ఆలోచించడానికి సమయం కావాలని అడిగాను. నెగెటివ్ రోల్ అయితే చేయడానికి సందేహించే దాన్ని కాదు, కానీ అది చాలా నీచమైన నెగెటివ్ రోల్.... అని సంగీత గుర్తు చేసుకున్నారు.

    అందుకే ఆ పాత్ర చేయడానికి ఒప్పుకున్నాను

    అందుకే ఆ పాత్ర చేయడానికి ఒప్పుకున్నాను

    ఆ తరువాత ఒక సైకియాట్రిస్ట్‌ను కలినపుడు కొంత మంది నేరస్తుల గురించి, నేరస్వాభావం కలిగిన వారి గురించి తెలుసుకున్నాను. అలా ఆలోచించే మనుషులు కూడా ఉంటారని అర్థమైంది. ఇలాంటివి సినిమాల ద్వారా పబ్లిక్‌కు చూపించడం మంచిదేనా? అని అడిగినపుడు మనం దీన్ని మంచి విషయంగా చూపించడం లేదు కదా... నెగెటివ్ గానే చూపిస్తున్నాం కాబట్టి ప్రజల్లో ఎవేర్‌నెస్‌లా ఉంటుంది, నువ్వు చెయ్యి, ఎందుకు రిజక్ట్ చేయడం అని చెప్పడంతో ఒప్పుకన్నాను. ఆ మూవీ తమిళంలో పెద్ద హిట్టయిందని సంగీత తెలిపారు.

    English summary
    Actress Sangeetha revealed interesting facts about her life in Alitho Saradaga show. Sangeetha is an Indian film actress, model and female playback singer. She is known as Rasika in Malayalam movie industry. Making her acting debut in the mid-1990s, she is best known for her performances in the films Khadgam, Pithamagan, Uyir and Dhanam.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X