Bigg Boss ఫేక్ షో.. ప్రజలను పిచ్చోళ్లను చేస్తున్నారు.. డబ్బులిచ్చి కొంటారంటూ సరయు!
అసాధారణ రెస్పాన్స్‌తో తెచ్చుకుంది బుల్లితెర రియాలిటీ షో బిగ్‌బాస్. ఇప్పటి వరకు 6 సీజన్లను ఎంతో విజయవంతంగా నడిపించి ప్రేక్షకుల మన్ననలు పొందింది. అయితే ఈ షోకి ఆదరణ ఎంతుందో.. విమర్శలు కూడా అదే స్థాయిలో ఉంటాయి. ఈ షోపై ఇదివరకు చాలా మంది ప్రముఖులు విమర్శలు గుప్పించారు.
కానీ, అందులో పార్టిస్ పేట్ చేసిన కంటెస్టెంట్స్ మాత్రం నెగెటివ్ గా మాట్లాడింది చాలా తక్కువ. కానీ, తాజాగా బిగ్ బాస్, 7 ఆర్ట్స్ ఫేమ్ సరయు (Sarayu Roy) బిగ్ బాస్ లో జరిగే వ్యవహారాలపై మొత్తం కక్కేసింది. అదొక ఫేక్ షో అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది.

క్యూరియాసిటీ: మళ్లీ బిగ్ బాస్ (Bigg Boss) సందడి నెలకొననుంది. త్వరలో ప్రారంభం కానున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ప్రోమోను ఇదివరకే విడుదల చేశారు. ఇటీవల నాగార్జునే హోస్ట్ అన్నట్లుగా క్లారిటీ ఇస్తూ కొత్త వీడియో ఒకటి విడుదల చేశారు. ఇందులో "కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్" అంటూ సీజన్ 7కి మీనింగ్ వచ్చేలా క్యూరియాసిటీ పెంచేశారు.
ముందే ప్రసారం: ఈ బిగ్ బాస్ రియాలిటీ షో 7వ సీజన్ ను జూలై నెలాఖరునా, లేదా ఆగస్టు ఫస్ట్ వీక్ లో ప్రారంభిస్తారని టాక్ అయితే నడుస్తోంది. కానీ, ఈ బిగ్ బాస్ షో ప్రతీ టీవీ సీజన్ ను సాధారణంగా సెప్టెంబర్ మొదటి వారంలోనే ప్రసారం అవుతుంది. మిగతా సీజన్ల కంటే భిన్నంగా ఏడో సీజన్ ను ముందే ప్రసారం చేయనున్నారని తెలుస్తోంది. మరి ఏమవుతుందనేది క్లారిటీ లేదు.
స్టార్ట్ అయ్యేదాకా: ఇక బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఎవరనేది ఎప్పుడూ హాట్ టాపిక్ గానే ఉంటుంది. ఇప్పుటికే కంటెస్టెంట్స్ సెలెక్ట్ అయిపోయారని టాక్. వారిలో క్రికెటర్, రియల్ లైఫ్ కపుల్స్, బుల్లితెర మెగాస్టార్ ప్రభాకర్, లేదా ఆయన కుమారుడు చంద్రహాస్ వంటి సెలబ్రిటీలు పాల్గొంటారని విపరీతంగా టాక్ వచ్చింది. కానీ, బిగ్ బాస్ ప్రారంభం అయితే తప్ప ఎవరూ పార్టిస్ పేట్ చేస్తారో తెలియదు.

రెండు సార్లు: ఇదిలా ఉంటే బిగ్ బాస్ ఒక అడల్ట్ షో అంటూ ఎంతోమంది మండిపడిన విషయం తెలిసిందే. అందులో జరిగే తతంగం మాత్రం బయట వ్యక్తులకు పెద్దగా అవగాహన ఉండదు. తాజాగా బిగ్ బాస్ హౌజ్ లో జరిగే వ్యవహారంపై మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్ సరయు షాకింగ్ విషయాలు చెప్పుకొచ్చింది. బిగ్ బాస్ సీజన్ 5, ఓటీటీ సీజన్ రెండు సార్లు పార్టిస్ పేట్ చేసిన సరయు తాజా ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

అందుకే చెబుతున్నా: "బిగ్ బాస్ మాత్రమే కాదు.. రియాలిటీ షో అంటేనే ఫేక్. కొనుక్కుని.. తిరిగి వాళ్లకే డబ్బులిచ్చి మన అనుకున్న వాళ్లని ప్రమోట్ చేసి ముందుకు తీసుకుని వెళ్లే షోనే ఈ రియాలిటీ షో. నిన్ను, నన్ను, జనాలందరినీ పిచ్చోళ్లను చేస్తున్నారు. దయచేసి ఇలాంటి షోలను చూడొద్దు. మీ టైమ్ వేస్ట్ చేసుకోవద్దు. నేను బిగ్ బాస్ కు వెళ్లి వచ్చాను కాబట్టే చెబుతున్నా" అని బిగ్ బాస్ సరయు తాజాగా తెలిపింది.

నెగెటివ్: "బిగ్ బాస్ కు వెళ్లినప్పుడు నాకు ఏం తెలియదు. జాబ్ చేస్తున్నామా.. యూట్యూబ్ వీడియోలు చేస్తున్నామా.. ఇంటికొచ్చామా.. అన్నట్లుగానే ఉండేది. కానీ, హౌజ్ లోకి వెళ్లిన తర్వాత కొంతమంది గ్రూప్ పీపుల్ కి బిగ్ బాస్ బయటే కాకుండా లోపల కూడా సపోర్ట్ ఉండేది.
ఇన్నర్ సపోర్ట్ ఉందంటే వాళ్ల కాన్ఫిడెన్స్ నెక్ట్స్ లెవెల్ లో ఉండేది. అలాంటి వాళ్లపై ఫైట్ చేసినా మనం నెగెటివ్ అయిపోయేవాళ్లం. చాలా ఒత్తిడికి లోనవుతాం. తిరిగి మనం జనం దగ్గరకు వచ్చాకా మనల్ని చూసి నవ్వుతారు. అది చాలా బాధగా ఉంటుంది" అని సరయు చెప్పుకొచ్చింది.


Click it and Unblock the Notifications











