‘బిగ్‌బాస్ షో వల్ల ఎవరికి ఉపయోగం లేదు.. నాగార్జున లాభ పడటం తప్పా’
దక్షిణాది సినిమా పరిశ్రమలో షకీలా.. ఈ పేరు తెలియని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. 16 ఏళ్ల కుర్రాడి నుంచి 90 ఏళ్ల వృద్ధుడి వరకు ఆమె ఫ్యాన్సే. 90వ దశకంలో దక్షిణాది చిత్ర పరిశ్రమను, ముఖ్యంగా మలయాళ ఇండస్ట్రీని ఒక ఊపు ఊపింది.
షకీలా సినిమా రిలీజ్ అవుతుందంటే చాలు మమ్ముట్టి, మోహన్‌లాల్, సురేష్ గోపీ వంటి అగ్ర కథనాయకులే సైతం భయపడి తమ రిలీజ్‌లు ఆపుకునేవారంటే అతిశయోక్తి కాదు. స్టార్స్ సినిమాలకు మించి షకీలా సినిమాలు కలెక్షన్ల వర్షం కురిపించేవి. ఒకానొక దశలో ఆమె రోజుకు రూ.4 లక్షల రెమ్యూనరేషన్ తీసుకునే వారంటే షకీలా రేంజ్ ఏంటో అర్ధం చేసుకోవచ్చు.

కానీ జీవితం ఎప్పుడూ ఒకేలాగా ఉండదు కదా. బీగ్రేడ్ సినిమాలకు బ్రాండ్ అంబాసిడర్‌గా నిలిచిన ఆమె జీవితమంతా కష్టాలమయం. తన సినిమాలు సూపర్‌స్టార్లకు పోటీగా మారడంతో మలయాళ మెగాస్టార్ సీరియస్‌గా తీసుకుని తన చిత్రాల విడుదలకు ఆయన ఆటంకం కలిగించేవారని షకీలా ఒక సందర్భంలో ఆరోపించింది.
షకీలను జనం మరిచిపోతున్న దశలో గతేడాది బిగ్‌బాస్ 7 తెలుగు సీజన్‌లో ఓ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చి షాకిచ్చారు. అయితే ఎక్కువ రోజులు హౌస్‌లో ఉండలేక త్వరగానే ఎలిమినేట్ అయ్యారు. బిగ్‌బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత షకీలా వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు.

బిగ్‌బాస్ వల్ల ఎంతమందికి ఫేమ్ వచ్చింది, ఎంతమంది నిలబడ్డారు.. నాగార్జునకు తప్పించి అక్కడ ఎవరికీ ప్లస్ ఉండదని ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. స్టూడియో వాళ్లదే, హోస్ట్ ఆయనే కాబట్టి ఏం జరిగినా నాగ్‌కే బెనిఫిట్ అని షకీలా అన్నారు. గత బిగ్‌బాస్‌కు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి దీనిపై బిగ్‌బాస్ నిర్వాహకులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.
ఇదిలా ఉండగా, షకీలా గత సీజన్‌లో షోలోకి వచ్చింది. నిజాయితీగా ఆడేందుకు ప్రయత్నించినట్టు కనిపించారు. అయితే ఆమె యువతతో పోటీ పడలేక ఇంటి నుంచి ఎలిమినేట్ అయింది. ఆ తర్వాత ఆమె మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.


Click it and Unblock the Notifications











